అంబేద్కర్ అస్తిత్వవాది కాదు -అచ్చమైన దేశీయ ఆధునికతా వాది
భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్. అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక 'నాగరిక' సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో