చుట్టూ ఇంత పొగ మంచు
కమ్ముకున్న వేళ
రెండు అక్షరాలు రాయకుండా
వుండలేను

జీవితం చుట్టూ ఇంత బూడిద
పడుతున్న వేళ
రెండు వాక్యాలుగా
మారకుండా వుండలేను

ఎవరి కోసమో పసిపాపల
గొంతుకోస్తున్న వేళ
రెండు కన్నీటి చుక్కలను
కాకుండా వుండలేను

భూమిని చెరబట్టి బాంబులు
కురిపిస్తున్న వేళ
వాడి చేతులలో బూబీ ట్రాప్
అయి పేలకుండా వుండలేను.

Leave a Reply