“ఎన్నికల బహిష్కరణ” నినాదం – ప్రాముఖ్యత
(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం ) ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్