సమకాలీనం

గెస్టపోలాంటిదే ఎన్ఐఎ

వర్సైల్స్ ఒడంబడిక* లోని అవమానకరమైన నిబంధనలు జర్మన్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయి. ఈ ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని, ఆర్థిక  స్వాతంత్య్రాన్ని  అంతం చేసింది. వారు విజేతల ముందు తలవంచవలసి వచ్చింది (ట్రిపుల్ అలయన్స్). వర్సైల్స్ ఒప్పందం ప్రకారం, జర్మనీ $33 బిలియన్ డాలర్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది; విలువైన విదేశీ వలసలను వదులుకుంది; ఫ్రాన్స్, పోలాండ్‌లకు తన స్థానిక భూములలో విలువైన భాగాలను అప్పగించింది. జర్మన్ సైన్యం గణనీయంగా తగ్గిపోయింది; జలాంతర్గాములు లేదా వైమానిక దళం నిషేధానికి గురయింది. "మేము జర్మన్ నిమ్మకాయను దాని విత్తనాలు కేకలు వేసే వరకు పిండి పిప్పి చేస్తాం!"1 అని ఒక