సందేశం

దేశం మీ వైపు చూస్తోంది..

“చెట్లు నిర్మూలమైపోతాయి, నదులు ఇంకిపోతాయి, పర్వతాలు కుంగిపోతాయి, అరణ్యాలు దహనమవుతాయి, భూమి భూమంతా కొల్లగొట్టబడుతుంది సంగీతం ఆగిపోయింది, సృజనకారులను తరిమివేసారు కవులకు విష పాత్రలిచ్చారు చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు అపరిచితమైన మనుషులు బాగా తెలిసిన మనుషులను ప్రేమికులను, ఆలోచకులను కాల్చి చంపుతున్నారు ప్రాణం లేని పక్షులు చెట్లమీంచి రాలినట్టు మనుషులు కూలిపోతున్నారు పల్లెలూ పట్నాలూ నగరాలూ ఒకేఒక్క శోకగీతం ఆలపిస్తున్నాయి మహా ప్రళయాలు సుడులు తిరిగి ధ్వంసమైపోయిన భూగోళం మీది నుంచి మానవ పాదముద్రలను తుడిచేస్తున్నాయి” ఇది స్థానభ్రంశపు జైలుగదిలో కామ్రేడ్ సాయికి మే 14, 2018న వచ్చిన పీడకల. అహిరి