అక్కడ యుద్ధాలు రక్తపు ఎరులై
పారుతున్నాయి కూలిన నిర్మాణాల
మధ్య నలిగిన పసిహృదయాల
సంగతి నేను రాయలేను..
బాంబుల శబ్దంలో కలిసిపోయిన
ఆర్తనాదాల గురించి ఏం చెప్పమంటావ్?
అల్లారు ముద్దుగా ఆటలాడే బిడ్డలు
శవాలుగా స్మశానానికి సాగనంపుతుంటే
నేనేం మాట్లాడగలను
అక్కడ శ్వాసలు ఆగిపోయాయి
ప్రాణాలు వాయువులో కలిసిపోయాయి
ఇప్పుడు బిడ్డలు అమ్మేదని అడిగితే
సమాధానం ఎవరు చెప్పాలి
నాన్నెక్కడ అని అడిగితే సమాధానం
ఏమని చెప్పాలి
అక్కడ గాయాలు లేకుండా
బయటపడిన వారెవరులేరు హృదయానికో, శరీరానికో
తుపాకీ తూట్లు దిగుతూనే ఉన్నాయి.
