గత ఆగస్టు చివరి వారంలో కురిసిన అత్యంత భారీ వర్షం విజయవాడలో మూడవ వంతు ప్రాంతం ప్రజాజీవితాల్నీ అతలాకుతలం చేసింది. పట్టణం లో అత్యంత పేదల జీవితాల్ని కోలుకోనంత దెబ్బతీసింది. సుమారు 64 డివిజన్ లలో 32 డివిజన్ ల ప్రజానీకం 65 మంది వివిధ వయస్సుల వారు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 4,5 డివిజన్ లలో మాత్రం పాక్షికంగా వరద నష్టం జరిగింది.
పైన అంతస్తు లేని ప్రజలు అత్యధిక మంది కట్టు బట్టలు, వరద తేచ్చిన అనారోగ్యంతో మిగినవారు చాలా మంది ఉన్నారు. వీరి ఇండ్లలో అన్ని రకాల సామాన్లు పడుకునే మంచాలు, కప్పుకునే దుప్పట్లు, ఫ్యాన్లు, మోటార్లు, మోటారు బైకులు, ఒక్కబేమిటి సర్వస్వం కోల్పోయారు.
కోట్లాది రూపాయల నష్టం అన్ని వర్గాలకు జరిగింది. ఈ ఆస్తి నష్టం ఇప్పటికీ ఒక అంచనాకు రావటం కష్టమే. ప్రధానంగా రెక్కాడితేకాని డొక్కాడని లక్షలాది మంది పేద ప్రజలు సెప్టెంబర్ 1 అర్ధరాత్రి సుమారు 2.30 గంటల నుండి మరణపు అంచున తమ తమ ఇండ్ల కప్పుల పై బిక్కు బిక్కు మని గడిపారు. సరియైన తిండి, బట్ట,కనీసం త్రాగు నిరులేక గడిపారు. ఒకవైపు పైనుండి కుండపోతగా వర్షం. మలమూత్ర విసర్జనకు మెరుగు లేకుండా ఇంటి పై ప్లాష్టిక్ పట్టాల క్రిందే కాలం గడిపారు. ఈ రకంగా కొద్ది మంది మూడు, నాలుగు, అయిదు, వారం రోజులు కూడా గడిపారు.
మేము 15 రోజుల అనంతరం నిజనిర్థారణకు వెళితే ఇంకా ఇంటి చుట్టూ నీరు నిలిచిన ఇండ్లు మాకు కనపడ్డాయి. ఎంతటి దుర్భరమైన జీవితాల్ని వారు ఆనుభవించారో చెప్పనలవి కానీ పరిస్థితులు. అర్ధరాత్రి నుండి తెల్లవారు సమయానికి ఊహించని విధంగా ఇండ్లలోకి 7 నుండి 9 అడుగుల లోతు నీరు. గాఢ నిద్రలో పసిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు, మహిళలు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. దిగువ మద్య తరగతి ప్రజలు అర్ధరాత్రులు ఒకటవ అంతస్తు ప్రజల దయా దాక్షిణ్యాలు పై ఆధారపడి జీవించారు.
ప్రభుత్వ సాయం ప్రతి ఇంటికి చేర లేదు. రోడ్ ప్రక్క వారికి మాత్రమే అందినది. కొన్ని చోట్ల హెలికాఫ్టర్ ద్వారా వేసినటువంటి ఆహారం పొట్లాలు పగిలిపోయి ప్రజలు తినటానికి లేకుండా పోయింది. జీవితాల్ని వెల్లదీశారు. అపార్టుమెంటుల్లో నివాసిచే వారు, మధ్య తరగతి ఆ పై వారు తిండికి కరువు లేక పోయినా నీరు, కరంటు లేక సమాచారాన్నీ ఇతరులకు చేరవేయడానికి, తెలుసుకోవడానికి భయం భయంగా నీరు తగ్గేంత వరకు గడిపారు.
ఇక చిన్న చిన్న బడ్డీ కోట్లు మొదలు పెట్రోల్ బంకులు, పెద్ద పెద్ద షావులు మొత్తం వరదల్లో చిక్కుకొని ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు లక్షల నుండి కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. మూడు రోజుల అనంతరం మాత్రమే ప్రభుత్వం చురుకుగా కదిలింది. అప్పటి వరకు బోట్ల కదలిక, ఆహారపోట్లలా మంచినీటి అందుచేయటం వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగింది, జరిగింది ఏమీ లేదు. తదుపరి నేటి వరకు చేపట్టిన ప్రభుత్వ శుభ్రత చర్యలు మాత్రం నష్టపోయిన పేద ప్రజలకు కొంత ఊరట కలిగించాయి. ఇప్పటికీ పేరుకున్న చెత్తనిలిచి ఉన్న నీరు, మురుగు వాసన, నిండిన డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల కంపులు వెదజల్లుతూనే వున్నాయి.స్వచ్చంద సంస్థలు, కమ్యూనిస్టు రాజకీయ పార్టీలు సహాయ కార్యక్రమాలు, డాక్టర్లు వైద్య సిబ్బంది జరుగుతున్నవ్యాధి నిరోధక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టూ వీలర్ రిపేర్ మెకానిక్ అసోసియేషన్ జరుపుతున్న ఉచిత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొద్దిమంది మరణించిన వారికి మినహా ప్రభుత్వం నుండి వరద ముంపు బాధితులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. మానవ తప్పిదం జరిగిందా లేదా ! అంటే తుఫాను వలన కురిసిన భారీ వర్షాలతో పాటు బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నిర్వహణలో మానవ తప్పిదం జరిగిందని పౌర హక్కుల సంఘం బృందం పరిశీలనలో తేలింది.
బుడమేరు నది పై 1956 లో హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి వెలగలేరు వద్ద శంకుస్థాపన చేశారు. 1970 సంవత్సరలో నీటిని క్రమబద్దికరించటానికి నిర్మించిన 11 గేట్లను ఒకేసారి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతుల ఒత్తిడి వలన ఎత్తి వేయటం వల్ల బుడమేరుకు రెండు వైపులా నీరు ప్రవహించి విజయవాడ ముంపుకు కారణం అయినదని పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం అభిప్రాయ పడింది.11 గేట్లు ఒకేసారి అధికారపక్ష నాయకుడి నివాసం రక్షించడం కోసం ఎత్తివేసారని ప్రతిపక్ష వైసిపివాదన చేస్తుంది. అదేవిధంగా గేట్లు ఎత్తక పోయి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేదనే వాదన జరుగుతుంది. గేట్లు నిర్వహణ జరిగి వుండాల్సి ఉంది. అది సక్రమంగా జరగలేదు. అనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ రెండు వాదనలకు భిన్నంగా బుడమేరు కాలువ అజమాయిషీ గత ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు అనేది మరోవాదన. ఇదే ప్రభుత్వ వాదన కూడా.
పై రెండు లేదా మూడు వాదనలు పాక్షిక సత్యాలు మాత్రమే.
2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో పోలవరం కాలువను బుడమేరు పై ఉన్న రెగ్యులేటర్ దాకా తీసుకు వచ్చి ఇబ్రహీం పట్నం మీదుగా కృష్ణా నదికి మళ్లించటం జరిగింది. అప్పటి నుండి బుడమేరు పై ఉన్న రెగ్యులేటర్ ను పట్టించుకున్న నాథుడే లేడు. రెగ్యులేటర్ నిర్వహణకు సంబంధించిన ఉద్యోగి
ఉన్నట్లు గానీ, గ్రీజు వగైరాలతో దాన్ని శుభ్రపరుస్తున్నట్లు గానీ చుట్టూ ప్రక్కలవున్న యే ఒక్కరైతుకు తెలియదు. వారిని రైతులు ఎరుగరు. ఇక బుడమేరు కాలువ సంగతి సరే సరి. అందుకే బుడమేరుకు రెండు వైపులా రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వాలు పర్మిషను యిచ్చాయి. గత ప్రభుత్వం కూడా ఖాళీలను బట్టి రైతుల పొలాలను కొని మరి పట్టాలివ్వటం జరిగింది.”తాళము వేచితిని గొల్లేము మర్చితిని” అన్నట్లు బుడమేరు ప్రమాదాన్ని గుర్తించలేదు.
ఈ సమయం లో 31-8-2024 న ఉదయం కేవలం 3 అడుగులుగా ఉన్న ప్రవాహపు ఎత్తు మద్యాహన్నం 3 గంటల సమయంలో 9 అడుగులకు చేరింది. రెగ్యులేటర్ కు ఇరు వైపులా ఉన్న అయిదేసి గ్రామాల చొప్పున రైతులు అక్కడికి చేరుకుని గేట్లు ఎత్తమని కొందరు వద్దని మరి కొందరు. యుద్ధవాతావరణం బుడమేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద నెలకొంది. అప్పటికే పై ఎత్తున ఉన్న గ్రామరైతుల పంటలు ఎండిపోతున్నాయి.
స్థానిక సబ్ ఇన్సెక్టర్, ఇరిగేషన్ కు సంబంధించిన అధికారులు ముందు రైతులే గ్రీజు వగైరాలు గేట్లకు పట్టంచి 3గంటల సమయం లో మొత్తం గేట్లు ఎత్తి వేయటం జరిగింది. అ నీటి ప్రవాహం వై ఎస్ ఆర్ కాలనీ చేరుకునే
టప్పటికి 1 సెప్టెంబర్ 2024 తెల్లవారుజామున 2.30 గంటలు. అదే ప్రవాహం సింగ్ నగర్ చేరేసరికి తెల్లవారుజాము 3:30 గంటలు. గేట్లు ఎత్తటానికి ప్రవాహం విజయవాడ చేరటానికి మధ్య కాలం సుమారు 10 నుండి 12 గంటలు. ఈ మధ్యకాలం అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వుందా ! లేదా ?
ప్రభుత్వ అధికారుల బాధ్యత నూటికి నూరుపాళ్ళు ఉంటుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు బాధ్యత వహించాలి. గేట్లు ఎత్తించిన ఎస్. ఐ, ఇరిగేషన్ ఇంజనీర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ విధులలో నిర్లక్ష్యం చేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టానికి కారకులైనందున వీరందరి పై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. సరియైన సమయం లో ప్రజల్ని అప్రమత్తం చేసి ఉంటే ఇప్పుడు జరిగిన ప్రాణ,ఆస్తి నష్టంలో సగం నష్టాన్ని ఆపగలిగేవారు.
డిమాండ్లు:
1. రైతులను ఆపలేకపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయని ఎస్ఐ, ఇరిగేషన్ ఇంజనీర్ సంబంధిత అధికారులు పై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వరద ముంపు , ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కు కారణమైన అధికారుల నిర్లక్ష్యం పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. జ్యుడీషియల్ ఎంక్వయిరీ కి గవర్నర్ తక్షణమే ఆదేశించాలి.
2. ప్రవాహ ప్రమాదం జరిగి 10 నుండి 12 గంటలు అయినా ప్రమాద హెచ్చరికలు జారీ చేయని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలక్టర్ మరియు సంభదిత అధికారులు పై చర్యలు తీసుకోవాలి.
3. బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరింత కట్టుదిట్టంగా పటిష్ట పరచాలి.
4 నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచే విధంగా బుడమేరు నది హెడ్ రెగ్యులేటర్ వద్ద స్టోరేజ్ కెపాసిటీని పెంపొందించాలి.
5.పంటలు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ముంపు బాధితుల నష్టాన్ని అంచనా వేయటానికి కుటుంబ పరమైన హౌస్ హోల్డ్ సర్వే జరిపి కుటుంబ పరమైన నష్ట అంచనా తయారుచేసి చేసి ప్రతి కుటుంబానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలి.
6. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ముంపునకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. వరద ముంపునకు గురై పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి. పాక్షికంగా నష్టపోయిన వారికి మూడు లక్షలు చెల్లించాలి. మృతుల కుటుంబాలకు 30 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలి.
7. మరో వరదకు ముంపు కు గురికాకుండా విజయవాడ నీ వరద ముంపు నుండి రక్షించాలి. బుడమేరు నది, కాలువలలో పూర్తిస్థాయిలో గట్లను పటిష్ట పరచాలి. పూడికతీత చేపట్టాలి.
8. ప్రభుత్వం, ప్రతిపక్షం నిందలు వేసుకోవడం మాని వాస్తవ పరిస్థితిని గమనించి ప్రజలను వరద ముంపు నుండి కాపాడ్డానికి తగిన శాశ్వత చర్యలను చేపట్టాలి.
9. పూర్తిస్థాయిలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి.
10. పుస్తకాలు, లైబ్రరీ కోల్పోయిన విద్యార్థులను, న్యాయవాదులను, ఇతరులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి.
ది. 15-09-2024 న నిజనిర్ధారణ కమిటీలో పాల్గొన్న వారు.
- 1 చిలుకా చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి
- 2) నంబూరి. శ్రీమన్నారాయణ, రాష్ట్రఉపాధ్యక్షులు
- 3) టి.ఆంజనేయులు, రాష్ట్ర సహాయకార్యదర్శి,
- 4) రాజారావు, రాష్ట్రకమిటీ సభ్యులు,
- 5) ప్రసాద్, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు
- 6) వి ప్రభాకర్, గుంటూరుజిల్లా ఉపాధ్యక్షులు
40 years — politics — babu thinks he is medhavi —Karl Marx // most worthless politician—
Dochukovadam— dhaachukovadam —
Prajaseva. Kosam nenu puttanu—big lie // big joke