నీళ్లతో కాదు ఇప్పుడు
ఆ నేలంతా నెత్తురుతో
సాగు చేయబడుతుంది
రండి
మనమంతా కలిసి మొక్కలు నాటుదాం
మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను
అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాం
ఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం
మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే
ఒక మొక్కను నాటమని చెప్పండి
నీడ వారికి కూడా అవసరమే కదా
మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే
మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే
ఇక్కడే ఇలాగే
కాస్త విశ్రాంతి తీసుకోండి
మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి
మీరు నాటిన మొక్కలను చూడడానికి
ఒక ఉదయాన
తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు వికసిస్తాడు.
Related
వారెవ్వా! తుపాకీ పట్టుకున్నోళ్ళే కాదు,! మేమూ నాటతాం
బాగుంది కవిత
అభినందనలు
బాగుంది ఉదయ్
చాలా బాగా రాసారు ఉదయ్ గారు 👏 మొక్కలను నాటుదాం ✊
Baagaa raasaaru
మీ కవిత్వం చాలా కొత్తగా ఉంటుంది చాలా ఇష్టం నేను రాయాలని ఉంది ఎవరికి పంపాలో తెలీదు