ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజా వివరాలను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ అలజడుల కారణంగా ప్రపంచ దేశాల సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు దేశాల మధ్య మిత్ర వైరుధ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. 

సైనిక వ్యయంలో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తర్వాతి స్థానం భారత్‌దే. గత సంవత్సరం అంతర్జాతీయ సైనిక వ్యయం 9.4 శాతం పెరిగింది. 2024 సంవత్సరానికి గాను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2.74 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం అధికం కాగా, 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక పెరుగుదల ఇదే. ప్రపంచ దేశాలు చేస్తున్న వ్యయంలో తొలి ఐదు స్థానాలలో నిలిచిన దేశాల ఖర్చే 60 శాతం వరకూ ఉంది. ఈ ఐదు దేశాలు కలిపి 1,635 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) విడుదల చేసిన డేటా తెలిపింది. 2024 సంవత్సరంలో ప్రపంచదేశాలు తమ సైనిక రంగానికి మొత్తం 2.7 ట్రిలియన్‌ డాలర్లను ఖర్చు చేశాయి. వరుసగా పదవ సంవత్సరం సైనిక వ్యయంలో పెరుగుదల నమోదు కావడం కూడా గమనార్హం. ఈ పెరుగుదల ప్రపంచంలో నెలకొన్న ఉద్రికత్తలను ప్రతిబింబిస్తోంది. 

సిప్రి తాజా అధ్యయనం ప్రకారం, 2015 నుండి 2025 వరకు ప్రపంచ సైనిక వ్యయం గత దశాబ్దంలో 37 శాతం పెరిగింది. అదనంగా, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)లో సైనిక వ్యయాలకు కేటాయించిన శాతం (ప్రపంచ సైనిక భారం అని పిలుస్తారు) 2023లో 2.3 శాతం నుండి 2024లో 2.5 శాతంకి పెరిగింది. ఈ సంవత్సరంలో అగ్రరాజ్యం అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అమెరికా 997 బిలియన్‌ డాలర్ల వ్యయంతో (ప్రపంచ వాటాలో 37 శాతం) అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఆ దేశ జిడిపిలో 3.4 శాతానికి సమానం. 2023తో పోలిస్తే అమెరికా రక్షణ వ్యయం 5.7 శాతం పెరిగింది. చైనా 314 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో (ప్రపంచ వాటాలో 12 శాతం) రెండో స్థానంలో ఉంది. గత 30 ఏళ్లుగా చైనా సైనిక వ్యయం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. సైనిక వ్యయంలో ప్రపంచంలోనే భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో పోల్చుకుంటే భారత్‌లో సైనిక వ్యయం తొమ్మిది రెట్లు అధికం. అయితే మన సైనిక వ్యయంతో పోలిస్తే చైనా వ్యయం నాలుగు రెట్లు అధికంగా ఉంది. భారత్‌ కంటే అమెరికా 19 రెట్లు అదనంగా సైనిక వ్యయం చేసింది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలు సైనిక వ్యయంపై పెడుతున్న ఖర్చు ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. భారత్‌ తర్వాత సైన్యంపై ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాలలో బ్రిటన్‌, సౌదీ అరేబియా, యుక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. హిట్లర్‌ వారసురాలైన జర్మనీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28 శాతం పెంచి 88.5 బిలియన్‌ డాలర్లు, మరో యుద్ధోన్మాది జపాన్‌ 21 శాతం పెంచి 55.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. మిలిటరీ ఖర్చులో ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ నాలుగుకు ఎగబాకింది. భారత్‌ 86 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా 29వ స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ 10 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది.యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సెనిక వ్యయాన్ని గణనీయంగా పెంచింది. 149 బిలియన్‌ డాలర్ల (ప్రపంచ వాటాలో 5.5 శాతం) వ్యయంతో మూడో స్థానంలో నిలిచింది. ఇది రష్యా జిడిపిలో 7.1 శాతానికి సమానం. యుక్రెయిన్‌ తన జిడిపిలో ఏకంగా 34 శాతం సైనిక వ్యయానికి కేటాయించడం గమనార్హం. జపాన్‌ సైనిక వ్యయంలో 21 శాతం పెరుగుదల నమోదు కావడం, 1952 తర్వాత ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల అని నివేదిక తెలిపింది. జర్మనీ 88 బి.డా, భారత్‌ 86 బి.డా, బ్రిటన్‌ 82 బి.డా, సౌదీ అరేబియా 80 బి.డా, యుక్రెయిన్‌ 65 బి.డా, ఫ్రాన్స్‌ 62 బి.డా, జపాన్‌ 55 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యునైటెడ్‌ స్టేట్స్‌, ప్రపంచ సైనిక వ్యయంలో 997 బిలియన్‌ డాలర్లు భారీ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది, ఇది దాని జిడిపిలో 3.4 శాతంని కలిగి ఉంది. ఇది ప్రపంచ సైనిక సూపర్‌ పవర్‌గా దాని పాత్రను నొక్కి చెబుతుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చి పనులతోనే కాదు, యుద్దోన్మాదంతో కూడా రెచ్చిపోతున్నాడు. ఒకవైపు యుక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానంటాడు, మరోవైపు గాజాలో మారణకాండకు మద్దతు, ఎమెన్‌పై ప్రత్యక్షంగా దాడులు జరిపిస్తాడు. ఇలాంటి దుర్మార్గాలకు మరింతగా పాల్పడేందుకు మిలిటరీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు పూనుకున్నాడు. 2026 సంవత్సర బడ్జెట్‌లో మిలిటరీకి 13శాతం పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని, అందుకుగాను విద్య, వైద్యం, పర్యావరణం, ప్రజాసాయం, అదనపు పోషకాహార సాయ పథకం (మన ఉచిత బియ్యం వంటిది), బలహీన వర్గాల గృహ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు అధ్యక్ష భవనం మే రెండవ తేదీన ఒక ముసాయిదా బడ్జెట్‌ను ఆవిష్కరించింది.

2014లో మోడీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి మనదేశం సైన్యంపై ఎక్కువగానే ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు కేంద్ర రక్షణ బడ్జెట్‌ (రూ 6.8 లక్షల కోట్లు)లో 22 శాతం నూతన ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించారు. మిగిలిన దానిని 14 లక్షల మంది సైనికుల జీతాలకు, రోజువారీ నిర్వహణ ఖర్చులకు, 34 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు, ఇతర ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపునకు వెచ్చిస్తున్నారు. ఆయుధాల తయారీలో భారత్‌ చాలా వెనుకబడి ఉంది. ప్రపంచంలో ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌ది రెండో స్థానం. దేశ భౌగోళిక రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఓ పద్ధతి ప్రకారం సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలు మన వద్ద లేవు. మన సాయుధ దళాల వద్ద చాలినన్ని ఫైటర్‌ జెట్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు కూడా లేవు. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపనులు, రాత్రి సమయంలో పోరాడేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి కూడా కొరతగానే ఉంది.

భారత్‌-పాక్‌ ఉద్రికత్తల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ రంగానికి రూ.50 వేల కోట్ల మేర బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజా పెంపునకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో రక్షణ రంగానికి కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు తెలిపాయి. చైనా, పాకిస్థాన్‌ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ పద్దు కింద రూ. 6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్‌ కేటాయింపుల (రూ. 6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది 9.53 శాతం అధికం. సవరించిన అంచనాల (రూ.6.41 లక్షల కోట్ల)తో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీట వేశారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో రక్షణ కేటాయింపులు 1.91 శాతంగా ఉన్నాయి. రూ.50 వేల కోట్ల అనుబంధ బడ్జెట్‌లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి.

మరోవైపు చైనా తన సైనిక దళాలను నిత్యం ఆధునీకరిస్తూనే ఉంది. చైనా సైనిక బలం 20 లక్షలు. అధికారిక సైనిక బడ్జెట్‌కు చైనా వరుసగా 30వ సంవత్సరం కూడా పెంచింది. వాస్తవంగా ఖర్చు చేస్తున్న మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత సంవత్సరం చైనా తన సైన్యంపై 314 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. 2023తో పోలిస్తే ఇది ఏడు శాతం అదనం. అంతేకాక గత సంవత్సరం ఆ దేశం అనేక ఆధునిక నూతన సైనిక సామర్థ్యాలను ఆవిష్కరించింది. తన అణ్వాయుధ అమ్ముల పొదిని వేగంగా విస్తరించుకుంటోంది. గత  సంవత్సరంలో ఏరోస్పేస్‌, సైబర్‌స్పేస్‌ దళాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుందని ఎస్‌ఐపిఆర్‌ఐ విడుదల చేసిన డేటా వివరించింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సంఘర్షణల తీవ్రత మధ్య, ప్రపంచ సైనిక వ్యయం 2024లో 2718 డాలర్ల బిలియన్లకు పెరిగింది, ఇది ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుండి అత్యధిక పెరుగుదలను సూచిస్తుందని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) తాజా అధ్యయనం నివేదించింది. ప్రపంచంలోని టాప్‌ 5 అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశాలు గత సంవత్సరం తమ సైనిక వ్యయాన్ని పెంచుకోవడమే కాకుండా మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ప్రపంచ వినాశనానికి హేతువు కాగల అణ్వస్త్రాలు మరోసారి పడగ విప్పుతున్నాయి. గత నెల పదిహేడున విడుదలైన రెండు అంతర్జాతీయ స్థాయి నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ భద్రతను సవాలు చేస్తున్నాయి. మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్‌ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌ (ఐసిఎఎన్‌) విడుదల చేయగా.. రెండోదాన్ని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రి) విడుదల చేసింది. రెండిరటిలోని సమాచారం మానవాళిని హెచ్చరించేది మాత్రమే కాదు… భయపెట్టేది కూడా. 2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల (ఎన్‌9) దగ్గర 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నివేదిక చెబుతోంది. ఆయుధ సంపతిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు ఈ దేశాలు (భారత్‌ సహా) గత ఏడాది ఏకంగా 9,100 కోట్ల డాలర్ల ఖర్చు పెట్టాయి. రష్యా, అమెరికా  వద్ద ఉన్నన్ని ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని కూడా ఈ నివేదిక తెలియజేస్తోంది. ఇది దక్షిణాసియాకు క్షేమకరం కాకపోగా, పరోక్షంగా భారత్‌కు కూడా ముప్పే. 2023లో అమెరికా అత్యధికంగా 5,150 కోట్ల డాలర్లు అణ్వాయుధాలపై ఖర్చు చేయగా… చైనా (1,180 కోట్ల డాలర్లు), రష్యా (830 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు ఐసిఎఎన్‌ నివేదిక తెలిపింది. శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం జరగకపోవడం ఈ పరిస్థితి కారణం. కనుచూపు మేరలో ఇది మెరుగుపడే సూచనలూ లేకపోవడం ఆందోళనకరం.

2022లో రష్యాతో యుద్ధం మొదలయ్యాక కనీసం 35 దేశాలు యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. 2022-24లో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో యుక్రెయిన్‌ 8.8 శాతం, జర్మనీ 12 శాతం, పోలెండ్‌ 11 శాతం నుంచే ఎక్కువ ఆయుధాలు అందాయి.  2022-24లో రష్యా ప్రధానంగా 33 దేశాలకు ఆయుధాలను విక్రయించింది. ఇందులో మూడిరట రెండొంతులు భారత్‌ 38 శాతం, చైనా 17 శాతం, కజకిస్తాన్‌ 11 శాతం వెళ్లాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్‌ నిలిచింది. ఈ దేశం 65 దేశాలకు రక్షణ సామాగ్రిని అందించింది. ఇందులో అత్యధికంగా 28 శాతం భారత్‌కు అందాయి. అంతర్జాతీయంగా భారత్‌ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అధిక భాగం రష్యా (36 శాతం) నుంచే వచ్చాయి. ఈ వాటా 2015-19లో 55 శాతంగా, 2010-14లో 72 శాతంగా ఉండేది.

అత్యధిక ఆయుధ దిగుమతి దేశాలు: యుక్రెయిన్‌ 8.8 శాతం, భారత్‌ 8.3 శాతం, ఖతార్‌ 6.8 శాతం, సౌదీ అరేబియా 6.8 శాతం, పాకిస్తాన్‌ 4.6 శాతం, జపాన్‌ 3.9  శాతం.

అత్యధిక ఆయుధ ఎగుమతి దేశాలు : అమెరికా 43 శాతం, ఫ్రాన్స్‌ 9.6 శాతం, రష్యా 7.8 శాతం, చైనా 5.9 శాతం, జర్మనీ 5.6 శాతం, ఇటలీ 4.8 శాతం.

2025లో అత్యధిక రక్షణ బడ్జెట్‌ కేటాయించిన దేశాలు ప్రపంచంలో భౌగోళికంగా, రాజకీయంగా ఏర్పడుతున్న అస్థిరత మధ్య తమ బలాన్ని ప్రదర్శించేందుకు సైనిక బలగాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన డేటా ప్రకారం, 2025లో అత్యధిక రక్షణ బడ్జెట్‌ కేటాయించిన దేశాలు క్రిందివిగా ఉన్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ (అమెరికా) – 895 బిలియన్‌ డాలర్లు, చైనా- 266.85 బిలియన్‌ డాలర్లు, రష్యా – 126 బిలియన్‌ డాలర్లు, భారత్‌ – 86 బిలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా – 74.76 బిలియన్‌ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం చేసే దేశంగా అమెరికా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. మొత్తం గ్లోబల్‌ సైనిక ఖర్చులో అమెరికా వాటా 37 శాతంగా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక ఖర్చుదారుడిగా ఉన్న చైనా సైన్యాన్ని ఆధునీకరించడంతో పాటు, సైబర్‌ వార్‌పేర్‌ సామర్థ్యాల అభివృద్ధి, అణ్వాయుధాల విస్తరణ వంటి అంశాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆసియా ఖండంలోని మొత్తం సైనిక ఖర్చులో సగం వాటా ఒక్క చైనాదే కావడం విశేషం.

యుక్రెయిన్‌ విషయానికొస్తే, 2024లో ఆ దేశం 2.9 శాతం పెరుగుదలతో 64.7 బిలియన్‌ డాలర్లను సైనిక రంగానికి ఖర్చు చేసింది. ఇది రష్యా ఖర్చులో 43 శాతం కాగా, యుక్రెయిన్‌ జిడిపిలో 34 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సంవత్సరం యుక్రెయిన్‌ అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశంగా నిలిచింది. తన పన్నుల ఆదాయం దాదాపు మొత్తాన్ని సైనిక అవసరాలకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. నాటో దేశాలు పది రెట్లు అదనంగా 1.5 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. ఆయుధ పరిశ్రమలు ముఖ్యంగా అమెరికా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు దోహదం చేస్తున్నాయి. సిప్రి అంచనా ప్రకారం 2023లో ఆయుధ తయారీలో అగ్రభాగాన ఉన్న 100 కంపెనీలు 632 బిలియన్‌ డాలర్ల మేర విక్రయించగా ఒక్క అమెరికా ఉత్పత్తిదారులకే 317 బిలియన్‌ డాలర్లు దక్కాయి. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, యుద్ధాలు, భద్రతాపరమైన ఆందోళనలే ఈ భారీ సైనిక వ్యయానికి కారణమని సిప్రి విశ్లేషించింది. సామ్రాజ్యవాదం ఉన్నంత వరకు యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు ఉన్నంత వరకు ఆయుధ వ్యాపారం ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదాన్ని ఓడిరచడమొక్కటే పరిష్కారం.

Leave a Reply