కేంద్రంలోని బిజెపి కార్పొరేట్ విధానాలను ప్రశ్నిస్తున్న రైతాంగ ఉద్యమానికి జేజేలు, ఢల్లీ రైతాంగ ఉద్యమంపై ఫాసిస్టు నిర్బంధాన్ని ఖండిద్దాం
భారతదేశ చరిత్రలో ఎన్నదగిన ఢిల్లీ రైతాంగ పోరాటం మరోసారి ప్రజ్వరిల్లింది. రెండేళ్ల కింద ప్రధానంగా పంజాబ్, హర్యాణా ప్రాంతాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి ఏడాది పాటు పోరాడినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ రోజు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఒత్తిడికి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ ఉద్యమంలో వచ్చిన ఇతర ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు వాటి ఊసే లేకుండా సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం