ఈ నెల ప్రారంభంలో, నలుగురు  ఆదివాసీ రైతులను చంపి, మావోయిస్టులుగా ముద్రవేసి దాదాపు 90 మంది ఆదివాసీ రైతులను అరెస్టు చేయడంతో రాజ్యం ఆదివాసీ రైతులపై దాడిని మళ్లీ ప్రారంభించింది. ఆదివాసీలపై మారణహోమ దాడిని కొనసాగించింది.

వైచిత్రమేమంటే, తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఛత్తీస్‌గఢ్ కొండల నుండి మావోయిస్టులను తరిమివేయడానికి మాడ్‌లో ప్రజా ఉద్యమాలు మారణహోమ మిలిటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకించడానికి ఉపయోగించే “మాడ్ బచావో ఆందోళన్” పేరుతో అర్ధ సైనిక బలగాలు జరుపుతున్న సైనిక చర్యలో భాగంగా జులై 3న పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌లు ప్రారంభించాయి.

అలాంటి సైనిక చర్యలో నారాయణపుర్ జిల్లాలోని ఘమాండీ అడవుల్లో పారామిలిటరీ బలగాలు నలుగురు గ్రామస్తులను హతమార్చాయి. ఈ వ్యక్తులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ  సెంట్రల్ కమిటీ  ప్రొటెక్షన్ స్క్వాడ్ సభ్యులు. అంటే, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) యోధులు. వీరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు రక్షణగా వుంటారు అని పోలీసులు అంటున్నారు.

చనిపోయిన వ్యక్తులు కాల్పులు జరిపినప్పుడు, లొంగిపోవాలని వారిని కోరినప్పటికీ తమపై కాల్పులు జరపడంతో  తాము తిరిగి జరిపిన కాల్పులలో వారు చనిపోయారని భద్రతా దళాలు అంటున్నాయి.  అనేక విస్ఫోటక పదార్థాల (ఐఇడి) పేలుళ్లు, అనేక గంటల ఎదురు కాల్పులు తరువాత ఈ ఘటన జరిగింది. అయితే, వాస్తవం పారామిలిటరీ చేసిన వాదనలకు ఏ మాత్రం సరిపోలడం లేదు.

గ్రామస్థులు తెలిపిన ప్రకారం సమీపంలోని కోకామెట గ్రామానికి పారామిలిటరీ దళాలు వచ్చి గ్రామంపై, అటవీ ప్రాంతంలోని మరో ప్రాంతంపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు.

భద్రతా సిబ్బంది ప్రజలపై దాడి చేయడంతో అయిదుగురు గ్రామస్తులు గాయపడ్డారు. అర్ధ సైనిక బలగాలు కొంధ, ఘాసి, ఎడ్మ, మంగ్లు అనే నలుగురి పైన కాల్పులు జరిపాయి. మంగ్లు ఒక ఆదివాసీ రైతు. అతని కుటుంబం అతని వ్యవసాయ పనిపై ఆధారపడింది. అతను తన కుటుంబంతో  గ్రామంలో నివసిస్తున్నాడు. అతను ఆదివాసీ రైతు, మావోయిస్ట్ కాదు. నిజానికి అతను తన ఇంట్లో ఉన్నాడు, కాల్పులు జరిగినప్పుడు, భయంతో పారిపోతున్నప్పుడు పారామిలిటరీ దళాలు అతన్ని కాల్చి చంపాయి. మంగ్లూ తల్లి, భార్య కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఘాసీ, కొండా కూడా తమ కుటుంబంతో ఆ గ్రామంలో నివసిస్తున్నారు.

మృతి చెందిన వారు మావోయిస్టులనే పారా మిలిటరీల వాదన తీవ్ర సందేహాన్ని రేకెత్తిస్తోంది. సిపిఐ (మావోయిస్టు) మాడ్ డివిజన్ కమిటీ ఇచ్చిన ఒక ప్రకటన ఈ సందేహాన్ని మరింత బలపరుస్తుంది. ఈ దాడిలో ఐదుగురు ఆదివాసీ రైతులు మృతి చెందారని, ఆరుగురు గ్రామస్తులు గాయపడ్డారని వారు ఆరోపించారు. మావోయిస్టులు తమ కార్యకర్తలను కోల్పోవడాన్ని అంగీకరించి వారికి నివాళులు అర్పిస్తున్నారని ఈ ప్రకటన తెలియచేస్తోంది.

అలాంటి ఒక ఉదాహరణ, మాడ్ ప్రాంతంలో చోటీబిటియా ఎన్‌కౌంటర్‌ ఘటనలో  మరణించిన వారందరూ తమ సంస్థల సభ్యులు అని, అయినప్పటికీ వారిలో సగం మందిని పట్టుబడిన తరువాత చంపారని మావోయిస్టులు తమ ప్రకటనలో ఆరోపించారు.

 అందువల్ల, ఈ ఎన్‌కౌంటర్‌లలో   పారామిలిటరీ బలగాలు ఆదివాసీ గ్రామంపై దాడి చేసి ఆదివాసీ రైతులను చంపాయని  స్పష్టమైంది. ఆ తరువాత పారా మిలటరీ బలగాలు, ఈ ప్రాంతాల్లో తాము సాధారణంగా అమలు పరిచే పద్ధతి ప్రకారం మృత దేహాలకు పిఎల్‌జిఎ దుస్తులు వేసాయి.

ఆ  తరువాత జూలై 8వ తేదీన    బస్తర్ లోని బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 90 మంది ఆదివాసీ రైతులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ వ్యక్తులు మావోయిస్టులు కాదని, సాధారణ ఆదివాసీ రైతులు అని గ్రామస్తులు ప్రకటించారు. దీనిపై నిరసన తెలుపుతూ గ్రామమంతా పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. వీరిలో 20 మందిని మావోయిస్టులని కేసు నమోదు చేసారని తాజా సమాచారం.

రాజ్యం పనిచేసే ఒక నమూనాను చూడవచ్చు. ఆదివాసీ రైతులను రాజ్యం మావోయిస్టులని ముద్రవేసి, వారిని నేరస్థులుగా పరిగణిస్తుంది. మావోయిస్టులని ముద్ర వేయగానే వారి పౌర హక్కులు అదృశ్యమైపోతాయి. అప్పుడు వారిని అరెస్టు చేయవచ్చు లేదా చంపేయవచ్చు కూడా. ఆదివాసీ గుర్తింపు మావోయిజంతో కలిసిపోయింది. బస్తర్‌లో ఆదివాసీ ప్రజల పై దాడులను కొనసాగిస్తూ, ఆదివాసీ రైతు  ఉనికిని నేరస్థునిగా మార్చే విధంగా రాజ్యం ఈ వీరిద్దరినీ సమానంగా పరిగణిస్తుంది. మావోయిజం ఒక సిద్ధాంతంగా నేరపూరితంగా చేసినప్పటికీ అధికారికంగా నిషేధించలేదు, ఇది భారతీయ ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తుంది.

ఆదివాసీ రైతులను మావోయిస్టులనడంతో నేరస్థులు అని అనవచ్చు.

 హిట్లర్,  ముస్సోలినీ ఉపయోగించిన  మక్కార్తియన్ వ్యూహం అదే.  (1950-4 కాలంలో సెనేటర్ జోసెఫ్ మెక్‌కార్తీ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వంలోనూ,  ఇతర సంస్థలలోనూ  కమ్యూనిస్టులని ఆరోపించిన వారికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. చాలా మంది నిందితులను బ్లాక్‌లిస్ట్ చేసారు లేదా ఉద్యోగాలు కోల్పోయారు. కానీ వారిలో అత్యధికులు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు కాదు. – అను) యూదులకు కమ్యూనిజంతో సంబంధం ఉండడంతో, జ్యూడియో-బోల్షెవిస్ట్ సిద్ధాంతం అనే కుట్ర సిద్ధాంతాన్ని సృష్టించారు. మొదట వారిని ప్రధాన సమాజం నుండి వేరుచేసి, తద్వారా వారిని “ఇతరులు” గా మార్చవచ్చు,  జాతి విధ్వంసాన్ని కొనసాగించవచ్చు.

ఆదివాసీ రైతాంగా నిర్మూలన జరిపేందుకు భారత ప్రభుత్వం ఇదే పద్ధతిని ఉపయోగిస్తోంది. ఆదివాసీలు ఇప్పటికే ఆధిపత్య బ్రాహ్మణ భావజాలం కారణంగా వివక్షకు గురవుతున్నారు. ఇది వారిపై దాడి చేయడాన్ని సులభం చేస్తుంది.

బస్తర్ ప్రజలపై జరుగుతున్న జాతి నిర్మూలన సైనిక కార్యకలాపాలను భారత ప్రభుత్వం వెంటనే ఆపాలని  డిమాండ్ చేస్తున్నాం.

బూటకపు ఎన్‌కౌంట ర్లన్నిటిపైన  స్వతంత్ర న్యాయ విచారణను నిర్వహించాలి.

అన్యాయంగా జైలు పాలైన ఆదివాసీ రైతులందరినీ, వారి నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలి.

12 జులై 2024

Leave a Reply