ప్రేమమయి, సాంస్కృతిక వారధి
(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని విస్తృత సామాజిక సంబంధాలతో కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో