బిర్సా ను గౌరవించడమంటే
అతని ఆశయాల్ని కొనసాగించడమే.
*
అతడు మతాన్ని వదులుకున్నాడు.
నువు మతం ముసుగేసి అతడికి దండేస్తున్నావ్
ఎలా నమ్మాలి నిన్ను?
*
మా దిగంతం మాకుంది
మమ్మల్ని మేముగా బతకనివ్వన్నాడతడు
నువ్వేమో మా నేలను మోసుకుపోతున్నావ్
ఎలా నమ్మాలి నిన్ను?
*
చెట్టు మా దేవత అన్నాడతడు
నగర నవ నిర్మాణమని అడవిని ధ్వంసం చేస్తున్నావ్
ఎలా నమ్మాలి నిన్ను?
*
నను మనిషిగా మారమన్నదతడు
మరి నువ్వు?
నా గురించి మాట్లాడిన ప్రతివాడికీ
ఒక అండాసెల్ సిద్ధం చేస్తున్నావ్
ఎలా నమ్మాలి నిన్ను?
*
ఆ రోజు
అతడి గురి ఆంగ్లేయుడిపైనే
అది స్వాతంత్రపోరాటమన్నావ్
ఈ రోజు?
నాదీ స్వతంత్రపోరాటమంటే భయపడుతూ
తూటాల వర్షం కురిపిస్తున్నావ్
ఎలా నమ్మాలి నిన్ను?
*
అతణ్ణి గౌరవించాలంటే
నన్నూ గౌరవించాలి
నన్ను గౌరవించాలంటే
నా నేలను గౌరవించాలి
తుపాకి పేలని నేలను నాకు ఇవ్వగలవా?
యుద్ధవిమానమెగరని గగనాన్ని నాకొదలగలవా?
*
15.11.2024
Related
బావుంది