కామ్రేడ్‌ చలపతి 1989 నుండి తన జీవితాన్నంతా విప్లవంలో గడిపాడు.   ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని మత్యం కొత్తపల్లిలో పుట్టాడు. చిత్తూరులో చదువుకొని, మదనపల్లిలో సెరికల్చర్‌ ఉద్యోగంలో చేరాడు. 1988లో పార్వతీపురానికి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాడు. అక్కడ విప్లవ రాజకీయాలు పరిచయం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లిపోయాడు. మొదట ఆ ప్రాంతంలో  కేంద్ర ఆర్గనైజర్‌గా పని చేసాడు. 1990లో చలపతి ఉద్దానం దళ కమాండర్‌ అయ్యాడు. జీడివీక్కల వరిశ్రమలలో కూలిరేట్ల  పోరాటాల నుండి భూముల ఆక్రమణ పోరాటాలకు నాయకత్వం వహించాడు.   అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్యలపై పోరాటాలకు ప్రజలను సమీకరించాడు. ప్రజల మధ్య కోర్టులు నిర్వహించి సమస్యలు పరిష్కరించాడు.   గతంలో శ్రీకాకుళ పోరాట ప్రభావం ఉన్న ప్రాంతాలన్నిటికీ ఉద్యమం విస్తరించడంలో ఆయన పాత్ర ఉన్నది.   సవర, జాతాబు తదితర ఆదివాసుల   అభిమానాన్ని పొంది, విప్లవోత్తేజాన్ని అందించాడు. 

అనేక నష్టాల మధ్యనే ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవడంలో చలపతి పాత్ర చారిత్రాత్మకమైనది. ఉద్యమానికి ప్రజల సంపూర్ణ సహకారం అందించేలా నిర్మాణాలను, పోరాట రూపాలను ఎంచుకున్నాడు.  శ్రీకాకుళం జిల్లా నాయకుడుగా కీలక భూమికను నిర్వహించాడు.  ఆదివాసీ ప్రాంతాలలో   బాక్సైటు ఖనిజ నిక్షేపాల తవ్వకాలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు.  ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కారణాలను బలంగా ముందుకు తీసుకొచ్చాడు. అలాగే ఈస్ట్‌ డివిజన్‌లో కాఫీ తోటల భూముల ఆక్రమణ,  కాఫీ గింజల సేకరణ, కాఫీ తోటలపై ప్రజల హక్కు కోసం జరిగిన సమరశీల పోరాటాల్లో చలపతి పాత్ర, నాయకత్వం ఉన్నది. ఈ క్రమంలో కాఫీ ప్లాంటేషన్స్‌లో పని చేసే ఉద్యోగులను కూడా ఆర్గనైజ్‌ చేశాడు.  మొదట్లో కూలిరేట్ల పెంపుదల కోసం పోరాడిన

ప్రజలు  కాఫీ తోటల ఆక్రమణ పోరాట చైతన్యంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో  3 దశాబ్దాలుగా ఈస్ట్‌ డివిజన్‌లో బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం బలపడిరది. శ్రీకాకుళం-కోరాపుట్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జిగా వున్నప్పుడు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు, 1/70 అమలు పోరాటాలు ఆయన నాయకత్వంలో రాజుకున్నాయి.  నారాయణపట్నా భూపోరాటానికి కూడా ఆయన నాయకత్వం వహించాడు. కువ్వి తెగ ప్రజలను విప్లవోద్యమంలోకి నడిపించాడు. వెనుకబాటుతనం వల్ల ప్రజలకు అలవాటైన గంజాయి పండిరచడాన్ని నిరుత్సాహపరిచి, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజాస్వామిక పోరాటాలను, ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేశాడు.   

2009లో నారాయణపట్నా ప్రాంతంలో ప్రజా పోరాటాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ మీద పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు కార్యకర్తలను చంపేశారు. ఈ ప్రాంతంలోని గ్రామాల మీద అనేకసార్లు పోలీసులు దాడులు చేసి మహిళలపై అత్యాచారాలు జరిపారు. పంటలను ధ్వంసం చేశారు. ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ఇంత నిర్బంధ పరిస్థితుల్లో కూడా చలపతి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల పోరాట చేవను ఇనుమడిరపచేశాడు.   

నిర్దిష్ట పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజా పోరాటాలకు ఉన్న అవకాశాలను చలపతి పరిశీలించేవాడు. ఉద్యమ అవసరాలకు తగినట్లు తనను తాను మార్చుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లాడు.  సహనం, ఓపిక, కష్టపడే మనస్తత్వంతో ప్రజల అభిమానాన్ని పొందాడు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నా, ఉద్యమ పనులను నిర్వహించేవాడు.

జీవితమంతా విప్లవానికి అంకితం చేసి, ప్రజా పోరాటాలే శ్వాసగా చలపతి జీవించాడు. ఉన్నతస్థాయి కమ్యూనిస్టు విలువలను పుణికిపుచ్చుకొని ఆదర్శ నాయకుడిగా నిలబడ్డాడు.

ఈ ఏడాది జనవరి19 నుంచి మొదలై 22 వరకు జరిగిన ఆపరేషన్‌ కగార్‌ దాడిలో కా. చలపతితో పద్దెనిమిది మంది కామ్రేడ్స్‌  40 గంటలపాటు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. సుమారు రెండు వేల భద్రతాబలగాలు డ్రోన్లతో ముందుగా సమాచారం పసిగట్టి దాడి చేసి చుట్టుముట్టి హత్యాకాండకు పాల్పడ్డారు. ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ దాడి జరిగిందని పత్రికల్లో వచ్చింది. అత్యుత్తమ వర్గపోరాట యోధులైన ఈ పద్దెనిమిది మంది కామ్రేడ్స్‌ ప్రభుత్వ బలగాలతో పోరాడుతూ అమరులయ్యారు. వీరంతా ఈ దేశ విప్లవం కోసం తమ విలువైన ప్రాణాలు ధారపోశారు. విప్లవోద్యమంలో సీనియర్‌ నాయకుడిగా కా. చలపతి జీవితమంతా విప్లవం కోసమే వెచ్చించి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఈ యుద్ధంలో వెనకడుగు వేయకుండా పోరాడాడు. ఆయన ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంత ప్రజా పోరాటాల చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు

One thought on “జీవితమే విప్లవమైన యోధుడు

  1. ఏ సంవత్సరంలో చనిపోయాడో రాయలేదు.రాసి ఉంటే బాగుండేది.

Leave a Reply