చివరిపిచ్చుక కొమ్మపై 
వాలింది
బతుకునిచ్చిన లోకంలో
తనకిదే ఆఖరి అరుపని
చుట్టూరా ధూళిమేఘం
కమ్ముకుంది
కూలుతున్న
ఎత్తైన ఆశలగూళ్ళ కింద నవజాతాలు
పిండాలు రూపం కోల్పోనాయి
పిచ్చుక ఉహాగానంలో ఉంది
నేను దేహాన్ని నిర్మిస్తే
మీరా దేహంలో ఎముకలగూళ్ళు
సృష్టించారు
నేనొక ప్రకృతి రమణీయమిస్తే
మీరందులో
మృదంగాల్తో మృత్యుఘోషను
కానుకిచ్చారు
రెండహాల మధ్య రణమైతే
రెండు తరాలకు సరిపడా గుండె సప్పుళ్ళు
ఈ దినమే అంకితమివ్వడమేనని
యోచిస్తోంది కాలమై నిలిచి...!

పిచ్చుక మళ్ళీ
ఊహాగానం చేస్తుంది

మనిషి యంత్రాలలోకం నుంచి
ఆదిమలోకంలోకి పయనించాలని..!
ఆయుధాలొదిలేసీ
ప్రాణుల్తో మమేకమై
ప్రకృతితో కంఠం కదిలించాలని
ఊహాగానం చేస్తోందింకా.

Leave a Reply