“చెట్లు నిర్మూలమైపోతాయి, నదులు ఇంకిపోతాయి,
పర్వతాలు కుంగిపోతాయి, అరణ్యాలు దహనమవుతాయి,
భూమి భూమంతా కొల్లగొట్టబడుతుంది
సంగీతం ఆగిపోయింది, సృజనకారులను తరిమివేసారు
కవులకు విష పాత్రలిచ్చారు
చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు
శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు
తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు
అపరిచితమైన మనుషులు
బాగా తెలిసిన మనుషులను
ప్రేమికులను, ఆలోచకులను
కాల్చి చంపుతున్నారు
ప్రాణం లేని పక్షులు చెట్లమీంచి రాలినట్టు
మనుషులు కూలిపోతున్నారు
పల్లెలూ పట్నాలూ నగరాలూ
ఒకేఒక్క శోకగీతం ఆలపిస్తున్నాయి
మహా ప్రళయాలు సుడులు తిరిగి
ధ్వంసమైపోయిన భూగోళం మీది నుంచి
మానవ పాదముద్రలను తుడిచేస్తున్నాయి”
ఇది స్థానభ్రంశపు జైలుగదిలో కామ్రేడ్ సాయికి మే 14, 2018న వచ్చిన పీడకల. అహిరి కేసులో సాయితో సహా అయిదుగురికి జీవితఖైదు, ఒకరికి పది సంవత్సరాల శిక్ష పడిన సరిగ్గా ఏడాదికి.
అప్పటికి ఢిల్లీలో రోనా విల్సన్, ముంబైలో సుధీర్ ధావ్లే ఇళ్లపైన పోలీసుల దాడి మాత్రం జరిగింది. కాని ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రహార్, సమాధాన్ దశలు కూడా దాటింది. ఆరు సంవత్సరాలు గడిచిపోయి ఏడో సంవత్సరంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో దండకారణ్యంలో ఆదివాసులు, వాళ్ల మధ్యన ఉండి వాళ్లతో కలిసి పోరాడుతున్న మావోయిస్టులు 353 మందికి మించి కగార్ ఆక్రమణ యుద్ధంలో అమరులయ్యారు. ఇది శ్రీకాకుళోద్యమంలో అమరులైన ఆదివాసులకు, విప్లవకారులకు ఇంచుమించు సమానమైన సంఖ్య. కాని గుణాత్మకమైన మార్పు ఏమిటంటే ఇది సెట్ బ్యాక్ కు గురి కాలేదు. ప్రజా యుద్ధం కొనసాగుతున్నది. అప్రతిహతంగా కొనసాగుతున్నది. కామ్రేడ్ సాయి 2017 సెప్టెంబర్ 20ననే మహంగో పర్వదినాన ఆదివాసుల యుద్ధారావం గురించి రాసినట్లు,
“మేము ఇక్కడ మా భూములను స్వాధీనం చేసుకోవడానికొచ్చాం
అడవులు, పర్వతాలు, కొండలు, నదులు,
సెలయేళ్లు, వృక్షాలు, మొక్కలు, జంతువులు,
పురుగూ పుట్రా ఊళ్లూ నగరాలూ
యుగాలుగా నువ్వు కొల్లగొట్టి ఆక్రమించుకున్న
సమస్తాన్నీ స్వాధీనం చేసుకోవడానికొచ్చాం” అని నాగ జాతి వారసులు బస్తర్ లో పోరాడుతున్నారు.
అక్షరాలా మహారాష్ట్ర జైళ్లల్లో ముగ్గురు కవులకు, ఇద్దరు సృజన కారులకు విషపాత్ర ఇచ్చి చంపారు. కంచన్ నన్నావరే అనే సాంస్కృతిక కార్యకర్తకు ఎరవాడ (పూణే) జైల్లో, నర్మదకు బైకుల్లా (ముంబై) జైల్లో, స్టాన్ స్వామికి తలోజా (నవీ ముంబై) జైల్లో, పాండు నరోటేకు నాగపూర్ జైల్లో. ఆపరేషన్ కగార్ లో భాగంగా అక్టోబర్ 2024లో జి ఎన్ సాయిబాబా వ్యవస్థీకృత కారాగార హింస ద్వారా ఆసుపత్రిలో.
ఇపుడింక పంజాబ్, హర్యానా నుంచి ఉత్తర ప్రదేశ్ దాకా, నార్త్ రీజినల్ బ్యూరో కుట్రకేసు (లక్నో) పేరుతో అడ్వొకేట్లు అజయ కుమార్ (చండీఘర్), కృపాశంకర్ (అలహాబాదు) అవే జైళ్లల్లో ఉన్నారు. ఈ సందర్భంగా అరెస్టయిన వాళ్లందరినీ మావోయిస్టు పార్టీకి ఓవర్ గ్రౌండ్ వర్కర్లంటున్నారు. జార్ఖండ్ లో మరోసారి మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ మంచ్ ను నిషేధించి, దాని అధ్యక్షుడు బచ్చా సింగ్ ను రాంచీ జైల్లో పెట్టారు. బొకారోలో కార్మిక రంగంలో పనిచేసే ఆయన మావోయిస్టు పార్టీ నాయకులకు పారిశ్రామిక రంగంలో ట్రేడ్ యూనియన్ ల కాంటాక్టు అని ఆరోపిస్తున్నారు. జర్నలిస్టు రూపేష్ కుమార్ సింగ్ మూడు సంవత్సరాలుగా జైలులో ఉన్నాడు. హర్యానాలోని మానేసర్ కార్మిక నాయకుడు అనిరుధ్ ను బెంగళూరులో అరెస్టు చేసి, లక్నో కుట్ర కేసులో నిందితుడిగా బెంగళూరు జైల్లో ఉంచారు.
దుడ్డు ప్రభాకర్, శిరీష, పద్మలు రెండు సంవత్సరాలకు పైగా జగదల్ పూర్ జైల్లో మగ్గుతున్నారు. విశాఖపట్నం జైల్లో దేవేంద్ర, రాజమండ్రి జైల్లో శిల్ప కూడా అలాగే. ఇంకా తెలంగాణ జైళ్లలో ఇటీవల అరెస్టయిన కార్మిక వర్గ నాయకుడు, రచయిత, కామ్రేడ్ హుస్సేన్ మొదలు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు అనారోగ్యంతో సుదీర్ఘ జైలు నిర్బంధంలో పోరాడుతున్నారు.
ఇంకా ముఖ్యంగా, ఆదివాసుల, దళితుల, సాయిబాబా న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ భీమా కోరేగాం కేసుతో పాటు ఆహిరి (గడ్చిరోలీ) కేసులో ముద్దాయిగా ఆరున్నరేళ్లుగా జైల్లో ఉన్నాడు. హైకోర్టులో ఏడాదిన్నర క్రితం బెయిల్ వచ్చిన మహేశ్ రౌత్ కూడా ఆరున్నరేళ్లుగా జైల్లోనే ఉన్నాడు.
ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థగా విరసం, భీమా కోరేగాం కేసులోనే జైలులో ఉన్న భాషా శాస్త్రవేత్త హనీబాబు గురించి, నయీ పేష్వాయీకి, బ్రాహ్మణీయ హిందుత్వకు వ్యతిరేకంగా 2002 నుంచీ, గుజరాత్ గాయం నుంచీ ప్రచారం చేస్తున్న కబీర్ కళా మంచ్ సాంస్కృతిక కళాకారుల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోరాడవలసి ఉంటుంది. వీళ్లంతా నాలుగు సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నారు.
ఇవాళ దేశం దృష్టి అంతా సాయి అమరత్వం సందర్భంలో సంక్షోభంలో సాహిత్య భూమిక గురించి సాహిత్య పాఠశాల నిర్వహిస్తున్న విరసం పైన ఉంది. ఏబై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని స్మరించుకుంటున్న హైదరాబాదు మీద దృష్టి ఉంది. ఈ సంక్షోభాన్ని రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? గత మూడు నెలలుగా కామ్రేడ్ సాయి అమరత్వాన్ని, సూరజ్ కుండ్ వ్యూహంలో ఆదివాసులపై కగార్ ఆక్రమణ యుద్ధంలో వ్యవస్థీకృత హత్యాకాండను ప్రచారం చేస్తున్నట్లుగా ఈ రెండు మహా సందర్భాలు ముగియగానే, 1985 జూలైలో ఎ ఐ ఎల్ ఆర్ సి, విరసం, జననాట్యమండలి, ఆర్ వై ఎల్ లు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యహింస, నిర్బంధాలను ప్రచారం చేసినట్లుగా, విరసం, సి ఎల్ సి, అమరుల బంధు మిత్రుల సంఘం, ఏభై ఏళ్ల సభలు నిర్వహిస్తున్నవాళ్లు, ఢిల్లీలోని ఫోరం అగెనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్, హైదరాబాదులోని కమిటీ అగెనెస్ట్ స్టేట్ రిప్రెషన్ లు కలిసి, 1. కగార్ మారణకాండకు వ్యతిరేకంగా, 2. మూలవాసీ సాంస్కృతిక్ మంచ్ నిషేధానికి వ్యతిరేకంగా, 3. రాజకీయ ఖైదీల విడుదలను డిమాండ్ చేస్తూ 4. యుఎపిఎ, ఎన్ ఐ ఎ ల రద్దు చేయాలని, 5. సిలింగేర్ పోరాటానికి సంఘీభావంగా ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తారని ఆశిస్తూ,
విప్లవాభినందనలతో
దేశం మీ వైపు చూస్తోంది…

ప్రవాసి
(కర్నూలులో ఫిబ్రవరి తేదీలలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలకు పంపిన సందేశం)
నేను సైతం….