1 
కామ్రేడ్ శంకర్

ఓరుగల్లు పోరుబిడ్డ కామ్రేడ్ శంకర్
వీరయోధుడా కామ్రేడ్ శంకర్ నీకు అరుణారుణ జోహార్లు
చల్లగరిగ గ్రామంలో పురుడుపోసుకున్నవు నువ్వు
ప్రపంచాన్ని మార్చడానికి పోరుబాటపట్టినవు
సమసమాజ స్థాపనకు సాయుధుడివైనవు
కన్నతల్లి ఒడి నుండి అడవి తల్లి ఒడికి చేరావు
పీడిత ప్రజలకు పోరు బిడ్డవైనావు
ఉత్తర తెలంగాణ ఉరుము నీవు
ఉత్తర తెలంగాణ సరిహద్దులు దాటుకొని
దండకారణ్యంలో అడుగు పెట్టిన వాడా
శంకర్ పేరుతో జనంతో చెలిమి చేసినవా
ఉత్తర బస్తర్ ఆదివాసీల గుండెల్లో గూడుకట్టుకున్నవా
ప్రజలను పోరుబాటలో నడిపించినావా
ఆపటోల-కల్పర్ అడవుల్లో శత్రువు తూటకు నేలకొరిగినావా

మెరిసేటి మెరుపై, మేఘ గర్హనవై తిరిగి వస్తావా,
ఆకాశంలో అరుణతారవై ప్రకాశిస్తా
పొడిచేటి పొద్దులో, విరిసేటి ఎర్రమందారంలో
నీ రూపాన్ని చూద్దుమా
ప్రజా యుద్ధ కెరటమై వస్తవా
ప్రజల గుండెల్లో విప్లవ జ్యోతివై వెలుగుతవా

నాగేటి చాళ్లల్లో నీవు పోరు మొలకవై మొలుస్తవా

గెరిల్లా వీరులకు రాజకీయ గురువై పాఠం చెప్తవా
ప్రజలను సంఘటితం చేసేందుకు ఆర్గనైజరువై వస్తవా
దండకారణ్యం ప్రజాపోరుకు నువ్వు చుక్కానివైతవా
నువ్వు కలలు కన్న సమాజాన్ని స్థాపిస్తామని శపథం చేస్తున్నాం


2
కామ్రేడ్ రజిత

ఆదిలాబాద్ జిల్లా పోరుగడ్డ నీది
బోధ్, ఖానాపుర్, సింగపుర్ పోరుమల్లె నీవమ్మ
డేడ్రా గ్రామంలో పురుడుపోసుకున్నవమ్మ
దోపిడీ రాజ్యాన్ని కూల్చ పోరు దండులో కల్సినవా
సమాజాన్ని మార్చనీకి బందూకు పట్టినవా
ప్రజలే ప్రాణమని పోరే జీవితమని
ఉద్యమంలో అడుగుపెట్టినవా
పేదల గుడిసెల్లో చిరుదీపపై వెలిగావు
ప్రజల గుండెల్లో నీవు నిలిచిపోయినావమ్మ
గెరిల్లా డాక్టర్ గా ప్రజలకు సేవ చేసినావు
యుద్ధంలో నీవు వీర వనితవు
మహిళా విముక్తి పోరు జెండావు
ఆటుపోట్లలో రాటుదేలిన రణరంగ వీరవనితవు
ఆపటోల నరసంహారంలో నువ్వు నేలకొరిగినావా
రజితా, నీకు లేదు మరణం
నీ త్యాగం వృధా కాదు ఎన్నటికీ
ఇంద్రవెల్లి కొండల్లో పొద్దువై పొడుస్తవా
ప్రాణహిత గోదావరి అలలవై వస్తవా
కోకిలమ్మ పాటకు రాగానివై వస్తవా
ఆదివాసీ గుండెలలో గుర్తువై నిలుస్తవా
ఎర్ర నక్షత్రపు కాంతివి నీవు
ఆదివాసీ మహిళా విముక్తి జెండా ఎరుపులో మెరుపు నీవు
జెండాలో మెరిసే వేగుచుక్కవు నీవు
ఆకాశంలో సగం నీవు, పోరాటంలో సగం నీవు
మహిళా లోకానివి ఆదర్శం నీవు
కామ్రేడ్ రజితా,

మీరు కలలు కన్న రాజ్యాన్ని సాధిస్తమని శపథం చేస్తున్నాము

Leave a Reply