ఆర్‌యస్‌యస్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ఆత్మకథ
ఇటీవల విస్తృతంగా చర్చజరుగుతున్న పుస్తకం ‘నేనెందుకు హిందువును కాకుండా పోయాను?’ అని రాజస్థాన్‌కు చెందిన భన్వర్ మేఘ్వంశీ ఆత్మకథ రాశారు. ఆ పుస్తకం ముఖచిత్రంలోనే ఆర్‌యస్‌యస్ సావాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ అని రాశారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చాలా సాహసం చేసిందనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ అనువాద రచయిత కె.సత్యరంజన్ చాలా సహజంగా తెలుగులోనే ఈ పుస్తకం వచ్చిందా అన్నంత గొప్పగా అనువాదం చేశారు. ఈ పుస్తకంలోతుల్లోకి వెళ్ళి ఆర్‌యస్‌యస్ ఒక అబద్దాల పుట్టఅని, దేశప్రజల్ని ఎలా మాయచేస్తుందో , కాదు కాదు ఎలా మోసం చేస్తుందో తెలియజేయాల్సిన అవసరముంది.
ఆర్‌యస్‌యస్ శిబిరాన్ని సందర్శించినపుడు అక్కడ మీ క్రమశిక్షణ, అస్పృశ్యత ఛాయలైన లేకపోవడం చూసి నేనెంతో ప్రభావితుడనయ్యాను.. అని మహాత్మగాంధీ అన్నట్లు రాసుకుంది. ఇది ఎక్కడ ఏ సందర్భంలో ఆయన మాట్లాడాడో చెప్పకుండా గాలికబుర్లు చెబుతుంది ఆయన 16.9.1947న ఢిల్లీలో ఒక ఆర్‌యస్‌యస్ ర్యాలీలో మాట్లాడినట్లు తప్పుడు రాతలు రాస్తుంది. నిజంగా ఆయన అలా వుండి వుంటే ఆయనను మీ కార్యకర్త నాథురాం గాడ్సే ఎందుకు చంపాలి. ఇంకొక తప్పుడు రాత గమనించాలి. తోటివారి కులాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా స్వయం సేవకులు సంపూర్ణ సమానత్వం, సౌభ్రాతృత్వాలతో కలసిమెలసి ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను.1939 మేలో పూనే శిబిరంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మాట్లాడినట్టు హెచ్‌వి శేషాద్రి అనే ఆర్‌యస్‌యస్ నాయకుడు తను రాసిన పుస్తకంలో ఉటంకిస్తాడు. మరి నిజంగా దళితుల మీద ఆంబేడ్కర్ మీద ఆర్‌యస్‌యస్ సంఘ్ శక్తులకు ప్రేమగౌరవం ఉంటే ఈ భన్వర్ మేఘ్వంశీ ఈ దేశానికి ప్రధానో, రాష్ట్రపతో అయ్యండేవాడు. మరి దళితుడుగా ఆయన ఎదుర్కొన్న వివక్షను, అవమానాలను ఆయన రాసిన ఆత్మకథనే విందాం..ఆయన మాటల్లోనే విందాం.
1. రామ్‌నాథ్‌కోవింద్ ఈ దేశానికి అధ్యక్షులుగా చేశాడు. ఆయన దళితుడు. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగపదవిని ఎన్నుకోబడ్డారు, కానీ రాజ్యాంగేతర ఆర్‌యస్‌యస్‌లో అంతట అత్యున్నత పదవిని ఇప్పటివరకూ ఎందుకు చేపట్టలేదు?
2. ముస్లీంలు దుందుడుకువాదులు, గూండాలు. అందుకే మనం ముస్లీంలను నమ్మకూడదు. నమ్మించి మోసం చేస్తారు. అందుకే మనం ఈ దేశంలో మెజార్టీగా ఉన్నా మనకు రక్ష లేకుండా పోతుంది అన్నది ఆర్‌యస్‌యస్ అసలు వైఖరి.
3. హిందువులకు వ్యతిరేకంగా ముస్లీంలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు కుట్రలు చేస్తారు అని నిరంతరం దుష్ప్రచారం చేయడం దాని నైజం.
4. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకు ప్రేమ అంటూ మాయమాటలు చెప్పి లేవదీసుకుపోతుంటారు. వాళ్ళ కోర్కెలు తీర్చుకుని వ్యభిచార గృహాలకు అమ్మేస్తుంటారు. మసీదుల్లో ఆయుధాలు దాచిపెడతారు. వాళ్ళు బీఫ్ తింటారు. పాకిస్థాన్ మనదేశం మీద దండెత్తిన రోజున వీళ్ళంతా మన మీద దండయాత్ర చేస్తారు అంటూ రెచ్చగొడుతుంది.
5. ఈ జాతినిర్మాణ ప్రణాళిక కేవలం మానవసంకల్పంకాదు దైవదత్తమే అనే అశాస్త్రీయతను నూరిపోస్తుంది.
6. నాగరికత నేర్పిన హిందువుగా జన్మించడం అంటే ఎవరికి మాత్రం గర్వం కాకుండా పోతుంది. ఈ ప్రపంచానికి శూన్యాంశాన్ని, అంకగణితాన్ని ఇచ్చింది హిందూమతం. ప్రపంచంలోని ఇతరేతర మతగ్రంధాలన్నీ మన వేదాల మందు మరుగుజ్జులే. ఈ భూమ్మీద నివసించే సకల చరాచర జీవకోటిని పవిత్రంగానూ స్త్రీలను పూజ్యనీయంగానూ చూసేది హిందూమతం అని అందరూ నమ్మేలా వక్రీకరణ చేస్తుంది.
7. హిందూ సమాజం ఇంతకాలం మనుగడ సాగించడానికి కుల కట్టుబాట్ల వ్యవస్థే కారణం. ఇదే లేకుంటే ముస్లిమ్, క్రైస్తవ మతాలు ఏనాడో మన మతాన్ని మింగేసేవి. అందుకే అగ్రకులాల వాళ్ళు బిసిలు, దళితులు, గిరిజనులలో బాగా చదువుకున్నవారు వృత్తి నిపుణుల ‘మీద కేంద్రీకరించి వారిని కూడా హిందూత్వలో భాగం చెయ్యాలని, అదే సమరసతా యజ్ఞం’ అని సంఫ్‌ు అందరికీ లేఖ రాసింది.
8. హిందూ మతం పేరిట దళితుల మీద దాడిచెయ్యడానికి ముందుంటారు. మీరు హిందూత్వవాదానికి నమ్మినబంట్లలా ఊడిగం చేస్తారు కదా సనాతన హిందూ ధర్మం ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో మీ స్థానం ఎక్కడని నిర్ణయించిందో తెల్సా అని అడిగితే తెల్లబోతారు.
9. పంచగవ్య అంటే ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుల సమ్మిశ్రమం.. దళితులు అది తింటే శుద్ధి అయినట్లు. అప్పుడు యజ్ఞంలో పాల్గొనేందుకు అంగీకరిస్తారు.
10. హిందూ మతం పరమతి సహనాన్ని పాటిస్తుందని, అహింసను, శాంతియుత సహజీవాన్ని కోరుకుంటుందని ప్రవచిస్తుంటారు కదా. కానీ హిందూ పురాణాలు అన్నింటా దళితులు, సూద్రులు, ఆదివాసీలు, మహిళల మీద సవర్ణులు సాగించిన దాష్టీకాలను కప్పి పెడుతుంటారు. శంభుకవధ, ఏకలవ్యుడిని బొటనవేలు గురుదక్షిణగా పొందడం, శూర్పణఖ ముక్కు, చెవులు కొయ్యడం, అనేకమంది దేవుళ్ళు మాయారూపులై స్త్రీలను చెరబట్టడం వంటి పురాణపుణ్య (?) పురుషుల అడుగుజాడల్లో నడుస్తున్నట్లున్నారు నేటి హిందూత్వవాదులు.
11. ఈ రోజుకీ ఆర్.యస్.యస్. జాతీయ వర్కింగ్ కమిటీలోగాన, ప్రచారక్ లుగా గానీ ఎంత మంది దళితులు, ఆదివాసీలు ఉన్నారో లెక్కచెప్పమనండి? చెప్పడు. ఎందుకంటేఆర్.యస్. యస్. కరడుగట్టిన బ్రాహ్మణీయ హిందూత్వ సంస్థ. ఇప్పటికీ అంటరానితనాన్ని ‘‘పాటించే సనాతన ధర్మ సంస్థ. ఆర్.యస్.యస్. పరమపద సోఫానంలో పై మెట్టుకు చేరకుండా కుల వివక్ష అనే పెద్దపాము దళితులను, ఆదివాసీలను మింగేసి ఎప్పుడు అట్టడుగునే ఉంచుతుంది.
12.. గోసంరక్షణ కోసం చట్టాలు చేసి, ఎలుకలను, ఎద్దులను పాములను పూజించే హిందూధర్మం దళితులను, ఆదివాసీలను సాటి మనుషులుగా గౌరవించే స్థాయికి ఎప్పటికి చేసుకుంటుంది? ఎప్పటికీ చేరుకోదు. ఎందుకంటే ఆర్.యస్.యస్ కులవ్యవస్థను నిర్మగా సమర్థిస్తుంది. ఉద్యోగాలు, ఉపాధి, అవకాశాలు, పదోన్నతులలో రిజర్వేషన్లు ఎత్తిపారెయ్యాలని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రద్దు చెయ్యాలనేది ఆర్.యస్.యస్. ఆప్రకటిత సంకల్పం. అలాంటి ఆర్.యస్.యస్. స్థాపించే అకండి హిందూ రాజ్యంలో దళితులు,/ఆదివాసీలు ఇప్పటిలానే అట్టడుగు జీవితాలకే పరిమితం కావాల్సి ఉంటుంది.
13. దళితుల జీవితాలకు సంఫీుయులు ఇచ్చే విలువ అది. ఆవు ఉచ్చని, అయినా పవిత్రంగా భావించి తాగుతారు కానీ దళితుడి చేతి నీళ్లు ముట్టనైనా ముట్టరు. క్కులవి, పిల్లులవి కన్న బిడ్డల కంటే ఎక్కువడా సాకి తమతోపాటు పక్కన కూచుని తిని, పక్కలో పడుకోవడాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కానీ దళితులని తమ పక్కన కూచోనివ్వడం సంగతి అటుంచండి. కనీసం వాళ్ల నీడ కూడా తమ మీద పడడం తీవ్ర అపరాధంగా భావిస్తారు. ఇంతటి అమానుషత్వం ఇమిడి ఉన్న మతం ఒక మతమేనా?
14. నేను ఆర్‌యస్‌యస్ శాఖకు క్రమం తప్పకుండా వెళ్ళే రోజుల్లో అక్కడ ముస్లిమ్ల పట్ల విద్వేషాన్ని ఎలా నూరిపోసేవారో నాకింకా బాగా గుర్తు. ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం మగమనిషి జీవితంలో ఒక్కసారయినా హిందూ మహిళను శారీరకంగా అనుభవించి తీరాలని కంకణం కట్టుకుని ఉంటారు. అలా చెయ్యడం మూలంగా వాళ్ళకు స్వర్గంలో బహుమానం లభిస్తుంది.
15. సంఘ్ లోనూ, భాజపాలోనూ, దశాబ్దాలపాటు విశ్వాసంగా పనిచేసిన వెనుకబడిన కులాలు, దళిత వర్గానికి చెందిన వారితో ఆయా కులాల చరిత్రను రాయించింది. ఈ కుల చరిత్రలు అన్నీ మనువాద హిందూ ధర్మాన్ని ఎక్కడా తెగనాచకుండా ఆయా కులాల ప్రస్తుత దుస్థితికి భరత ఖండాన్ని దురాక్రమించి పరిపాలించిన ముస్లిం పరిపాలకుల మీదకు నెట్టేలా జాగ్రత్త వహించింది. ఆ రకంగా హిందూ మత గ్రంధాలలోని అమానవీయ మనువాద వర్ణవ్యవస్థని ప్రశ్నించే పరిస్థితిని తెప్పించింది.మూడవ అంశంగా అంబేద్కర్ని స్వంతం చేసుకుని ఆయన భావజాలాన్ని కలుషితం చేసే పని పెట్టుకుంది. అంబేద్కర్ ఏ పరిస్థితులలో, ఏ నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు. చేసారు అనే దానితో నిమిత్తం లేకుండా ఆయన్ని ముస్లిం వ్యతిరేకిగా, హిందూరాష్ట్ర సమర్థకుడిగా చిత్రీకరించే వైపరీత్యానికి ఒడిగట్టింది. అంబేద్కర్ ఫలానా ప్రచారక్తో’’ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇట్లా అన్నాడు. ఆర్‌యస్‌యస్ సమావేశానికి హాజరయ్యాను. భగవధ్వజాన్ని బహుమతిగా స్వీకరించాడు వంటి కట్టుకధల్ని విరివిగా ప్రచారం చేసి దళితులలో సంఫ్‌ు పరివార్ పట్ల ఆమోదాన్ని సృష్టించుకొనే ప్రయత్నం నేడు చేస్తున్నది.
అందుకే ఈ పుస్తకాన్ని ప్రతి భారతీయుడు చదవాలి. భన్వర్‌మేఘ్వంశీకి జరిగిన ప్రతి అవమానం ఇందులో రికార్డు చేయబడి వుంది. కరసేవకుడుగా హిందూ రాష్ట్ర నినాదంతో శక్తివంచనలేకుండా కృషిచేయటమేకాక ఆర్‌యస్‌యస్ లో ఎదుగుతున్నక్రమంలో దళితుడుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటాడు. ఆర్‌యస్‌యస్ నూరిపోసే విషాన్ని గరళంలోనే దాచుకుని ఈ వర్తమాన ప్రపంచానికి ఆ విషాన్ని అక్షరాలుగా మలచి లౌకికత్వాన్ని బతికించే ప్రయత్నం చేశాడు. అసీఫా ఘటన చూశాం. అసీఫానుjన గుడిలో రేప్‌చేసి చంపి దారుణానికి ఒడిగట్టారు. ఇదీ ఆర్‌యస్‌యస్ సిద్దాంతం. ఇదే నేర్పిస్తుంది. ఇదే అమలు చేస్తుందని మనకు సస్పష్టమౌతుంది. అందుకే ఈ పుస్తకం నిండా ఆర్‌యస్‌యస్ సాగిస్తున్న దురాగతాలన్నీ ఉన్నాయి. ఈదేశాన్ని ఎలా సర్వనాశనం చేయాలో పన్నే కుట్రల్ని భన్వర్ మేఘ్వంశీ రాశాడు. దాన్ని పరిశీలిద్దాం..
1.‘‘పెద్దపెద్ద శిబిరాలు వేసి వందల, వేల భక్త జన కోటిని పోగేసి ధర్మసూత్రాలు భోధించినా, అనుగ్రహ భాషణలు ఇచ్చినా ఈ దేశంలో హత్యలు, మానభంగాలు, కులతత్వం, దోపిడీ, పీడన, అవినీతి, అన్యాయం, అక్రమాలు, కుంభకోణాలూ పది తగ్గలేదు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు మన భారతదేశం అది జబ్బులు చరుచుకోవడం తప్పు ప్రపంచదేశాల ఎదుట సగర్వంగా చెప్పుకునేందుకు ఏముంది మనలో. ఈ దేశంలో మూడొంతుల జనాభాని అసలు మనుషులుగానే చూడరు. కానీ అదే జనం పడే పడే వాళ్ళ దేశభక్తిని నిరూపించుకోవాలట, భరతమాత బిడ్డలం అని ఆనందపారవశ్యాలతో పాడుకోవాలట, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలట. ఇంకా నయం రోజు నిక్కర తొడుక్కుని పొద్దున్నా సాయంత్రం నమస్తే చెయ్యడం తప్పనిసరి చెయ్యలేదు. బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ తల్లకిందులు ఆలోచనలకు తలొగ్గుతారా? మేం తలొగ్గంగాక ఒగ్గం.. రాక్షస సంత అనీ, హిందూ వ్యతిరేకులనీ, హిందూ ధర్మాన్ని కాలరాసేవాళ్ళని – మమ్మల్ని ఏవీ అయినా పిల్చుకోండి. మేం లెక్కచెయ్యంగాక చెయ్యం..’’మా దళిత గొంతుకలను ఇంకెంతో కాలం నొక్కి పెట్టలేరు. మాఒంట్లో చివరాఖరి ఊపిరివరకూ అనాగరికమైన, అమానుషమైన సనాతన ఆచారాలను వ్యతిరేకిస్తాం. మా శక్తినంతా కూడగట్టుకుని తిప్పికొడతాం. అంతిమ విజయం సాధిస్తాం.’’
2.సంఘ్ అనేది ఒక అర్థసైనిక సంస్థ. హిందూ మతస్థులకు ఆయుధ శిక్షణ ఇచ్చి సాయుధులుగా తయారు చెయ్యడమే దాని లక్ష్యం. అభినవ్ భారత్ పేరిట 2006లో దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన బాంబు పేలుళ్ళకు సూత్రధారులు అందరూ స్వయం సేవకులే. ఇప్పుడు ఏకంగా ఆర్‌యస్‌యస్ కనుసన్నల్లో నడిచే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ముస్లిం మతస్థులపై నరమేధానికి పాల్పడిరది. ఆర్‌యస్‌యస్ ఒక సంఘ విద్రోహక సంస్థ అనడానికి ఇంతకన్నా ఏం రుజువులు కావాలి.
3.బీసి, దళిత కులాల వాళ్లలో కూడా కొందరు మృతప్రాయమైన ఈ బ్రాహ్మణ భావజాలాన్ని తమ భుజస్కందాలపై మోస్తూ అదేదో పరమపవిత్ర కర్తవ్యం నెరవేరుస్తున్నట్లు భావించడం విషాదాల్లో కెల్లా విషాదం.
ఆర్‌యస్‌యస్ పదేపదే తమది సామాజికసాంస్కృతిక సంస్థ మాత్రమే అనీ, రాజకీయాలతో మాకు సంబంధం లేదు అని ప్రకటిస్తుంటుంది. కానీ సంఫ్‌ుపరివార్ దీర్ఘకాలిక వ్యూహఫలితమే మోడీ ప్రభుత్వ ఏర్పాటు అని కనీస రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమైతుంది. కేంద్రప్రభుత్వాన్ని ఆర్‌యస్‌యస్ తన కనుసన్నల్లో నడపగలుగుతుంది. అని భన్వర్ మేఘ్వంశీ చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో చెప్తాడు. ఇదినిజం కాదా? కొత్తకొత్త సంస్థలను తెరమీదకు తీసుకురావడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతి సందేహాన్ని అది నమ్మకం, విశ్వాసం అనే రెండు మాటలతో జయిస్తూ ప్రజల్లో నిరంతం అశాస్త్రీయతను నూరిపోస్తుంది. వర్తమానదేశం ఎదుర్కొంటున్నదిదే కదా..! కవి రచయిత, జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారుడు భన్వర్ మేఘ్వంశీ చేస్తున్నపోరాటం ప్రతివొక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆతనిప్పుడు చాలా స్పష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ దేశంలో మతోన్మాదులు చేస్తున్న కుట్రలను తేటతెల్లం చేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నాడు. అంతేకాక అతఙ పుస్తకంలో కోరుకుంటున్నట్లు కవిత్వం భాస్వరంలా మండలాంటాడు. అందుకే భాస్వరం లాంటి సాహిత్యసృజన చేస్తున్నాడు.అందుకే ఆయన రాసిన కవితా పంక్తులు ఎంతబలమైనవో చూద్దాం..
1.మనుస్మృతిని తగలబెట్టడంతోనే ఆగిపోయావెందుకు బాబాసాహెబ్ అదే మనవు దాగిన అసంఖ్యాక పుటలకు అదే మనవు తిష్టవేసిన సవర్ణుల మస్తిష్కాలకు నిప్పుపెట్టేదెవరు..
2.ఏకలవ్యువడి గురుభక్తి మీద.. ఎందుకు సోదరా ఏకలవ్యా కోరిన వెంటనే నీ బొటనవేలిని ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చావ్ అంతకన్నా అలాంటి దుర్మార్గపు దక్షిణ అడిగిన ఆ ఆచార్యుల వారి తల నువ్వే తీసేసి వుంటే మరే ద్రోణుడూ ఏకలవ్యుల బొటన వేళ్ళు గురుదక్షిణ కోరే సాహసం చేసి ఉండేవారు కాదు కదా.. శబరి
రాముడు
రాజా రామాచంద్రా
మా అదివాసి శబరి
ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను ఆరగించి
మా మీద నమ్మకం ఉంచావని చెప్తున్నారు.
కానీ మా శబరిని
నీకాళ్ళ దగ్గర కూచోబెట్టుకుని
మా స్థానం ఏమిటో చూపించావ్..
అందుకే ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలంటే లాల్`నీల్ అనివార్యమంటూ పరోక్షంగా చెబుతారు. అంబేడ్కర్ మార్క్సీయ భావజాలంతో ముందుకుసాగుతున్న భన్వర్ మేఘ్వంశీ చేస్తున్న ఈ పోరాటంలో మనమూ తోడౌదాం..