రాజ్యం కోరలు
ఎల్లెడలా విస్తరించే చోట
నాకంటూ
ఒకచోటు లేకుండా పోయింది
నేను నేను తినే ఆపిల్ పండు
బిర్యానీలో వేసే కుంకుమపువ్వు
అన్ని కాశ్మీరు నుండి దొం గిలించినవే

రాసుకోవడానికి ఒక టేబుల్ ఉండదు
పుస్తకాలకు ఒక సెల్ఫీ ఉండదు
నాకు ఇష్టమైన
"జీత్ సాయిల్" కవిత్వం
తనివితీరా చదువుకునేందుకు వీలుండదు

నురగలుగక్కే కాఫీ తాగడం
పూలను పలకరించి మాట్లాడడం
ఎప్పటికీ తీరని కల

కళ్ళు లేని మా నాయన
నష్టాలు గూర్చి
ఎప్పుడు లొల్లి పెడుతుంటాడు
ఊది ఊది మా అమ్మ ఊపిరితిత్తులు
ఖాళీ అయిపోయాయి

సిలిండర్ లేని బతుకు మాది

మరోవైపు
జైలు ఊచల నుండి
మా మిత్రులు గగ్గో లు పెడుతుంటారు

వాళ్ళు విడిచి వెళ్లిన కలలను
నేను నెమరేస్తుంటాను
అన్నానికి ఆకలి దోస్తు అని తెలుసు
నాకు "ఫంటా బట్ "తప్ప
మరే రుచి తెలవదు

నా అక్షరాలు
ఎప్పుడూ సుఖ జీవితాన్ని నుండి వికసించవు

అవి చల్లనివి
అమరుల శరీరమంతా చల్లనివి
*

("ఫంటా బట్ "ఇది బెంగాలీలఆహారం .సద్ది అన్నాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డతో కలిపి తింటారు).


మోమిత ఆలం..సుప్రసిద్ధ బెంగాలీ రచయిత్రి.. ఉపాధ్యాయురాలు. అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తుంది. ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపిస్తున్న కవి . దేశవ్యాప్తంగా ఆమె కవిత్వానికి విశేష పాఠకులు ఉన్నారు . జీవితంలోని అనేక సమయ సందర్భాల నుంచి ఫాసిస్టు వ్యతిరేక చైతన్యాన్ని ప్రకటిస్తున్నారు . ముప్పై మూడేళ్ళ మౌమితా ఆలం కవితలు పలు భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె కవితల్ని ఉదయమిత్ర తెలుగులోకిఅనువదించి"రాయగూడని పద్యం " అనే సంకలనం తెచ్చారు.

ఆమె రాసిన పుస్తకాలు:
1) Poems at Daybreak
2) Smell of Azadi
3) Musings of the Dark

ఇటీవల వలస కూలీల మీద చేసిన
పరిశోధనలకుఆసియాలో ఓ అవార్డు వొచ్చింది.


Leave a Reply