వ్యాసాలు

ఎన్నికలు – ముస్లింల ఎంపిక అవకాశం

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొంతమంది ఉన్నత వర్గాల ముస్లింలు తమ సమాజాన్ని బిజెపి గురించిన తమ అభిప్రాయాలను పునరాలోచించమని కోరుతున్నారు. (తారిక్ మన్సూర్, 'ముస్లింలు బిజెపి గురించి పునరాలోచించాలి', ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 01, 2024). భారతీయ ముస్లింల పట్ల ఎలాంటి వివక్ష జరగడం లేదని పునరాలోచనకు పిలుపునిచ్చినవారు అంటున్నారు. ఆహార ధాన్యాలు, గృహనిర్మాణం, వంట గ్యాస్, తాగునీరు మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల వల్ల ముస్లింలకు కూడా ప్రయోజనం చేకూరుతున్నదని వారు అంటున్నారు. ఇది కాకుండా, పస్మాందా, సూఫీ ముస్లింలపై బిజెపి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2014 తరువాత
వ్యాసాలు

దోపిడీ ప్రయోజనాలే రాజ్యాంగ విలువగా మార్చారు

విప్లవ రచయితల సంఘం 29వ మహాసభలో పాల్గొనటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనలు! గత సంవత్సరం జనవరి ఏడవ తేదీన హైదరాబాదులో జరిగిన విరసం అధ్యయన తరగతుల సందర్భంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం గురించిన చర్చలో మా అభిప్రాయాలను వివరించిన సంగతి ఒకసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రస్తుతం మనం అత్యంత సంక్లిష్ట సంక్షోభ సాంస్కృతిక వాతావరణంలో ఇక్కడ సమావేశమవుతున్నాం. ఇదంతా మన సామాజిక జీవితంలో, ప్రజల రోజువారీ అనుభవంలో ఉన్న సంక్షోభపు వ్యక్తీకరణగా భావించవచ్చు. 75 సంవత్సరాల క్రితపు అర్థవలస అర్థఫ్యూడల్‌ వ్యవస్థనుండి మౌలికంగా తెగతెంపులు చేసుకోగలిగిన నిజమైన ప్రజాస్వామిక మార్పు
వ్యాసాలు

మన కళలు సాహిత్యం కలలకు దూరం కాకూడదు

(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం) మిత్రులారా, కామ్రేడ్స్‌! మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్‌ జంగల్‌-జమీన్‌ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు. పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్‌ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు. మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి
వ్యాసాలు

ఫాసిస్టు సందర్భంలో రచన – ఆచరణ

Something is profoundly wrong with the way we live today...our problem is not what to do; it is how to talk about - Tony Judt Social reconstruction begins with a doubt raised among citizens. - Ivan ఇల్లిచ్ ముందుగా విరసం మహా సభలకు విచ్చేసిన అందరకీ అభినందనలు. సాహిత్యంలోని వర్తమాన ధోరణుల గురించిన దార్శనిక సంవాదాన్ని పరిపుష్టం చేయాల్సిన సందర్భంలో ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సభల పట్ల నాకు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయం ఉన్నది. ఐనప్పటికీ, ఈ చర్చలు
వ్యాసాలు

వర్తమాన సామాజిక సందర్భంలో మన రచన, ఆచరణ

సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది. కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తన  పౌరుల పైన, రైతులపైన డ్రోన్‌ దాడి చేస్తున్న ప్రభుత్వం

మానవ రహిత వైమానిక వాహనాలను (యుఎవి) అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2021లో, ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, "కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంతో జరిగే డ్రోన్‌ల దూకుడు ఉపయోగం యుద్ధ సమయంలో ట్యాంకులు, ఫిరంగి, భూతల సేన వంటి సాంప్రదాయ సైనిక హార్డ్‌వేర్‌లను సవాలు చేసింది." అతను చెప్పినది పూర్తిగా సరైనది. డ్రోన్ దాడులు ప్రపంచ యుద్ధాల తీరుని మార్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి - వీటన్నింటిలో సైన్యం డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా నేరస్తులుగా, ప్రజా ఉద్యమాలకు డ్రోన్‌లు సవాలుగా మారుతున్నాయి.
వ్యాసాలు

రాజ్యాంగ ఆరాధనలో స్పష్టంగా కనిపించని చిత్రం

ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి.  జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను
వ్యాసాలు

భారత రాజ్యాంగం – వైరుధ్యాల పుట్ట

(ఈ వ్యాసాన్ని ప్రొ. శేషయ్యగారు 2004లో రాశారు. రాజ్యాంగవాదం మీద వస్తున్న అభ్యంతరాలును పరిశీలించడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది. పౌరహక్కుల ఉద్యమకారుడిగా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా ఆయన రాజ్యాంగాన్ని  చారిత్రకంగా, విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురించిన ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం`1లో ఈ వ్యాసం పునర్ముద్రణ అయింది` వసంతమేఘం టీం) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్చు వివరిస్తూ ‘ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు, రైతులకు, పెటీ బూర్జువాల సామాజిక బానిసత్వాన్ని కొనసాగిస్తూనే, వారు రాజకీయ అధికారం పొందడానికి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మరో వైపు
వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ