తొలి తరం విప్లవ రచయితశ్రీపతికి నివాళి
ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట










