మహమూద్ కవితలు
1 వేడుకోలు చీకటి పాత్ర లో నిండుగా ఉన్నది వెన్నెల మధువు మత్తుని ఆహ్వానించడానికి సిధ్ధంగా ఉంది ప్రేమ నిండిన హృదయం ఏక్కడో దూరం నుంచి ఓ తల్లి గాత్రం బిడ్డకి పాలు పడతూ ఆదమరచడానికి భూమికింత చల్లగాలిని జోలపాటగా అందిస్తోంది ఏ బతుకు యుధ్ధంతో ఘర్షణ పడుతున్నారో మనుషుల జాడ లేదు మధువు తాగేటప్పుడు తోడు కోరుతుంది కదా మనసు ఒంటరితనం ఒక ఉన్మత్త దుఃఖం దుఃఖం ఓ ఒంటరి యుధ్ధం దేహానికీ, హృదయానికీ గాయం కానివాడెవడూ మధువుని కోరుకోడు తోడునీ కోరుకోడు తెగిన బంధాలని జతచేయడానికి గాయాలు మానడానికి అనువైన కాలం ఇది జహాపనా! కొందరు










