నారాయణపుర్ జిల్లాలోని అడవుల్లో యూనిఫాం ధరించిన ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించిన వారం తర్వాత డిసెంబర్ 19నాడు వారిలో నలుగురి స్వస్థలం కుమ్మంకి వెళ్లాను. అప్పటికే వారిని ఖననం చేసేసారు. వారు సాధారణ గ్రామస్తులని, మావోయిస్టులు కాదని, తమ పొలాలకు దగ్గరగా ఉన్న పొదల్లో భద్రతా బలగాలు చంపాయని వారి కుటుంబీకులు చెప్పారు.
డిసెంబరు 12 నాడు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్న ప్రదేశానికి గ్రామస్థులు నన్ను తీసుకెళ్లారు. ఇది కల్హాజా-దొండెర్‌బెడా అడవుల నుంచి రెండున్నర గంటల నడకదూరంలో ఉంది.
మేము ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఊహించని దుర్వాసన వచ్చింది. ముక్కు మూసుకుని దగ్గరకు వెళ్ళేసరికి, ఒక యువకుడి కుళ్ళిపోతున్న శరీరం కనిపించింది. అతను రెండు ఛాయలున్న నీలం రంగు టీ-షర్టు, షార్ట్స్ (నిక్కరు) వేసుకుని ఉన్నాడు. తల ఒక వైపుకు తిరిగి, చేతులు బయటకు చాచి, ఒక కాలు మడిచి ఉంది. తలలో పెద్ద రంధ్రం ఉంది. పురుగులు అతని కళ్ళను కప్పేసాయి.
గ్రామస్తులు అతన్ని కుమ్మం గ్రామ పటేల్, గుడ్సా ఓయం కుమారుడు నెవ్రు ఓయంగా గుర్తించారు. డిసెంబర్ 12న పోలీసు కాల్పుల్లో మరణించిన నలుగురిలో గుడ్సా ఓయం కూడా ఉన్నాడు.
ఆ మృతదేహం కనిపించడంతో, వివాదాస్పద ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఘటనల గురించి పోలీసులు చెప్పిన కథనం చుట్టూ ఉన్న ప్రశ్నలు మరింత చిక్కనయ్యాయి.
విభిన్న కథనాలు:
కుమ్మం గ్రామం నారాయణపూర్, ఓర్చా బ్లాక్‌లోని రేకావాయ పంచాయతీలో వున్నది. ఈ బ్లాక్ అబూజ్‌మాడ్‌లో ఉంది, అక్షరాలా ‘తెలియని కొండలు’. ఎక్కువగా సర్వే చేయని ప్రాంతం, దీనిని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) గెరిల్లాలు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారు.
2024 లో, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మాడ్ బచావో అభియాన్ (‘మాడ్‌ను సంరక్షించండి’ ప్రచారోద్యమం) పేరుతో మావోయిస్టు వ్యతిరేక దాడిని ప్రారంభించారు. అందులో భాగంగా, (అబూజ్)మాడ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో 100 మందికి పైగా మావోయిస్టులను చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. 2024లో బస్తర్‌లో మావోయిస్టుల హత్యలుగా పోలీసులు ప్రకటించిన 217 మరణాలలో ఇవి దాదాపు సగం.
అయితే, ‘, ఈ మరణాలలో చాలా వాటిని మృతుల కుటుంబాలు సవాలు చేస్తున్నాయి. ఈ విషయం ఇంతకు ముందే “స్క్రోల్” లో ప్రచురించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నలుగురు చిన్నారులను ఆదివాసీ నేత, కార్యకర్త సోనీ సోరి సమీపంలోని ఆసుపత్రికి తీసుకురావడంతో డిసెంబర్ 12న జరిగిన ఘటన పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించింది.
మొదట ఆసుపత్రిలో “తెలియని బయటి వస్తువు” వల్ల ఈ గాయాలు తగిలాయని చెప్పారు. తరువాత, మైనర్లలో ఒకరైన రమ్లీ ఓయమ్‌ను రాయపూర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆమె మెడలో దిగబడిన ఒక బుల్లెట్‌ను బయటికి తీశారు.
పిల్లలు గాయపడడానికి సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తం అవడంతో డిసెంబర్ 17న పోలీసులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, మావోయిస్టులు కాల్చిన గ్రెనేడ్ల నుంచి వచ్చిన ముక్కలు ఈ గాయాలకు కారణమని; సీనియర్ కేడర్ కార్తీక్ అలియాస్ దస్రు చుట్టూ ఒక మానవ రక్షణ వలయాన్ని ఏర్పరచారని, పిల్లలు ఈ వలయంలో భాగమని అన్నారు.
డిసెంబర్ 13న మావోయిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్తీక్ సీనియర్ సీపీఐ (మావోయిస్ట్) నాయకుడని, ఆయన వయసు 62 సంవత్సరాలు, అనారోగ్యంతో ఉన్నారని, అతనికి సహాయంగా రామ్లి మడ్కమ్ ఉన్నదని చెప్పారు. ఈ ఘటనలో మరణించిన ఏడుగురిలో, కార్తీక్, రమ్లీలు మాత్రమే మావోయిస్టులు. మిగతా ఐదుగురు సాధారణ గ్రామస్తులు.
ఈ వాదనలను స్వతంత్రంగా దర్యాప్తు చేయడానికి, కుమ్మానికి, పోలీసుల కాల్పుల్లో మరణించిన మరో వ్యక్తి గ్రామమైన లెకావాడాకు వెళ్ళాను. కొండలు, అడవులు ఉన్న ప్రాంతం గుండా సాగిన కష్టతరమైన ప్రయాణం ముగింపుకు వచ్చేసరికి పోలీసులు చెప్పిన దానికంటే ఆశ్చర్యకరమైన, చాలా భిన్నమైన కథనం బయటపడింది. రెండు గ్రామాల్లోనూ నిస్సహాయులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.
గడ్డి దాపున:
కుమ్మం ఒక చిన్న గ్రామం; ఇందులో సుమారు 13 ఇళ్ళు ఉన్నాయి; ఇవన్నీ ఓయామ్ గణానికి చెందినవి. బస్తర్‌లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర ఆదివాసీ రైతుల మాదిరిగానే, వీరు కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త అటవీప్రాంతాన్ని శుభ్రం చేసి పెండా ఖేతీ అని పిలిచే పోడు వ్యవసాయం చేస్తారు.
గ్రామంలోని ప్రస్తుత పెండా లేదా తాత్కాలిక వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడానికి సుమారు ఒక గంటపాటు కొండపైకి ఎక్కాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబరులో, వర్షాకాలం ముగియగానే , గ్రామస్థులు యిక్కడ తాత్కాలిక ఇళ్లను కట్టుకొంటారు. మార్చి నెలవరకు అక్కడే ఉండి, స్థానిక చిరుధాన్యం కోస్రా బియ్యాన్ని పండిస్తారు.
2024 లో కురిసిన నిరంతర వర్షాల వల్ల ఈ సారి పంట ఆలస్యమైంది అని అయు ఓయం (50 సం)వివరించారు; ఇతర గ్రామస్తులు కూడా అక్కడికి చేరారు. డిసెంబరు 10వ తేదీ పొద్దుగూకాక పొలాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వచ్చాక, వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నామని, ఒక్కొక్కటి ఐదు నుండి ఏడు నిమిషాల వ్యవధిలో వచ్చాయని గ్రామస్తులు చెప్పారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాల ఉనికిని వారు గుర్తించడానికి మొదటి సంకేతం ఇదే. గ్రామస్తులు ఆందోళన పడ్డారు.
పంట కోతల కాలంలో విలువైన సమయాన్ని వృథా చేయకూడదనుకొని మర్నాడు ఉదయం పొలం పనులకు వెళ్లారు. కానీ ఈసారి కాల్పుల శబ్దం మరింత దగ్గరగా వినపడింది; పెండా దగ్గరలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల పిల్లవాడు సోను ఓయామ్ తలపైనుంచి ఒక తూటా దూసుకుపోయింది. గ్రామంలోని కొందరు యువకులు సమీపంలోని అడవిలో దాక్కోవాలనుకున్నారు; మావోయిస్టులకు మద్దతునిస్తున్నామని భావించే భద్రతా బలగాలు తమను లక్ష్యంగా చేసుకుంటాయని భయపడే ఈ ప్రాంత ప్రజల సాధారణ ప్రతిస్పందన అది.
అడవిలోకి పారిపోయిన పదహారు మందిలో తొమ్మిది మంది అమ్మాయిలు వున్నారు. మరో ఏడుగురిలో పటెల్ గుడ్సా ఓయమ్ కుమారుడు నెవ్రూ ఓయమ్, ఐతూ కుమారుడు మోటు ఓయమ్, ఐదు, నాలుగు, రెండేళ్ల వయసున్న ముగ్గురు పిల్లల తండ్రి కోహ్లా ఓయమ్ ఉన్నారు.
ఖర్జూరపు పొదలతో నిండిన అడవికి నన్ను తీసుకెళ్ళిన 19 ఏళ్ల మనీష్ ఓయం కూడా ఆ గుంపులో ఉన్నాడు; భద్రతా బలగాలకు కనిపించకుండా ఉండటానికి ఆ గుబురు గడ్డిలో ఎలా ఆశ్రయం పొందారో నడుము ఎత్తులో ఉన్న పొదల్లోకి వంగి కూర్చుని చూపించాడు. తామంతా రాత్రి అక్కడే గడిపామని చెప్పాడు. స్థానికులు దీనిని చింద్ ఘాస్ (చిందు గడ్డి)అని పిలుస్తారు.
గడ్డి గుబురుగా ఉన్నప్పటికీ, మర్నాడు ఉదయం పోలీసులు వారి ఉనికిని గుర్తించారు. వారిపై నుంచి ఎగిరిన “చిన్న విమానం” (బహుశా భద్రతా బలగాలు ఉపయోగించే డ్రోన్) వల్ల కావచ్చని మనీష్ అనుమానిస్తున్నాడు.
9 జనవరి 2024
తెలుగు: పద్మ కొండిపర్తి
MAA SATYAM
Mukesh Chandrakar is a dedicated journalist.
Suresh Chandrakar, a contractor, committed this murder as part of a plan to reveal the truth about the hundreds of crores scam in road construction, with the values of journalism he believed in and the evidence in a committed investigative sense. Chhattisgarh Govt
Immediately arrest them and seize all their properties.
Mukesh Chandrakar’s death is not only a loss to the Indian society but also to the entire world and to investigative journalism. He was very dedicated towards his profession towards journalism. An example is:
“Mukesh Chandrakar was one of the key players for the release of Cobra commando Rakeshwar Singh Manwas, who was abducted by the Maoists after an encounter in Bijapur in 2021.” Popular in investigative journalism.
He actively covered the atrocities on tribals, Operation Kagar war frenzy, encounters and other issues.
Raipur, the capital of the state, has expanded to other journalists across the country, assisting them in their reporting efforts
Collaborate with the network.
Expressing solidarity with their families and those responsible for this murder
to punish severely,
We demand a speedy and impartial investigation and continue his fight for justice.
I demand that the state government should form a special investigation team and investigate this murder
I demand to attach the properties of contractor Suresh Chandrakar, seal the bank accounts and register a case.