యుద్ధ నిబంధనలను మార్చడం ద్వారా ఉక్రెయిన్ లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించాలని అమెరికా ఆరాటం
1. గత మూడు దశాబ్దాలుగా అబివృద్ధి చెంది, రూపు దిద్దుకున్న అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి (రెండవసారి అధికారం చేపట్టిన) ట్రంప్ పరిపాలనా వ్యవస్థ స్పందించింది. అదిప్పుడు సాపేక్షికంగా తిరోగమించాల్సి రావడమేకాక, దాని ప్రత్యర్థులు(రష్యా, చైనా) దగ్గరై. తన ప్రపంచాధిపత్యాన్ని సవాలు చేసేవిగా తయారయ్యారు. ఈ మౌలిక సమస్యలు ఏమంత దూరంగా లేవని భావించిన ట్రంప్ పరిపాలనా వ్యవస్థ వీటి పైన దృష్టి సారించింది. ఈ పరిణామాలు అమెరికాకు ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, అవి ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికాకు తన నాయకత్వంలోని పశ్చిమ దేశాలతో సంబంధాలు క్రమంగా సడలిపోతున్నాయి. ఫలితంగా ఆయా దేశాలు మరొక ప్రాంతీయ బలం వైపు మొగ్గు చూపుతున్నాయి.
ప్రపపంచంపై అమెరికా సాధించిన సార్వభౌమాధికారం, ఆధిపత్యానికి సవాలు విసురుతున్న తన సహ సంబంధీకులను పున: సమీక్షించుకోవాలని భావిస్తోంది. అమెరికాతో కలిసి ప్రయాణిస్తున్న కేంద్రీకృత శక్తులు తమ ధ్యేయం కోసం వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. వారి ప్రాధాన్యత ప్రకారం(అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కనీసం అంతర్యుద్ధ నియమాల్లో వ్యక్తం చేసినట్టు) వ్యూహాత్మక ఎంపిక కోసం ఈ ధ్యేయం సాధిస్తాయి. ఈ వైరుధ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి (వారు ఊహించినట్టుగా అవేమీ పరిష్కారం కావు). ఎందుకంటే, ఇక్కడ చాలా సంక్లిష్టమైన వైరుధ్యాలున్నాయి. ప్రతి ఒక్క వ్యూహాత్మక ఎంపిక ప్రపంచ అధిపత్యం, పెత్తనం కోసమే జరుగుతున్నాయి.
2. అమెరికాకు సవాలు విసురుతున్న రెండు ప్రధాన విషయాలపై ట్రంప్ పరిపాలనా వ్యవస్థ తొలి అడుగులోనే, తన విధానంలోని రెండు ముఖ్యమైన విషయాల గురించి స్పందించాలని భావిస్తోంది.
ఏ). భౌగోళిక వ్యూహాత్మకత, అదే సమయంలో తనను ఆర్థికంగా పటిష్టపరుచుకోవడం, అమెరికా సామ్రాజ్యవాద స్థాయిని పెంచడం. అమెరికా సామ్రాజ్యవాదానికి అనుబంధంగా ఉన్న వారిని అదుపులో పెట్టుకోవడం, తన విరోధులను ఒక కవచంగా ఉపయోగించుకోవడంతోపాటు, అవసరమైతే వారిని వెళ్ళగొట్టాలని చూస్తోంది.
బి). తన అమరికలో భాగంగా, తన ధ్యేయానిక అనుగుణంగా పశ్చిమదేశాల మిత్రులను లొంగదీసుకోవాలని చూస్తోంది.
ఇంగ్లాండ్ సహా యూరోపియన్ లను, యూరోపియన్ సామ్రాజ్యవాదులను, ఎలాంటి షరతులు లేకుండా తనతో చేర్చుకోవాలని ట్రంప్ పరిపాలన భావిస్తోంది. కెనడా ఎలాగూ రాజకీయంగా, ఆర్థికంగా అమెరికా వ్యూహాలతోనే ఉంది. నూక్లియర్ శక్తి గల రష్యా క్రమంగా పుంజుకుంటున్న చైనాను అన్ని స్థాయిల్లో ఆర్థికంగా, రాజకీయంగా ఉపయోగించు కుంటోందని చూపిస్తోంది. బలపడుతున్న తూర్పు దేశాలను చూపిస్తూ, తద్వారా తన మిత్రులను వ్యూహాత్మకంగా బ్లాక్ మెయిల్ చేస్తో, తన సాయం లేకుండా తూర్పు దేశాలను మిగతా పశ్చిమ దేశాలు ఎదుర్కోలేవనే ప్రమాదాన్ని చూపిస్తోంది. వాటి స్నేహ మార్గం అమెరికా సామ్రాజ్యవాదంతో సరిగ్గా ముడిపడి ఉంది కనుక అలా కోరుతోందంటే, ఎలాంటి నిబద్దత లేకుండా ఆ విధానాన్ని అనుసరించాల్సిందే. తన మిత్రుల స్థితి, నిర్వహించే పాత్ర తన అబివృద్ధిలో చూసుకుంటుంది. యూరోపియన్లకు మాత్రమే పరిమితమైన అమెరికా ప్రకటన సందర్భంలో, అమెరికా-రష్యా సంప్రదింపులు, బహిష్కరణ నుంచి తమ భాగస్వాములు ఎవరైనా మధ్యంతర ఒప్పందానికి తమతో ఉన్నట్టు సంతకం చేయవచ్చు. ఒక వేళ దాని నుంచి వైదొలగనూ వచ్చు. అందుకునే పశ్చిమదేశాలన్నిటికీ తప్పకుండా సేవ చేయడానికి ఏర్పడిన ఎంఏజీఏ (మేక్ అమెరికన్ గ్రీన్ ఎగెయిన్) ద్వారా తమ ప్రత్యర్థుల నుంచి ‘‘పశ్చిమదేశాలకు రక్షణ’’ కల్పిస్తామని అమెరికా సామ్రాజ్యవాదం ప్రకటించింది. అమెరికాలో పరిశ్రలు నెలకొల్పే ఇతరుల అవసరాల మేరకు టారిఫ్ యుద్ధంలో ‘ఆర్థిక అసంబద్దత’ కానీ, యూరోపియన్ ప్రభుత్వాలలో, వాటి రాజకీయ వ్యవస్థలో చొరబడే అమెరికా వైరాగ్యంతో చేసిన ఆకాంక్ష ఇది.
ఈ రెండు విధానాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని స్పష్టమవుతోంది. ఒక దాని ప్రోత్సాహం మరొక దాని ప్రోత్సాహానికి ముందస్తు షరతు. గ్రీన్ లాండ్ ను (అక్ష్రర రూపమైనా, చిత్రరూపమైనా) జయించడం, కెనడాతో ముందస్తు ప్రతిపాదిత ‘ఒప్పందం’ , యూరోపియన్ సామ్రాజ్యవాదాన్ని సరిగా పెట్టడం ఆ షరతులకు ఉదాహరణ. బైడెన్ పరిపాలన చివరి రోజులను ఒక్క సారి గుర్తు చేసుకుంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అవసరాలకు అనుగుణంగా జపాన్ సామ్రాజ్యవాదాన్ని చేర్చుకుంది. దీని కంటే ప్రపంచాన్ని ఆదేశించే ట్రంప్ పరిశీలన అయస్కాంతంలా ఆకర్షించే భిన్నమైంది, చాలా విస్తృతమైంది.
3. ట్రంప్ పరిపాలనా వ్యవస్థ ఉక్రెయిన్ సమస్య పై వివరించదలిచింది. కానీ, అమెరికా సామ్రాజ్యవాదంలో అసలు సమస్య ఉక్రెయినే. సామ్రాజ్యవాద వ్యతిరేకత సమస్యలన్నీ కేంద్రీకతమై, రష్యా-అమెరికా మధ్య యుద్ధ రూపంలో (అణుయుద్ధానికి మేం వెళతామంటే మేం వెళతామని) ఇమిడి ఉన్నాయి. ఏళ్ళ తరబడి అమెరికా సామ్రాజ్య వాదం ఏళ్ళ తరబడి కృషి చేసి బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ఈ యుద్దాన్ని ప్రారంభించింది.(నూతనంగా ఎన్నికైన రష్యా అనుకూల యానుకోవ్యాచ్ ప్రభుత్వాన్ని 2004లో పశ్చిమ అనుకూల ‘ఆరెంజి విప్లవం’ కూలదోసింది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడానికి 2008లో ప్రతిపాదన వచ్చింది. 2014లో మెయిడన్ తిరుగుబాటు జరిగింది) మాస్కో సింహద్వారంలోకి ప్రవేశించడానికి అమెరికా ఉక్రెయిన్ ను ప్రధాన రహదారిగా భావించింది. ఎట్టకేలకు 2022 ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో రష్యా యుద్ధం ప్రకటించింది. (జెలెన్ స్కీ ద్వారా అమెరికా పశ్చిమదేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి) ఈ పరిస్థితులు ఒక ప్రతిష్టంభనను తెచ్చిపెట్టాయి. ఎలాంటి మిలటరీ ప్రయోజనాలు పొందకుండా రష్యా ఉక్రెయిన్ లో 20 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. అదే సమయంలో అమెరికా యుద్ధ వ్యూహాల ప్రతిష్టంభనతో అది ఉక్రెయిన్ నుంచి వెనక్కి రాలేకపోవడమే కాదు, అక్కడ నుంచి ఉఫసంహరించు కోలేకపోతోంది.
ట్రంప్ చెప్పే ‘‘శాంతి’’ ప్రతిపాదన అమెరికా ఆశలకు అనుగుణంగా ప్రస్తుత యుద్ధ నిబంధనలుండాలని ఆకాంక్షిస్తోంది. మరింత స్పష్టంగా ఈ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి :
ఏ) పెద్ద ఎత్తున (లక్ష నుంచి రెండు లక్షల వరకు) అత్యాధునిక ఆయుధాలతో పశ్చిమ దేశాల సైనికులను యుక్రెయిన్ లో దింపడానికి రష్యా అంగీకరించాలని అమెరికా కోరుతోంది. ట్రంప్ యుక్రెయిన్ లో దించడానికి సిద్దపడిన ‘‘శాంతి పరిరక్షణ దళాలు’’ పరిమాణం, ప్రమాణాలు ఇలా ఉండాలని ఒప్పందం తరువాత పుతిన్ ముందు ట్రంప్ ప్రతిపాదనలు పెట్టేవి. ట్రంప్ ప్రకారం ఈ ‘‘శాంతి పరిరక్షణ దళాలు’’ అమెరికా సామ్రాజ్యంవాదం ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ లోని అరుదైన భూమి, సంపదే దాని ధ్యేయం. ఉక్రెయిన్ తూర్పుభాగంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఈ ‘‘శాంతి పరిరక్షణ దళాలు’’ చుట్టు ముట్టాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రత్యామ్నాయమైనది ఏమిటంటే, మధ్య యూరప్ లోకి, బాల్కన్స్ లోకి, పశ్చిమదేశాల్లోకి ప్రవేశించకుండా రష్యన్ సామ్రాజ్యవాదాన్ని నిలువరించడానికి, నిషేధించడానికి పశ్చిమదేశాల మిలటరీ గోడను నిర్మించడం.
బి) గత డిసెంబర్ లో నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రూటె సూచనలమేరకు (పోలాండ్ నుంచి గ్రీస్ వరకు మిత్రపక్షాలతో చేరదలచడం) అన్ని యూరోపియన్ సామ్రాజ్యవాదులను ఉక్రెయిన్ లో ప్రచారం చేయమంటోంది. ఆ సూచనల మేరకు ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’ అని యూరిపియన్లు అర్థం చేసుకోవాలని, దీని ప్రకరామే వారి రాజకీయ, ఆర్థిక ఎంపికలు ఉండాలని అంటోంది.
దీని సారాంశమేమిటంటే, పశ్చిమ దేశాలు తమ సైన్యాలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించాలని, ప్రస్తుతం రష్యాకు ఖచ్చితమైన లక్ష్మణ రేఖ గీయాలని, సుదూర ప్రాంతాల పైకి ప్రయోగించగల పశ్చిమదేశాల ఆయుధాలను దించాలని, ఆయుధాలు పంపే వారు ఒక వ్యూహాత్మక అణుబాంబులను కూడా చేర్చాలని అంటోంది.
అదే సమయంలో ఉక్రెయిన్ పట్ల రష్యాకు ఆసక్తి లేకుండా చేయడం, నియంత్రించడం, దానికి శోష వచ్చేలా చేయాలనే ధ్యేయంతో అమెరికా యూరోపియన్ సామ్రాజ్య వాదులను చేర్చుకుంది.
ఈ ప్రాతిపదికపైన -ఆక్రమించిన 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యానే ఉంచుకునేలా చేయడం, లేదా దాన్ని తిరిగి ఇచ్చేసేలా చేయకపోవడం- ట్రంప్ ఆలోచన ఎలా కనిపిస్తోందంటే, అర్థం లేని ఈ దురాక్రమణను ఆమోదిస్తున్నట్టు చేయడంలా ఉంది.
చివరగా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకుండా ఉండడానికే ట్రంప్ కట్టుబడి ఉన్నట్టైంది. తూర్పు పశ్చిమ జర్మనీల ఏకీకరణ సందర్భంగా గోర్బచెవ్ కు అమెరికా పశ్ఛిమ దేశాలు ఇచ్చిన హామీ మేరకు నాటోలో చేరకపోయినా, ఇక తూర్పు వేపు వెళ్ళకూడదని ఇలాగే ఆంక్షలు విధించాయి.
4. ఈ ప్రతిపాదనకు ట్రంప్ పరిపాలన విస్తృత ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాద ఫలితాలను పొందడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రతిపాదనకు (తమతమ కారణాల వల్ల) రష్యా, యూరోపియన్ సామ్రాజ్యవాదులు స్పందించవలసి ఉంది.
రష్యా మాత్రం తాను ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగంలో ‘‘నిరాయుధీకరణ’’ అమలు చేయాలని, అది ఆక్రమించడం కాదని, బహుశా ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు దాన్ని పంచాలని, అనేక విధాలుగా మాటి మాటికీ ప్రకటిస్తోంది. కాబట్టి, యుద్ధ విజేతగా ఏక పక్షంగా ప్రకటించడం తనకు ఇష్టం లేదని, మరొక వైపు యుద్ధాన్ని కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు జరపాలని సూచిస్తోంది.
అంతే కాకుండా, బాల్కన్ లో ‘‘యూరప్ లో నూతన భ్రదతా వ్యవస్థ నిర్మాణం’’ చేపట్టాలని మాస్కో కోరడమే కాదు, అలా ప్రకటించింది కూడా. అంటే తన సామ్రాజ్యవాద పాత్రను, దాని ప్రాపంచిక దక్పథాన్ని ఉన్నతీకరించాలని భావిస్తోంది. తన అనుబంధానికి సంబంధించి మిలటరీ, యుద్ధ ఉన్నతీకరణను ఎలా ఆమోదిస్తారు?
యూరోపియన్ సామ్రాజ్యవాదులు ఇప్పటికే పీకల్లోతు సమస్యలలో మునిగి ఉన్నారు. ఆర్థిక మాంద్యం, పరిశ్రమలు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంటు న్నారు. ఇంధనం పెంపొందించుకోవడంలో అమెరికా పైన ఆధారపడిన బెర్లిన్ తన సామ్రాజ్యవాద ఆకాంక్షలకు అనుగుణంగా అందరికీ తెలసిన మిలటరీ వ్యూహాలతో మునిగిపోయింది. ఆఫ్రికాలో ఓటమి నుంచి వెనక్కి మళ్ళడం అనేది ఫ్రెంచ్ సామ్రాజ్యవాద అనుభవం. సుదీర్ఘ కాలంగా ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. మధ్య ఆసియాలో అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేని యూరోపియన్ సామ్రాజ్యవాదులు అక్కడ పునరేకీకరణకు ఆయాదేశాల సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇలా ఒక పక్క సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ట్రంప్ ఊహించినట్టు ఆయన ప్రతిపాదనల మేరకు ఉక్రెయిన్ లో ఎలా తలదూర్చగలుగుతారు? తాముచేసుకున్న ఒడంబడిక తీవ్ర ప్రభావం కలగచేస్తూ, అది తమ సామ్రాజ్యవాద ముసుగు వదలివేయాల్సిన ఒత్తిడి చేస్తుంటే, ఈ పరిస్థితులు ఆంతరంగికంగా మరింత భారంగా తయారవుతున్నాయి.
ట్రంప్ ప్రతిపాదన పైన చైనాకు తన ఆందోళన తనకుంది. ఆ నేలపై జరిగే ట్రంప్-పుతిన్ సమావేశంలో తనకు కూడా స్థానం కల్పించాలని కోరుతోంది. రష్యా-చైనాల మధ్య జరిగే వ్యూహాత్మక సహకార సమావేశంలో ట్రంప్ ప్రతిపాదనకు మార్పులు చేర్పులు చేయడానికి కానీ, తిరస్కరించడానికి కానీ వ్యూహాత్మక అవకాశం లేకపోలేదు.
5. ఇలా అనేక వైరుధ్యాలు, అస్థిరతల మధ్య ఏ ప్రతిపాదన విషయాలు తాత్కాలికంగా ముందుకు జరుగుతుందో అన్న ప్రశ్నకు భవిష్కత్తులో సమాధానం దొరకవచ్చు. తాత్కాలిక, బలహీనమైన రాజీ కుదురుతుందా లేదా అనేది సందేహమే. ఏదేమైనప్పటికీ ట్రంప్ ప్రతిపాదన ‘‘శాంతి’’ కోసం మాత్రం కాదు, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం కూడా కాదు. దాని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే, యుద్ద నియమాలను మార్చడం, తద్వారా ప్రస్తుత ప్రతిష్టంభనను అధిగమించడానికి, శక్తి, లోతైన వ్యూహాలు, మిలటరీ శక్తిగల మరో సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో పరోక్షంగా యుద్ధ వేతనాల చెల్లింపు అమెరికాకు పెద్ద భారంగా తయారైంది.
ట్రంప్ ప్రతిపాదన తప్పకుండా వారికి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్రిక్తతలను, ఇబ్బందులను తెచ్చిపెడుతుందని, ఉక్రెయిన్ యుద్ధ రంగంలో విభేదాలను కూడా పెంచుతుందనే విషయాన్ని ఆధారం చేసుకునే చెప్పాము. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆర్థిక, సైనిక చర్యల తీవ్రతరంచేయడం గురించి వాన్ సెస్(అమెరికా ఉపాధ్యక్షుడు) ప్రకటనలు ‘‘ట్రంప్ ప్రతిపాదనలపైన విశ్వాసం చూపించకపోతే’’(ఈ ప్రకటనను తరువాత ఉపసంహరించుకున్నారు. వివిధ సామ్రాజ్యంవాదులు వెనక్కి మళ్ళడం ప్రతిష్టంభనను సూచిస్తుంది.) ఇదంతా మిత్రదేశాలతో, తన వ్యతిరేకులతో అమెరికా చేస్తున్న బ్లాక్ మెయిల్ కు సాక్ష్యంగా నిలుస్తుంది. ట్రంప్ ప్రతిపాదన వల్ల ‘‘మనతో కానీ, మనకు వ్యతిరేకంగా కానీ’’ 2001లో ట్విన్ టవర్ల పేల్చివేత సంఘటన వైపు నుంచి మరింత ఎక్కువగా మళ్ళీ జరిగితే, యూరప్ మధ్యలో మరింత పోటీ నెలకొంటే, ఇలా యుద్ధ తీవ్రతతో మూడేళ్ళు గడిచిపోయింది.
‘‘సరికొత్త యాల్తా’’ (క్రిమియా ద్వీపకల్పంలోని దక్షిణ తీరంలో నల్ల సముద్రం చుట్టూ ఉన్న నగరం) నగరాన్ని పునర్నిర్మిస్తామని (ఉక్రెయిన్, గాజా లను కూడా) అనడం రాజకీయ తెలివి తక్కువతనమే కాదు, నిరాయుధీకరణ కోరుకునే ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం రూపం ఎలా ఉంటుందంటే, తొలుత ‘‘పడగొట్టడం’’, ధ్వంసం చేయడం, తరువాత పునర్నిర్మించడం, అభివృద్ధి చేయడంలా ఉంటుంది. ఉక్రెయిన్ ను ‘‘పునర్నిర్మించే పథకాల’’ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, యుద్ధ భయానక బీభత్సం నుంచి దృష్టిని మరల్చడం కోసమేనని, ఒక చీకటి భవిష్యత్తు ఉక్రెయిన్ ప్రజల కోసం ఎదురు చూడడమే నని స్పష్టమవుతుంది. గాజా పునర్నిర్మాణం అంటే ఒక చిన్న అత్తి ఆకుతో ఫలించని జియోనిస్ట్ రాజ్యానికి చివరి పరిష్కారంగా అమెరికా వెన్నుదన్నుగా ఉండడమే. అంటే పాలస్తీనా నుంచి అక్కడి ప్రజలను వెళ్ళగొట్టడమే. ప్రతీఘాతుక అరబ్ పరిపాలనా కాలంతో బ్లాక్ మెయిల్ చేసి, ‘అబ్రహాం ఒప్పందం’ ను మళ్ళీ మొదలు పెట్టడం.
చారిత్రాత్మక విధ్వంసాన్ని దాటవేయడం, వాల్తా వాగుడులో అసభ్యకరమైన కమ్యూనిస్టు వ్యతిరేకిలాగానే ప్రపంచంలో శాంతియుత పరిష్కారం కానిది ట్రంప్ ప్రతిపాదన. ఇది యుద్ధం ఆగిపోవడానికి కాదు. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి మరొక ముందడుగు. అర్థంపర్థం లేని విద్వేషం, అన్ని రూపాల్లో కొలిచే సాహస కృత్యాలు, అమానుషమైన ముతక విధానానికి ప్రతిష్టంభనలు, ఇవే సామ్రాజ్యవాదుల స్పందనలు.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటం, ఈ భూమండలం పైన హంతకులందరికీ వ్యతిరేకంగా జరిగే ప్రజాపోరాటం, విప్లవ కమ్యూనిస్టు దృక్పథంతో, దాని మార్గదర్శకత్వంలో జరిగే పోరాటమే అసలైన సమాధానం.
ఆదివారం 16 ఫిబ్రవరి 2025
అనువాదం :రాఘవ
