ఆయుధం అనివార్యం….
చట్టం ఒకరికి చుట్టం అయినప్పుడు
ఉన్మాదం నడి వీధిలో కవాతు చేస్తుంది
బతుకే భారంగా సాగుతున్న అమాయకపు జనాల మీద
ఉక్రోశాన్ని చూపిస్తూ
శివతాండవం చేస్తుంది
ఇది తప్పు అని ప్రశ్నిస్తే
శూలం గుండెలను చీల్చుకుంటూ
నెత్తుటి మరకలను సృష్టిస్తుంది
రామ బాణం అంత వేగంగా
బుల్లెట్ వర్షం ఇంటి గుమ్మం ముందు కురుస్తుంది
పొత్తి కడుపులో పిండాన్ని తీసి
మతం రంగు పులిమి
దేశభక్తి గా మన మెదళ్లను చెదలు పట్టిస్తుంది….
చట్టం చుట్టం అయితే
నీవు నేను కాశయపు కత్తులకు ,
ఖాకీ కర్రలకు బలికాక తప్పదు
అంతమంగా ఆయుధాన్ని పట్టక తప్పదు…….
ఈ వెన్నెల రాత్రి కన్నీటిని మిగిల్చింది…..
పచ్చని ఆకులతో అడవి చిగురిస్తున్న రోజు
చీకటిని చీల్చుకుంటూ వెన్నెల వెలుగును కురుస్తుంది
పాల కోసం ఏడ్చిన చిన్నారి
తల్లి కౌగిట్లో ముద్దుగా నిద్రపోతుంది
గతాన్ని నెమరేస్తు
నులక మంచం మీద అవ్వ చుక్కలను చూస్తుంది
వెన్నెల ఎంత బాగుందో నని ప్రేమికులు ఊసులు చెప్పుకుంటున్నారు
ఈ వెన్నెల రాత్రి ఇంత ప్రశాంతంగా సాగుతుంది……
ఒక్కసారిగా బుల్లెట్ల మోత
నిశ్శబ్ద అడవి ఇప్పుడు
రాజ్యపు గుండాల తుపాకుల మోతతో దద్దరిల్లుతుంది
మంచం మీదనుంచి లేచిన అవ్వ
ఈ రోజు ఏ తల్లికి గర్భశోకం మొనను కన్నీళ్లు పెట్టుకుంటుంది
రాత్రంతా ఆ తుపాకుల మోతతో
ఊరంతా నిద్దుర పోలేదు
తెల్లవారగానే
అక్కడికి వెళ్లి చూస్తే
మెడలు విరిచేసి, చిత్రహింసలు చేసి
హత్య చేయబడిన
అమరవీరుల మృత దేహాలు
నిత్యం మార్పు కోసం , మా కోసం పోరు చేస్తున్న
అన్నలు ద్రోహి తెచ్చిన బువ్వ లోనే
ప్రాణం పోతుంది అని పసి గటలేదు
కొన్ని గంటల ముందే ఈ వెన్నెల రాత్రి ఎంత బాగుండోనని
మురిసిపోయాను
కానీ ప్రతి వెన్నెల రాత్రి బాగుండదని
కొన్ని వెన్నెలలు వెలుగుతో పాటు కన్నీళ్లను కురిపిస్తాయని అని తెలుసుకున్నాను…..
Related