“వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం.”
పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్, లెస్లీ జామిసన్, లైలీ లాంగ్ సోల్జర్, ఓషన్ వూంగ్ తదితర వందల మంది రచయితలు “పాలస్తీనియన్ల విపరీతమైన అణచివేతకు సహకరించే లేదా మౌనంగా ఉన్న ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థలతో”తాము పని చేయమని ప్రతిజ్ఞ చేస్తూ బహిరంగ లేఖపై సంతకం చేశారు.
4 నవంబర్ 2024: ఒక వారం క్రితం ఈ లేఖ ప్రచురితమైనప్పటి నుండి, 5,500 మంది రచయితలు, పుస్తక ముద్రణా రంగంలో పనిచేస్తున్న కార్మికులు, సహకరిస్తున్న ఇజ్రాయెలీ ప్రచురణకర్తలను బహిష్కరిస్తామని పబ్లిక్ ఫోరమ్ ద్వారా సంతకం చేసారు. బహిష్కరణలో చేరిన ప్రముఖ రచయితలు రాబర్ట్ మాక్ఫార్లేన్, మైఖేల్ రోసెన్, జెస్మిన్ వార్డ్, కేటీ కితామురా, బెంజమిన్ మోజర్, హెలెన్ మక్డోనాల్డ్, కీస్ లేమోన్, అక్వేకే ఎమెజీ, క్రిస్ క్రాస్, యూరి హెర్రెరా, పాల్ బి. ప్రెసియాడో, యాన్ రాబ్ డెలానీ, మార్క్నే వాల్డ్మాన్ హాడన్, రోనన్ బెన్నెట్, జాన్ కుసాక్, జెఫ్ హాల్పర్, కెవిన్ బారీ, కాలేబ్ అజుమా నెల్సన్, డామన్ గల్గుట్, అలెగ్జాండర్ హేమోన్, లైలా లాలామి, అన్నీ బేకర్, నీలమణి, రాబిన్ కోస్ట్ లూయిస్, టామ్ మెక్కార్తీ, సాల్ విలియమ్స్, డేనియల్ అలార్కాన్, గ్రెటా థన్బెర్గ్ తదితరులు.
ఈ లేఖ ఇజ్రాయెల్ సాంస్కృతిక రంగానికి సంబంధించి ప్రపంచ సాహిత్య సంఘం చేసిన అత్యంత శక్తివంతమైన ఖండన ప్రకటన; సాంస్కృతిక బహిష్కరణకు అతిపెద్ద నిబద్ధతను సూచిస్తుంది.
ఈ అన్యాయాలను సాధారణీకరించడంలో సంస్కృతి సమగ్ర పాత్ర పోషించింది. ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థలు, తరచుగా రాజ్యంతో నేరుగా పని చేస్తాయి, దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్ల నిర్మూలన, అణచివేతను మరుగుపరచడం , మారురూపం వేయడం, కళాత్మకంగా మార్చడంలో కీలకపాత్ర వహించాయి.
మనం పోషించాల్సిన పాత్ర ఉంది. వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారించకుండా మేము మంచి మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో పనిచేయలేం. దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా లెక్కలేనంత మంది రచయితలు తీసుకున్న దృష్టికోణం ఇది; అది అక్కడ వర్ణవివక్షకు వ్యతిరేక పోరాటానికి వారిస్తున్న సహకారం.
పాలస్తీనియన్లపై అమలవుతున్న తీవ్ర అణచివేతకు సహకరించే లేదా మౌనంగా ఉన్న ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థలతో మేము పని చేయం.
బుకర్ నుండి పులిట్జర్ వరకు, నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ ఫిక్షన్ ఫర్ ఉమెన్స్ ప్రైజ్ వరకు-ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రధాన సాహిత్య పురస్కారానికి అనేకమంది విజేతలు, ఫైనలిస్టులు ఈ లేఖపై సంతకం చేసారు; పుస్తక ప్రపంచంలో అందరినీ సహకరించమని పిలుపునిస్తున్నారు:
ఈ సంస్థలతో కలిసి పనిచేయడం అంటే పాలస్తీనియన్లకు హాని కలిగించడమే, కాబట్టి మా తోటి రచయితలు, అనువాదకులు, ఇలస్ట్రేటర్లు, పుస్తక కార్మికులు ఈ ప్రతిజ్ఞలో మాతో కలవాలని మేము పిలుపునిస్తున్నాం. మా స్వంత ప్రమేయాన్ని, మా స్వంత నైతిక బాధ్యతను గుర్తించడంలోనూ , ఇజ్రాయెల్ రాజ్యంతో, ఇజ్రాయెల్ భాగస్వామ్య సంస్థలతో పనిచేయడాన్ని మానేయడంలో మాకు మద్దతు నివ్వాలని మేము మా ప్రచురణకర్తలు, సంపాదకులు, ఏజెంట్లకు పిలుపునిస్తున్నాం.
లేఖ :
రచయితలు, ప్రచురణకర్తలు, సాహిత్య ఉత్సవ కార్మికులు, ఇతర పుస్తక కార్మికులుగా మేము 21వ శతాబ్దపు అత్యంత లోతైన నైతిక, రాజకీయ, సాంస్కృతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల ఈ లేఖను ప్రచురిస్తున్నాం. పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న తీరని అన్యాయాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుత యుద్ధం మన ఇళ్లలోకి ప్రవేశించి మన హృదయాలను తాకింది.
ఇక్కడ అత్యవసర పరిస్థితి ఉంది: ఇజ్రాయెల్ నివసించడానికి వీలులేనిదిగా గాజాను మార్చింది. అక్టోబరు నుండి ఇజ్రాయెల్ ఎంత మంది పాలస్తీనియన్లను చంపిందో ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యం కాదు; ఎందుకంటే మృతులను లెక్కించే, పాతిపెట్టే సామర్థ్యంతో సహా ఇజ్రాయెల్ అన్ని మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. అక్టోబరు నుండి గాజాలో ఇజ్రాయెల్ కనీసం 43,362 మంది పాలస్తీనియన్లను చంపిందని, ఈ శతాబ్దంలో పిల్లలపై ఇదే అతిపెద్ద యుద్ధం అని మనకు తెలుసు.
ఇది మారణహోమమని ప్రముఖ నిపుణులు, సంస్థలు నెలల తరబడి చెబుతున్నాయి. ఇజ్రాయెల్ అధికారులు గాజా జనాభాను నిర్మూలించడానికి; పాలస్తీనా రాజ్యాధికారాన్ని అసాధ్యం చేయడానికి; పాలస్తీనా భూమిని స్వాధీనం చేసుకోవడానికి గల తమ ఉద్దేశ్యం గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారు. నిర్వాసిత్వం, జాతి ప్రక్షాళన, వర్ణవివక్షలు గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.
ఈ అన్యాయాలను సాధారణీకరించడంలో సంస్కృతి సమగ్ర పాత్ర పోషించింది. ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థలు, తరచుగా రాజ్యంతో నేరుగా పని చేస్తాయి, దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్ల నిర్మూలన, అణచివేతను మరుగుపరచడం , మారురూపం వేయడం, కళాత్మకంగా మార్చడంలో కీలకపాత్ర వహించాయి.
మనం పోషించాల్సిన పాత్ర ఉంది. వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారించకుండా మేము మంచి మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో పనిచేయలేం. దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా లెక్కలేనంత మంది రచయితలు తీసుకున్న దృష్టికోణం ఇది; అది అక్కడ వర్ణవివక్షకువ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వారికిస్తున్న సహకారం.
అందువల్ల, పాలస్తీనియన్లపై అమలుజరుగుతున్న తీవ్ర అణచివేతకు సహకరించే లేదా మౌనంగా ఉన్న ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థలతో కలిసి మేము పని చేయం. ప్రచురణకర్తలు, సాహిత్య ఉత్సవాలు, సాహిత్య సంస్థలు, ప్రచురణలతో సహా ఇజ్రాయెల్ సంస్థలతో మేము సహకరించము:
ఎ) వివక్షాపూరిత విధానాలు, వ్యవహారాల ద్వారా లేదా ఇజ్రాయెల్ ఆక్రమణ, వర్ణవివక్ష లేదా మారణహోమాన్ని కప్పిపుచ్చడం, సమర్థించడంతో సహా పాలస్తీనియన్ హక్కులను ఉల్లంఘించడంలో భాగస్వామిగా ఉన్నారు.
బి) అంతర్జాతీయ చట్టంలో పొందుపరచబడిన పాలస్తీనా ప్రజల అన్యాయమైన హక్కులను ఎప్పుడూ బహిరంగంగా గుర్తించలేదు.
ఈ సంస్థలతో కలిసి పనిచేయడం అంటే పాలస్తీనియన్లకు హాని చేయడమే, కాబట్టి మా తోటి రచయితలు, అనువాదకులు, చిత్రకారులు, పుస్తకముద్రణా రంగంలో పనిచేసే కార్మికులు ఈ ప్రతిజ్ఞలో మాతో చేరాలని పిలుపునిస్తున్నాం. మా స్వంత ప్రమేయాన్ని, మా స్వంత నైతిక బాధ్యతను గుర్తించడంలో, ఇజ్రాయెల్ రాజ్యంతో, ఇజ్రాయెల్ భాగస్వామ్య సంస్థలతో పనిచేయడాన్ని మానేయడంలో మాతో కలవాలని మా ప్రచురణకర్తలు, సంపాదకులు ఏజెంట్లకు పిలుపునిస్తున్నాం.
అక్టోబర్ 28, 2024