ఎలక్టోరల్ ఆటోక్రసీగా భారత్
స్వీడన్(గోథెన్బర్గ్) ఆధారిత వి-డెమ్ ఇన్స్టిట్యూట్ ‘డెమోక్రసీ రిపోర్ట్ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్ డేటాసెట్లను ఉపయోగించుకుంది. వి-డెమ్ ఇన్స్టిట్యూట్ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ, క్లోజ్డ్ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో










