భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని విస్తరించాలని ఒక అదానీ కంపెనీ యోచిస్తోంది. సమీపంలోని గనులు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటుల కాలుష్యం కారణంగా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2024 జూలైలో, రాయగఢ్ సమీపంలో అదానీ విద్యుత్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనపై అధికారిక బహిరంగ విచారణలో, గ్రామస్తులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. విస్తరించిన ప్లాంట్ ప్రతి సంవత్సరం 4 మిలియన్ టన్నుల బొగ్గు బూడిద అవశేషాలను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, స్థానిక రహదారులపై బొగ్గును ట్రక్కులతో రవాణా చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని కలుషితం చేసినందుకు సంబంధిత అదానీ కంపెనీకి 740,000 డాలర్ల (రూ. 6,21,23,148.00) జరిమానా విధించారు.
ప్రాథమిక వాస్తవాలు- గణాంకాలు
• ప్రాజెక్టు పేరు: రాయగఢ్ థర్మల్ పవర్ ప్లాంట్
• యజమాని: రాయగర్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ (అదానీ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ)
• స్థానం: బడే భండార్ – ఛోటే భండార్, పుసోర్, జిల్లా: రాయగఢ్, ఛత్తీస్‌గఢ్
• సామర్థ్యం: 600 మెగావాట్లు
• ప్రతిపాదిత విస్తరణ: ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్ల నిర్మాణం (మొత్తం 1.6 గిగావాట్ల విస్తరణ)
• మొత్తం ప్రాజెక్టు వ్యయం (ప్రస్తుత యూనిట్ వ్యయంతో సహా): 16,500 కోట్ల రూపాయలు (2 బిలియన్ డాలర్లు)
• విస్తరణ వ్యయం: 13,600 కోట్ల రూపాయలు (1.6 బిలియన్ డాలర్లు)
• స్థితి: పనిచేస్తోంది (విస్తరణ జరుగుతోంది)
అదానీ యాజమాన్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను విస్తరించే ప్రతిపాదనపై మధ్య భారత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లోని స్థానిక సముదాయంలో అత్యధికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. 2024 జూలై 12 న జరిగిన బహిరంగ విచారణలో, ఈ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే వందలాది మంది స్థానిక ప్రజలు విస్తరణకు వ్యతిరేకంగా బలమైన నిరసనలను నమోదు చేశారు, ఇది విషపూరిత ఫ్లై యాష్ (ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే బూడిద) ఉత్పత్తిని, యితర కాలుష్యాన్ని పెంచుతుందని, ఈ ప్రాంతానికి పర్యావరణ ముప్పుగా మారుతుందని చెప్పారు. జిల్లాలోని అనేక బొగ్గు విద్యుత్ ప్లాంట్‌లు, బొగ్గు గనుల కారణంగా రాయ్‌గఢ్ ఇప్పటికే విషపూరిత ఫ్లై యాష్ తదితర కాలుష్య ప్రభావాలను ఎదుర్కొంటోంది.
పుసోర్ తెహసిల్ (పరిపాలనా విభాగం) లో అదానీ 600 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటును విస్తరించే ప్రతిపాదనపై ఈ విచారణ జరిగింది. ఈ ప్రాజెక్టును 2200 మెగావాట్లకు విస్తరించేందుకు రెండు యూనిట్లకు అదనంగా 800 మెగావాట్ల విద్యుత్‌ను జోడించాలని భావిస్తోంది. 13,600 కోట్ల రూపాయల (1.6 బిలియన్ డాలర్లు) వ్యయంతో చేపట్టనున్న ఈ విస్తరణ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను అంచనా వేయడానికి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ పవర్ లిమిటెడ్‌కు ఆగస్టు 2023లో మోదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
జిల్లాలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే ఉన్న థర్మల్ ప్లాంట్లు, బొగ్గు గనుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం వల్ల బాధపడుతున్నాయని రాయ్‌గడ్‌కు చెందిన ప్రచారోద్యమకారుడు రాజేష్ త్రిపాఠి అన్నారు. ‘బొగ్గును కాల్చడం ద్వారా ఉత్పన్నమయ్యే ఫ్లై యాష్‌ను ఇక్కడ దాదాపు అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్లక్ష్యంగా పారవేస్తాయి. ఈ ప్రాంతం లోని రెండు ప్రధాన నదుల సంగమంలోకి ఫ్లై యాష్‌ను పారవేసే సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి పర్యవేక్షణ లేదు.’
ఈ విస్తరణ వల్ల కనీసం నాలుగు గ్రామాలు – చోటే భండార్, బడే భండార్, సర్వానీ, మాలీ భానునా నేరుగా ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం 355.71 హెక్టార్లు; ఇందులో 600 మెగావాట్ల ప్రస్తుత సదుపాయం ఉంది. ప్రాజెక్టు స్థలానికి సమీపంలో మహా నది, దాని ఉపనది మాండ్ ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు స్థలానికి దక్షిణాన మహానది 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, దక్షిణ-పశ్చిమాన మాండ నది 1.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
“ఈ ప్లాంటులో బొగ్గు వినియోగం పెరగడం వల్ల ఫ్లై-యాష్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కాలుష్యం పెరుగుతుంది” అని త్రిపాఠి అన్నారు. ఫ్లై యాష్ వల్ల వ్యవసాయం, అటవీ ఉత్పాదకత తగ్గడమే కాదు, నీటి వనరులు కూడా దెబ్బతిన్నాయి.
నాలుగు ప్రభావిత గ్రామాలకు మించి జిల్లా మొత్తం జనాభా జీవనోపాధి ప్రమాదంలో ఉంది. బొగ్గు కర్మాగారం విస్తరణకు పర్యావరణ ఆమోదం ఇవ్వడానికి ముందు రాయ్‌గఢ్ మరింత “అభివృద్ధి కార్యక్రమాల”వల్ల కలిగే కాలుష్య భారాన్ని భరించగలదా అని నిర్ణయించడానికి ప్రస్తుత అధ్యయన ఫలితాల కోసం ప్రభుత్వం వేచి ఉండాల్సింది.
కొత్త గనులను, బొగ్గు విద్యుత్ ప్లాంట్లను ఈ ప్రాంతం తట్టుకోగలదా అని నిర్ణయించడానికి ఛత్తీస్‌గఢ్ కాలుష్య నియంత్రణ సంస్థ అయిన ఛత్తీస్‌గఢ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ బోర్డు ద్వారా ప్రస్తుతం ఒక సామర్థ్య అధ్యయనం జరుగుతోంది. ముంబై, భిలాయ్ నగరాల్లో ఉన్న ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఏదేమైనా, అదానీ తన విద్యుత్ ప్లాంట్‌ను విస్తరించాలని యోచిస్తున్న పుసోర్ బ్లాక్ ప్రాంతంలో ఈ అధ్యయనం జరగడం లేదు, కానీ రెండు వేర్వేరు పరిపాలనా బ్లాక్‌లలోని గర్ఘోడా, తమ్నార్ ప్రాంతాలలో జరుగుతోంది.
ఫ్లై-యాష్ కాలుష్యం వల్ల జీవనోపాధి దెబ్బతిన్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ సముదాయాలకు చెందినవారు. జిల్లాలో ఎక్కువ మంది ఆదివాసీ కుటుంబాలు ఉన్నందున జిల్లా పరిపాలనలో భారత రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. అయితే, విద్యుత్ ప్లాంట్లు, గనులను సొంతం చేసుకున్న కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం తమ ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని స్థానిక సముదాయాలు పదేపదే ఆరోపించాయి.
2019 అక్టోబరులో భారత ప్రముఖ పర్యావరణ న్యాయస్థానం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పూర్తి చేసిన ఒక అధ్యయనం ప్రకారం, తమ్నార్, గార్గోడా బ్లాకుల్లోని 12 విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ మొత్తం సంవత్సరానికి 6,628,283 టన్నులు.
అదానీ గ్రూప్ తన ప్రస్తుత సదుపాయం నుండి ఫ్లై యాష్‌ను పారవేసేందుకు చేసిన ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా లేవు. కేంద్ర విద్యుత్ అథారిటీ (సిఇఎ) తాజా నివేదిక ప్రకారం, అదానీ పవర్ లిమిటెడ్ 2022 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ప్లాంట్ నుండి ఉత్పత్తి చేసిన మొత్తం ఫ్లై యాష్‌లో 35.76% మాత్రమే సరిగా పారవేసింది. ఆరు నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ 0.5673 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ ను ఉత్పత్తి చేసిందని, ఇందులో 0.2029 మిలియన్ టన్నులను మాత్రమే పరిశ్రమ, మౌలిక సదుపాయాల పనులకు భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉపయోగించుకోగలిగామని నివేదిక పేర్కొంది. మిగిలిన ఫ్లై యాష్‌ను బొగ్గు కర్మాగార సంక్రమిత వ్యర్థాలకు కలిపారు. 2.44 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ విద్యుత్ ప్లాంట్ సమీపంలో ఉపయోగించకుండా పడి ఉందని నివేదిక పేర్కొంది.
విద్యుత్ కర్మాగారాలు ఉత్పత్తి చేసే ఫ్లై యాష్‌ను పారవేసేందుకు భారతదేశ అగ్రశ్రేణి కాలుష్య నియంత్రణ సంస్థ వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించింది. బొగ్గు విద్యుత్ ప్లాంట్లు తమ వద్ద ఉన్న బూడిదను 2017 డిసెంబర్ నాటికి పర్యావరణ అనుకూల పద్ధతిలో పారవేయాలని భారత ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఈ గడువును ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా పొడిగించింది.
విస్తరణ ప్రాజెక్టు కోసం కొత్త ఫ్లై-యాష్ చెరువును నిర్మించాలని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ యోచిస్తోంది. అదనపు విష వ్యర్థాలను నిల్వ చేయడానికి 72.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న యాష్-డైక్ ప్రాంతాన్ని ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వ్యర్థాలను బురద రూపంలో నిల్వ చేస్తారు.
2X800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తయ్యే నాటికి యాష్ చెరువు నిల్వలు సుమారుగా 50 శాతం వినియోగించబడతాయని, ప్రస్తుతం ఉన్న యాష్ చెరువులో ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించని యాష్ కోసం ఉపయోగించనున్నారని అంచనా వేయడంవల్ల ఎపిఎల్ [అదానీ పవర్ లిమిటెడ్], రాయ్‌గఢ్ యాష్ చెరువును విస్తరించాలని భావించలేదు” అని ప్రాజెక్టు ప్రతిపాదకుడు తన పర్యావరణ ప్రభావ అంచనా ఎగ్జిక్యూటివ్ సారాంశ నివేదికలో పేర్కొన్నాడు.
కర్మాగారం విస్తరణ ద్వారా మొత్తం ఫ్లై-యాష్ ఉత్పత్తికి సంబంధించి అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ తయారుచేసిన వివిధ పత్రాలలో డేటా వైరుధ్యాలు బయటపడ్డాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (మంత్రిత్వ శాఖ) నుండి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం కోసం సూచన నిబంధనలను కోరినప్పుడు, రెండు అదనపు యూనిట్లు సంవత్సరానికి 3.83 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (ఎమ్‌టిపిఎ) ను ఉత్పత్తి చేస్తాయని ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు వెల్లడించారు. అయితే, తరువాత సంకలనం చేసిన పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనంలో, ఈ రెండు యూనిట్లు రోజుకు 11,330 టన్నుల ఫ్లై యాష్ ఉత్పత్తి చేస్తాయని తెలిపింది. ఇది సంవత్సరానికి 4,135,450 టన్నుల ఫ్లై యాష్ – సుమారు 4.16 ఎమ్‌టిపిఎ కు సమానం.
ప్రాజెక్టు నివేదిక ప్రకారం, రెండు కొత్త యూనిట్ల వార్షిక బొగ్గు అవసరం సుమారు 8.15 ఎమ్‌టిపిఎ. ఈ బొగ్గును సమీప రైల్వే సదుపాయం నుండి “30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ ప్లాంట్‌కు రోడ్డు నెట్‌వర్క్ ద్వారా రవాణా చేయనున్నారు” అని ప్రాజెక్టు ప్రతిపాదకుడు వెల్లడించాడు.
భూ సేకరణ ప్రక్రియలో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక రైల్వే సైడింగ్ నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. 2020 ఏప్రిల్‌లో, స్థానిక రహదారులపై బొగ్గు రవాణాను ముగించే గడువును ఒక సంవత్సరం పొడిగింపుకు మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ కొత్త గడువు కొంతకాలం క్రితం ముగిసింది. అదానీ గ్రూప్ యాజమాన్యంలోని విద్యుత్ ప్లాంట్‌తో సహా వివిధ విద్యుత్ ప్లాంట్‌ల పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2023 జనవరిలో జరిమానాలు విధించింది. అదానీ గ్రూపు పై విధించిన జరిమానా 740,000 యుఎస్ డాలర్లు.
కానీ అదానీ పవర్ లిమిటెడ్‌తో సహా కొన్ని కంపెనీలు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుండి జరిమానాలు చెల్లించి తాత్కాలిక నిషేధాన్ని పొందడంలో విజయం సాధించాయి. ఈ కేసును హైకోర్టు 2024 మే 6న పరిష్కరించింది. అయితే, కోర్టు ఇంకా తన వెబ్‌సైట్‌లో ఆదేశం కాపీని పెట్టలేదు.
2023 జనవరిలో రాయ్‌గఢ్‌ను సందర్శించిన అనంతరం అదానీవాచ్ ప్రచురించిన ఒక కథనంలో విద్యుత్ ప్లాంట్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికే బొగ్గు ధూళి, ఇతర కాలుష్య కారకాలు, శబ్దం, విద్యుత్ ప్లాంట్ ప్రస్తుత 600 మెగావాట్ల యూనిట్ నుండి స్థానిక రహదారుల ప్రమాదకరమైన రద్దీ ప్రభావాలను ఎలా ఎదుర్కొంటున్నారో ఎత్తి చూపింది.
8 ఆగస్టు 2024
fearing_toxic_residues_locals_fight_an_adani_coal_power_project_in_central_india