ఔరాంగజేబు చిన్ననాటి తరగతి గది చరిత్ర పాఠంలో విన్నపేరు. 1705 చనిపోయిన వ్యక్తి తదనంతర కాలంలో జీవిస్తున్నాడు. మరణాంతర , ఒకనాటి  పాలకుని గురించి అంచనా ఏమిటి? నిరంకుశ, దయామయుడైన పాలకుడా , లేదా, అనేది ఇవాల చర్చ ఎందుకు?  చరిత్రలో అనేక పరిశీలనలు సహజం. ఔరాంగజేబు మరణించి మూడు వందలఏళ్ల కాలం గడిచింది. ‘ఒక రాణి ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర’ అన్నాడు శ్రీశ్రీ.1705 కి ముందు ఏమి జరిగింది. ఔరంగ జేబు  ఇవాళ్టి భారతదేశానికి పాలకుడు కాదు. అతని రాజ్యవిస్తరణకు పరిమితి వుంది. హిందూ దేవాలయాల నేలమట్టం చేయడం, హిందుత్వ సంస్కృతిని అణిచి వేయడం అనేది చరిత్ర ఆధారిత నేరం కాదు. ఆకాలపు జీవనవిధానంలో ఏమి జరిగింది అనేది చరిత్రకారులకు వదిలి వేయవలసిన అంశం.

అనేక దశలను దాటి ఒక దేశం ప్రయాణం చేసింది. కోట్లాది మంది ప్రజల జీవితాలలో కనీస వెలుగును నింపడానికి త్యాగాల పరంపర కొనసాగింది. అఖండ భారతదేశ సాకారం సామ్రాజ్య వాదసంస్కృతిలో భాగం.దేశంలో ఏమూల మలుపు తిరిగినా అనేక ఆస్తిత్వాలు కనబడతాయి. భాష, రంగు, జీవన విధానం వీటన్నిటితో ప్రజలు కలగలిసారు. గతానికి ఉన్న నిర్వచనం ఏమిటి? చరిత్ర చలన సూత్రం ఏమిటి? ఒక గ్రామానికి వెళ్లేదారి అనేక మలుపులుతో నడకకు అసౌకర్యంగా ఉండవచ్చు. కాలగమనంలో ఆదారి మెరుగవు తుంది. ఈకొలమానం వెనుక మానవశ్రమను మాత్రమే అంచనా వేయలేం.గ్రామప్రజలు తమ ఊరిదారి కోసం ప్రయాస పడి వుంటారు. అవాంతరాలను,అవరోధాలను అధిగమించి దారిని సరిచేసుకున్నారు. ఇదొక గ్రామచరిత్ర. గ్రామ వికాసాన్ని అడ్డుకునే శక్తులు ఉంటాయి. వారు కాలంలో కలిసి పోతారు. గతం గతః అనేది జీవనసూత్రం. జీవితం మాత్రమే ప్రధానం.రేపటి ప్రపంచ నిర్మాణ రూపం ఇదే.

 ఔరంగజేబు ఎవరు? అతనితో జీవించి ఉన్న అతని కాలపు ప్రజలతో ఉన్న  సఖ్యత, విరోధం వేరు. కోట్లాదిమంది ప్రజలకు ఔరంగజేబు ఎవరో తెలియదు. అలా అని చరిత్రను తలపోయడం నేరం కాదు .ఒకనాడు జరిగిన తప్పిదాలకు వర్తమానంలో బాకీ తీర్చుకోవాలని అనుకోవడమే అసలు సమస్య. అన్నిటినీ సరిచేయాలనుకునే  ఈతరం ఆలోచన గత కాలపు  విధ్వంసీకరణపై ఆధారపడ కూడదు.  గతకాలపు జీవన విధానంలో అనేక  హింసాత్మక ఘటనలు ఉండవచ్చు. కాలం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటుంది.

 సంఘ పరివారం ఈ దేశంలో మసీదుల కింద  గుడులును , శిలా ప్రతిమలను  వెతుకుతుంది .      సంఘపరివార్ నూరేళ్ల కాలపు ప్రయాణం ఇది .ఈ చర్యలతో అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి అనేక దారులు వెతుకుతుంది.  ప్రజల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాలు ఒకదేశ పురోగతిని  నిర్ణయిస్తాయి. ఇవాల్టి భారతదేశంది సందిగ్ధస్థితి.  తాము చదువుకున్న విద్యకు ఉపాధి లేదని భారతీయ యువత ఆలోచన చేస్తుంది. అన్ని రంగాలలో విఫలమైన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇక ఎంత మాత్రమూ అధికారం సుస్థిరం కాదన్న విషయం అర్థమైంది .ప్రజల మధ్య ఉన్న స్నేహ ,సోదర సంబంధాల విచ్ఛిన్నతకు తన బ్రాహ్మణీయ      హిందుత్వ అజెండాను సజీవంగా ఉంచుతుంది. నాగపూర్ లోని ఔరంగజేబు సమాధి చాలా చిన్నది. దాని చుట్టూ రాజకీయం చేస్తున్నది. చరిత్రలో జరిగిన అనేక సంఘటనలకు వర్తమానం సమాధానం కాదు . గత, వర్త మాన భవిష్యత్తు ఒక కొత్త  ప్రపంచ నిర్మాణ కళ.   ఇది ఒకసైకిల్. కేవలం అధికారం కోసం ప్రజల మధ్య  మతంగోడ  నిర్మించడం భారతదేశ ప్రజల స్వేచ్ఛకు అవరోధం.

ఔరంగజేబు అర్థశతాబ్దపు తన పాలనా కాలంలో ఏం చేశాడు. సుదీర్ఘకాలం  పరిపాలించిన వాడిగా అతని పాలనా తీరులను ఇవాళ అంచనా వేయడం గతంలోకి  చూడటమే . మనుషులు, ఆనాటి కాలం, మత ఆధారిత మధ్య నడిచిన పాలన .ప్రజలు ఎప్పుడు దోపిడీకి గురైనవారే. వారిది ఏమత విశ్వాసమైనా కానివ్వండి. జీవించడానికి పెనుగులాడి వుంటారు . వీటి మధ్య ఏదేవాలయం, ఏమసీదు నిర్మితమైంది. ఏదేవాలయం కూలింది అనేది ఆనాటి సమాజపు వ్యక్తీకరణ .వర్తమానానికి సంబంధం లేనిది.  అధికార మార్పిడి అనంతర భారతదేశంలో కోట్లాదిమంది ప్రజలు. నిరాశ్రయులు అయినారు. అభివృద్ధి నమూనాలో తమ ఇళ్లను, భూములను, స్థానీయతను కోల్పోయారు  వీరంతా ఏమైనారు. భారతదేశం పట్టించుకోవలసిన విషయం ఇది. మన కళ్ళ ముందటి చరిత్ర. గణాంకాలు ,ప్రభుత్వ లెక్కలు ఏం చెబుతున్నాయి. మన ముందటి కాలపు ప్రజలను  అంచులకు నెట్టి వేయడాన్ని ఎలా చూడాలి.

ఎక్కడ మొదలయ్యామో తెలియకుంటే ఎక్కడికి చేరాలో అవగతం కాదు .దేవాలయాలు, దర్గాలు, సమాధుల్ని తవ్వుకుంటూ పోతే దేశం ఒకానొక  స్మశానస్థలి అవుతుంది .భిన్న మతాల, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది, రాజ్యాంగ రచనలో ఒక అంగీకారంగా మతవిశ్వాసం నమోదయింది . దేశం సనాతన మార్గంలోకి వెళుతుంది. ఇదొక పరిణామం . ఔరంగజేబు నివసించిన కాలం దగ్గర  భారతదేశ గమనం  ఆగడమే అసలు విషాదం.

ముస్లిం రాజుల తర్వాత చాలా కాలం  డచ్చి ,ఫ్రెంచి ,బ్రిటిష్ రాజ్యాల  పాలనలో         భారతదేశం వుంది . ఈమూడు దేశాల పాలకుల సమాధులు ఈ దేశంలో ఉన్నాయి. కొన్నిచోట్ల వీటిసంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది .సమాధుల చుట్టూ గోడలు నిర్మించి వాటికి రక్షణ కల్పిస్తుంది .భారత ప్రజలను అణిచివేసి, సంపదను తరలించుకుపోయిన ఇతర దేశాల పాలితుల సమాధులు ఈదేశంలో సురక్షితంగా ఉన్నాయి. ఒక దేశ సంస్కారానికి నిదర్శనం. సంస్కార స్వభావంలేని బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలు ఏనాటికైనా తిరస్కరిస్తారు .ఒక దేశం చిన్న పిల్లల ఆటస్థలంగా ఉండాలి. ఈర్ష్య, ద్వేషం ,అసహనం వీటి మధ్య దేశం నిర్మితం కాకూడదు. ఒక ఈతకొలను ఆదర్శం కావాలి. అనేక రకాలచేపలు ఆడి ,పాడి  నృత్యం చేస్తాయి. ఈత కొలనును చేపలు శుద్ధి చేస్తాయి. మనుషులు కూడా అంతే .శ్రమతో   ఒక దేశాన్ని వెలిగిస్తారు  గతంలోకి తొంగి చూడడం అంటే ఒక అడుగు వెనక్కి వెళ్ళడమే.

Leave a Reply