సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్