“నేను జైలు నుండి బయటపడటం యాదృచ్ఛికమే”
'నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ' ' అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం










