బోనులో మోడీ సర్కార్
పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' ''ది బ్యాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్టు పవర్‌ఫుల్ సైబర్ వెపన్'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్ కోసం ఎన్‌ఎస్‌వోతో










