ఆకాంక్ష
శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల మాటునదాగే ప్రశ్నవిరుచుకుపడుతుందని వాడి వెన్నులో వణుకు నాటిన ప్రతి మొక్కఓ ఆయుధ భాండాగారమౌతుందేమోననికలవరింతకాకులే కాపలాగాఅరిచే అరుపుఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననేభావి స్వప్నం వాడ్ని నిదుర పోనీయట్లేదేమో శరదృతువు లోకాచే వెన్నెల్లోపల్లె బతుకుల్లో వెలుగులు నింపే దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు వాడ్నినిలువెత్తు గొయ్యిలోపాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనేఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనానెరవేరుతుంది లే