సిలింగేర్ మూడవ సంవత్సరం పూర్తయిన సందర్భంగా సభ జరుపుకోడానికి జిల్లా పాలనాయంత్రాంగం నుంచి అనుమతి అడగడానికి సుక్మాకు వెళ్ళి తిరిగి వస్తున్న మా మూల్‌వాసీ బచావో మంచ్ కార్యకర్త కృష్ణ కుమార్ కడ్తీని డోర్నపాల్ పోలీసు ఇన్ స్పెక్టర్ శశికాంత్ సిన్హా ప్రత్యక్ష ఆద్వర్యంలో అక్రమంగా అరెస్టు చేశారు. వారు పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేసే  కుట్రలో సఫలమయ్యారు. మేము ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

మేము  సిలింగేర్ మూడవ వార్షిక ఉత్సవాన్ని జరుపుకోడానికి ఈ సంవత్సరం  చేసిన ప్రయత్నాలన్నీ ప్రభుత్వానికి తెలుసు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సాకుగా చూపించి అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ శాంతియుతంగా వుండి నియమావళి కాలం  అయిపోయిన తరువాత జూన్ 9-10 తేదీల్లో  జరుపుకుందామని ఏర్పాట్లు చేశాం. మీడియాకు కూడా తెలియచేసాం.

ఈ క్రమంలో జూన్ 8 నాడు ఒక టీమును ఏర్పాటు చేసి సిలింగేర్ మూడవ సంవత్సరం పూర్తయిన సందర్భముగా  ఒక విజ్ఞప్తి పత్రాన్ని సుక్మా కలెక్టర్‌కు  పంపించాం. కానీ జిల్లా ఎస్‌పి కిరణ్ చౌహాన్, డోర్నపాల్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ శశికాంత్ సిన్హా ఎస్‌డి‌ఎంలు ముగ్గురూ కలిసి అసలు విషయం వదిలేసి మేం పంపించిన సహచరులను నానా తిప్పలు పెట్టి సమయాన్ని వృధా చేశారు. సభను జరగకుండా చేయడానికి, తమ చర్యల ద్వారా మా కార్యకర్తలలో, ప్రజలలో భయవాతావరణాన్ని సృష్టించాలనే తమ అసలు ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోడానికి ప్రయత్నించారు . పోలీసు అధికారులు మా ముగ్గురు సహచరులను డోర్నాపాల్ దగ్గర హఠాత్తుగా వాహానాల్లో వచ్చి బెదిరించి, అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్ళారు.

ఆ ముగ్గురినీ తమకు మావోవాదులతో సంబంధం వున్నదని ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. కృష్ణ కుమార్ కడ్తీని రెండు రోజులు పోలీసులు ఎంతగా కొట్టారంటే స్పృహ తప్పిన స్థితిలో పోలీసులే అతన్ని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. పోలీసులు మా యితర యిద్దరు కార్యకర్తలను వదిలేసి, కృష్ణకుమార్ మీద మావోయిస్టులకు సరఫరా చేస్తాడనే తప్పుడు ఆరోపణ చేసి విచారణకు పంపించారు.   

బస్తర్‌లో భాజప ప్రభుత్వానికి కార్పొరేట్ అనుకూల విధానాలని ప్రోత్సహించడం, ఆదివాసీలను హత్య చేయడమే కర్తవ్యాలు అయినట్లుగా కనిపిస్తోంది. ఇది చాలా విచారకరమైన, ఆందోళన చెందాల్సిన విషయం. గత అయిదు ఆరు నెలలుగా జరిగిన ఘటనలు చూస్తే యిది సరియైనదిగా అనిపిస్తోంది. అందువల్లనే బస్తర్‌లో జరుగుతున్న ప్రజా పోరాటాలలో ముఖ్య పాత్ర వహిస్తున్న మా మూల్‌వాసి బచావో మంచ్ కార్యకర్తల అరెస్టులు నిరంతరం జరుగుతున్నాయి. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నది. కానీ ఆందోళన జరపకపోతే మాకు ఏమీ మిగలదు అని మాకు అనుభవం తెలియచేస్తున్నది.

బస్తర్ లో ఆదివాసీల మీద, మా సంఘం మీద పోలీసులు, ప్రభుత్వము ద్వారా నిరంతరం జరుగుతున్న దమనకాండ, చట్టవ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం ఎత్తాలని   మూలవాసి బందువులు, మానవహక్కుల సంఘాలు, సామాజిక- సాంస్కృతిక సంఘాలు, ప్రజాస్వామిక మేధావులు, సర్వ్ ఆదివాసీ సమాజ్, గోండ్వానా సమాజ్, భారతీయ కిసాన్ యూనియన్, పి‌యు‌సి‌ఎల్, జన్ ముక్తి మోర్చా, యితర అన్నీ నిజమైన దేశభక్తి సంఘాలు, కార్యకర్తలందరికీ  విజ్ఞప్తి చేస్తున్నాం. మా న్యాయమైన ఆందోళనకు మద్దత్తు యిచ్చి సహకరించండి.

యిప్పటి వరకు అనేక తప్పుడు కేసుల్లో అరెస్టు చేసిన మా సహచర కార్యకర్తలు గజేంద్ర్ మదావి, సుర్జు టేకామ్, సునీతా పొటామి, సురేష్ అవలాం, కృష్ణకుమార్ కడ్తీ లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రజా ఉద్యమాలను జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

13-06-24

Leave a Reply