దేశం ఒంటరైపోతుంది
ఎత్తైన హర్మ్యాలు తేజం కోల్పోతాయి
గమ్యం చేర్చే రహదారులన్నీ
అగమ్య గోచరాలవుతాయి
యుద్ధం వస్తే మాట్లాడల్సింది
రెండు పెదవులు కానీ
ఇరువైపుల తుపాకులు మాట్లాడతుంటాయి
కొందరు బతకడం కోసం నిత్యం
యుద్ధం చేస్తే
ఇంకొందరు బతికేదే యుద్ధం కోసం
యుద్ధం తరువాత
దేశం ఒంటరవుతోంది
జనులొంటరౌతారు
చేతులకు చేయి కాళ్లకు కాళ్లు
ఒంటరిగా
యుద్ధం తరువాత నడుస్తాయి
యుద్ధంలో దగ్ధమైన అడవంతా
పక్షులగానం కోసం ఏడుస్తుంది
అన్ని అసంపూర్ణంగా నడుస్తాయి
కానీ
యుద్ధానికి బలైన దేశం మాత్రం
సంపూర్ణంగా ఏడుస్తుంది
మొలకెత్తిన విత్తనం
రెండు హరితదళాలు జోడించి
సూర్యుడికి నమస్కరిస్తే
పత్రాలనిండా రుథిర వర్ణం పూసుకున్నది
ఇది అప్పుడే పుట్టిన బిడ్డక్కుడా
మినహాయింపు కాదేమో. ..!
యుద్ధాలోస్తే
ఆయుధ కర్మాగారాల
పనేంటంటే
దేశాన్ని శవకర్మాగారంగా మార్చే
పత్రంపై సంతకం చేస్తున్నాయి
చివరిగా
యుద్ధం ముగిసాక
సరిహద్దుల గోర్జల్లో పారేటి
నీళ్ళల్లో నెత్తురు కొలనులు పుట్టుకొస్తున్నాయి
నేలంతా యింకా
నెత్తురు ఊటలు తాగాల్సిందేనా.... ?
ఇప్పుడు ఎవ్వరు
ఒక
శాంతి మెుక్కని నాటడానికోస్తారా
అని
రణరంగంలో కండ్లు తెరిచి
శాశ్వతంగా నిద్రిస్తున్న
యోధుడి స్వప్నం ఎదురుచూస్తుంది
Related
పత్రాల నిండా రుధిర వర్ణం పూసుకున్నది
Thank you 🙏 sir