సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,
వ్యాసాలు సాహిత్యం

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
సాహిత్యం వ్యాసాలు

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
సాహిత్యం కవిత్వం

ఆకలి జోలె

జోలెకుఅటు అతడుఇటు నేను.. మా ఇద్దరి మధ్యజోలె పెరు ఆకలి.. అల్యూమినియం బిళ్ళ కోసంఇద్దరిని దేహీ అంటూ అడిగిందిదేశ భవిష్యత్తు.. జోలెకు అటువైపు వ్యక్తి..ప్రభువు దుఃఖంతో నిండినదరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..ఇటు వైపు నేను..వస్తే ఛిద్రమైతూమనమద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను.. రాం, రహీం,జీసస్ఎవరచ్చిన అంగట్లోఅర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్నభవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?అంతటి ధైర్యం చేస్తారా..? (కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)21/01/2022
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను
సాహిత్యం కవిత్వం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా
కవిత్వం సాహిత్యం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
సాహిత్యం గల్పిక

పుస్తకాయుధాలు

ప్రసాద్‌, మన వీధంత పోలీసులంట. ఏమయ్యిందో ఏమిటో?’’ పొద్దున్నె నా భార్య అనే సరికి, నిద్రెగిరిపోయి లేచి కూర్చున్న ‘‘ఏంది?’’ తిరిగడిగిన అనుమానంతో ‘‘మన పక్క ప్లాట్‌ అంకుల్‌ పాల పాకెట్‌ కోసం పోతే వీధిల ఎవరిని లోపలికి, బయటకు కదలనీయటం లేదట, వందల మంది పోలీసులు...’’ మెదడు వేగంగ పనిచేయసాగింది. విషయం అర్థమైంది. కాని ఇంత త్వరగా వస్తారని ఊహించలేకపోయా! అయినా ఇంత మంది రావుడేమిటి ? అనుమానం తీరక విషయం తెలుసుకుందామని, లుంగిమీదనె బయలుదేరబోతుండగా, నాకు బయటకు పోయె శ్రమ తగ్గించారు! ముందు డోర్‌ను సుతారంగ పగులగొట్టి సాయుదులు లోపలికొచ్చారు. డోర్‌ దగ్గర మరికొంత మంది
సాహిత్యం వ్యాసాలు

చింతామణిపై నిషేధం చెల్లేనా?

సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.   కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్‌ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై