2010 రోజుల ఏకాంత వాసం
జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా 2010 రోజులు.. జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ 2024 ఫిబ్రవరి29 న, ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు. "అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది" అని ఆసిఫ్ 67 ఏళ్ల










