తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు
‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి కుదురు










