ఇప్పుడు
ఈ నేలా
ఆమె కథ వింటోంది
తన కాళ్ళూ చేతులూ
తన మనసు మాట
తన ఆలోచన ఆచరణ
తరతరాల సంకెళ్ళ విడిపించుకోడానికి
పితృస్వామిక గోడల పగలగొట్టింది
తన నవ్వుల్ని
తన ఏడ్పుల్ని
మనసార కుమ్మరించి
బతుకు కుదుట పడే పాటందుకుంది
అర్థ రాత్రి స్వాతంత్రపు
అర్థ భాగ చీకట్ల
అసాధ్య వెలుగుల కడగాలని
స్వేచ్ఛా స్వాతంత్ర్య ప్రకృతి లోకి
రెక్కలు తొడుక్కుని
జీవితానికి సీతాకోకచిలుక రంగులద్దింది
భారత స్త్రీ బానిస రంగు తూడ్చి
కడివెండి వారసత్వం అద్ది
ముట్టుకోవాల్సిన విప్లవాన్ని పరిచింది
తన చూపు నిండా
స్త్రీ విముక్త పుప్పొడి వెదజల్లుతూ
మనుషుల నిండా నిండింది

స్త్రీ విముక్త పుప్పొడి వెదజల్లుతూ