నివేదిక

కగార్ వ్యతిరేక నిరసనలు

*ఆదివాసులు, ఇతర ప్రజలపై జరుగుతున్న మారణకాండ, అణచివేతలకు వ్యతిరేకంగా విప్లవకర, ప్రజాస్వామిక పార్టీలు, సంస్థలు పంజాబ్ అంతటా జిల్లా స్థాయి నిరసనలు నిర్వహించాయి* ఛత్తీస్‌గఢ్‌లోనూ దేశంలోని వివిధ ప్రాంతాలలోనూ స్వదేశీ, విదేశీ దోపిడీ నుండి జీవనోపాధి, నీరునిఅడవులను, భూమిని రక్షించడానికి పోరాడుతున్న ఆదివాసులు, ఇతర ప్రజలపై పోలీసు ఎన్‌కౌంటర్ల పేరుతో జరుగుతున్న హత్యలు, అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ, ఆర్‌ఎంపిఐ, రివల్యూషనరీ సెంటర్ పంజాబ్‌లు ఈరోజు జలంధర్, కపుర్తల, అమృత్సర్, గురుదాస్‌పూర్, షహీద్ భగత్ సింగ్ నగర్, లూథియానా, మోగా, ఫరీద్‌కోట్, సంగ్రూర్, పాటియాలాలతో సహా
దండకారణ్య సమయం

ఆదివాసీ యువ  నేత అరెస్టు  

ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది. గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్‌పూర్ జైలుకు పంపారు. రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది. తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ,
పత్రికా ప్రకటనలు

ఆదివాసీ నాయకుడు రఘు మిడియామి  అక్రమ అరెస్టు 

2025 ఫిబ్రవరి 27 నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ‌ఎ) దంతేవాడ నుండి ప్రముఖ యువ ఆదివాసీ నాయకుడు రఘు మిడియామిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది. 2025 ఫిబ్రవరి 28నాడు ఎన్‌ఐ‌ఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మూల్‌వాసీ బచావో మంచ్‌తో సంబంధం ఉన్న గజేంద్ర మాండవితో పాటు మరొక వ్యక్తిని 6 లక్షల రూపాయల నగదు,  మూల్‌వాసీ బచావో మంచ్‌, మావోయిస్టుల కరపత్రాలతో అరెస్టు చేసినట్లు చెప్పింది. 25.03.23న గజేంద్ర మాండవిని అరెస్టు చేసిన తర్వాత 24.08.23న నమోదు చేసిన FIR నం.02-2023-NIA-RPR పై దర్యాప్తులో, రఘు మిడియామి మూల్‌వాసీ బచావో మంచ్
పత్రికా ప్రకటనలు

పదమూడు నెలల ఆపరేషన్ కగార్

ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం. ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా  2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి.