ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!
(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే










