అనువాదం

ఇస్లామోఫోబియా ఎందుకు?

2024 జూలై లో, ఇంగ్లండ్‌లోని అనేక నగరాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు వార్తలు, ప్రజల్లో ఉన్న వలస వ్యతిరేక భావాలు. అల్లర్ల బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు. మసీదులు, వలసదారులు నివసించే ప్రదేశాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి హింసను నిరోధించే లక్ష్యంతో ఇంగ్లాండులోని 'ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్' ఒక నివేదికను విడుదల చేసింది. "ముస్లింలు కత్తి చూపించి ఇస్లాంను వ్యాప్తి చేశారు" అని చెప్పడాన్ని నిషేధించాలని నివేదిక పేర్కొంది. ఈ విశ్వాసం ఇస్లామోఫోబియాకు మూలమైన విషయాలలో ఒకటి. అనేక ఇతర అపోహలు, దురభిప్రాయాలు ప్రజల మనస్సులలో లోతుగా