ఈ భూమి శ్రమజీవులదని ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని సమాజంలో కులం లేదు మతం లేదు మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చాటి చెప్పిన విశ్వగురు బసవన్న.  సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోడీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగులు పెట్టి బసవన్నను మతోన్మాదులు సాంస్కృతిక విప్లవకారుడుగా 12వ శతాబ్దంలో అసమాన తలపై కులవివక్షపై ఆధిపత్య ధోరణిపై తన ప్రవచనాలతో సాంస్కృతిక విప్లవానికి పునాదులు వేసిన మహోన్నతమైన సంస్కర్త బసవన్న.  12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం నా అస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప విప్లవకారుడు. ఆ మహనీయుడిపై ఇటీవల కాలంలో కన్నడ భాషలో బసవన్న మత్తు అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం వచ్చింది. రంజాన్ దర్గా అనే ఒక పరిశోధకుడు ఈ పుస్తకాన్ని పుస్తకాన్ని మతోన్మాదులకు బలైన డాక్టర్ ఎం ఎం కల్బురికి అంకితం చేశారు. ఈ పుస్తకంలో బసవన్న ప్రవచనాలను పరిశోధనాత్మకంగా ఉదహరిస్తూ వచ్చారు ఇందులో బసవన్న ప్రవచనాల్లో చెప్పుకోదగ్గ వ్యాఖ్యానాలను సమాజానికి అందించే ప్రయత్నం ప్రవచనాలు ముఖ్యంగా పేద ధనిక ఆడ మగ తేడాలు ఉండరాదని ఈ ప్రపంచానికి బసవన్న చాటు చెప్పాడని,  సంపద అందరిదని ఇంకా చెప్పాలంటే ఉత్పత్తి చేసే శ్రమజీవులదని శ్రామిక ప్రజలపక్షాన ప్రవచనాలను చెప్పి మానవీయవ్యవస్థ నిర్మితమయ్యేందుకు కృషిచేసారని పుస్తకంలో వివరించారు. బహుశా తెలుగు సాహిత్యంలో ఇంత పరిశోధనాత్మకంగా పుస్తకం బసవన్నపైన వచ్చిన సందర్భం లేదు. పుస్తకం చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న దురాగాతలపై తన ప్రవచనాలతో బసవన్న మహా యుద్ధమే చేసినట్లు తెగ తెలుస్తుంది. దళితులు గిరిజనులు హక్కులు కోల్పోయిన ప్రతి ఒక్కరు హక్కులు ఉండాలని మనిషిని బానిసత్వం నుండి విముక్తి చేయాలని బానిసత్వం దశలోనూ వుండ కూడదని ఆయన ప్రవచనాల్లో ప్రవచించినట్లు రాశారు. 850 సంవత్సరాల క్రితమే కులం, వర్గం వర్ణం, లింగం లేని, కులవివక్ష లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని బసవన్న ఆ తరహా సమాజాన్ని నిర్మించాడనికి కృషి చేసి సఫలం అయ్యాడు. దాన్ని సమతా ప్రజాస్వామ్య సమాజం అన్నాడని పరిశోధకుడు ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. మనిషి సాంగీకరించబడాలని, సమానత్వ భావన రావాలని తీవ్రంగా కృషి చేశారని, కుటుంబ ప్రేమ, సామాజిక ప్రేమ, దేశభక్తి,సర్వ మానవ ప్రేమ కలిగిన గొప్ప దార్శనికుడు బసవన్నగా ఈ పుస్తకం అభివర్ణిస్తుంది. అంత గొప్ప విప్లవకారుడుని కులం వద్దు అన్న విప్లవకారుడిని మతం ఈ దేశంలో పనికిరాదని చెప్పిన మహోన్నతుడిని ఒక సామాజిక వర్గం ఈరోజు అతనిని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తున్నారు. అధునాతన సామ్యవాద స్పృహ అధునాతన సమతా స్పృహ ఆయన ప్రవచనాలుగా బోధిస్తాయని ఈ పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడింది. కర్మ సిద్ధాంతం అత్యంత క్రూరమైన సిద్ధాంతంగా అభివర్ణించాడని దానివల్ల 90 శాతం మంది బానిసలు అవుతారని ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దోపిడికి గురవుతారని ఆయన రచనల్లో చెప్పినట్లు రచయిత రంజాన్ దర్గా పేర్కొన్నారు.  అహంకారానికి కులతత్వానికి ఇదే మూలమని కర్మ సిద్ధాంతం వట్టి బూటకమని బసవన్న ఆ రోజుల్లోనే తేల్చేశారు.  ఈ సమాజం సమూహ నాయకత్వం సామాజిక న్యాయంతో ముందుకు నడవాలని కాంక్షించిన గొప్ప ప్రవచన కారుడు బసవన్న అని ఈ పుస్తకం నొక్కి వక్కాణించి చెబుతుంది.

మూఢ నమ్మకాలకు మూలమైన కర్మ సిద్ధాంతం ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన సిద్ధాంతం. వేల సంవత్సరాలుగా, సంచిత కర్మలు, పూర్వ జన్మల పాపాలతో నిండిన కర్మలు, పూర్వ జన్మల ప్రారబ్ధకర్మలు మరియు భవిష్యత్తులో అనుభవించబోయే ఈ జీవితంలో క్రియలు ప్రజలను బంధంలో బంధించి, యజ్ఞోపవీతాలలోని అగ్రవర్ణ ప్రజలను యజమానులుగా చేసి, శూద్రులను మానసిక బానిసలుగా మార్చాయి. శూద్రులు మరియు పంచమలను ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మరియు మతపరంగా నిరంతర దోపిడీకి దారితీసిన వివక్ష భావాన్ని సృష్టించడానికి సృష్టించిన జాత్యహంకార మరియు కులతత్వానికి ఇది మూలమని బసవన్న ఆ రోజుల్లోనే చెప్పారు.

భారతదేశ చరిత్రలో అర్చక సమాజాన్ని, మత వ్యవస్థను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఇద్దరు మహానుభావుల్లో మొదటి వ్యక్తి 12వ శతాబ్దంలో బసవన్న కాగా, 20వ శతాబ్దంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రెండోవాడు. చారిత్రాత్మకంగా, మనువిద్యాకుల గురించి అలారం మోగించిన చార్వాకులు (లోకాయతులు) ఉన్నారు. భేద సంస్కృతిని వ్యతిరేకించిన బుద్ధుడిలాంటి తత్వవేత్తలున్నారు. సనాతన హిందువులమని చెప్పుకుంటూనే, వైదిక బోధనలను మెత్తగా మార్చిన గాంధీజీ లాంటి వారు ఉన్నారు. రాముడు, కృష్ణుడి పేర్లు పెట్టుకుంటూ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన కబీర్ లాంటి వాళ్ళు ఉన్నారు. సామాజిక స్పృహ కల్పించిన జ్యోతిబా ఫూలే లాంటి వారున్నారు. వీరంతా తమ తమ కాలంలో వివిధ మార్గాల్లో సాగించిన వైదిక వ్యతిరేక నిరసనలు విప్లవాత్మకమైనవి. కానీ వేదబోధనలను ప్రత్యక్షంగా వ్యతిరేకించిన బసవన్న మరియు అంబేద్కర్లు మానవ గౌరవానికి సంబంధించిన తీవ్రమైన సామాజిక మార్పులలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయని ఈ పుస్తకంలో రంజాన్ దర్గా పేర్కొన్నారు.

భావజాలంలోని క్రూరత్వాన్ని వ్యతిరేకించే వైఖరి ఇద్దరి ఆలోచనల్లో స్థిరంగా ఉంటుంది.

సామాజిక, ఆర్థిక, మత మరియు రాజకీయ రంగాలలో సంస్కరణలు చాలా ముఖ్యమైన సంస్కరణలు. ఈ ఇద్దరు గొప్ప ఆలోచనాపరులు. ఏయే రంగాల్లో ముందుగా అభివృద్ధి కావాలో వీరి రచనల్లో చర్చించారు. అందరూ అక్షరాశ్యులవ్వాలి. చదువుకోవాలి అనేది వీరిద్దరి ఆలోచన కూడా.. అక్షరాశ్యులైనప్పుడు చైతన్యవంతులు అవుతారన్నది ఇద్దరి అభిప్రాయం. ఆలోచనల్లో మొదటిది సామాజికమైనది. దీని ప్రకారం, ఆర్థిక మరియు మతపరమైన రంగాలలో మార్పులు చేయవచ్చంటారు. వీరి సాంస్కృతిక పోరాట సరళిని అధ్యయనం చేసినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ మాత్రమే కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించగలదని స్పష్టమవుతుందని పుస్తకంలో ఈ రచయిత చర్చించారు. ప్రత్యామ్నాయ సామాజిక వ్యవస్థపై అంబేద్కర్ ఆలోచనలు బసవన్న వచనాల్లో ప్రతిఫలించాయంటారు.

ఈ ఇద్దరు తత్వవేత్తలు సామాజిక రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారో, అర్థం చేసుకోవాలంటే, భారతదేశ ఐదు వేల సంవత్సరాల అసమాన సమాజాన్ని గుర్తుకు తెచ్చుకోవాలంటారు. ఆరువేల సంవత్సరాల నాటిదని చెప్పబడిన ఋగ్వేదంలో “అనో భద్రః కృతవో యంతు విశ్వతః” (అన్ని చోట్ల నుండి మనకి శ్రేష్ఠమైన ఆలోచనలు రావాలి) అని చెప్పబడింది. అదేవిధంగా, మరోవైపు, ఋగ్వేదం “యత్ర విశ్వం భవతి ఏక నీదం” (విశ్వమంతా ఒక గూడు) అని పేర్కొంది. ఈ విధంగా, ‘నోటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు’ అనే విశ్వ మానవ సూత్రాన్ని ప్రబోధించే ఋగ్వేదం యొక్క ఆలోచనను పురుష సూక్తంలో చేర్చి, మానవ భేదం యొక్క ఆలోచనకు దారితీసింది. హిందూ సమాజంలో మానవ భేదాల ఆవిర్భావానికి ఇదే సరైన పునాది. ఈ పురుషుక్తవనాన్ని ఎందరో పండితులు స్తుతిస్తున్నారు. ఈ నాలుగు కులాలు తమ దైనందిన జీవితంలో హిందూ మతం పేరుతో అంటరానితనం మరియు కుల వివక్ష యొక్క ఆచారం యొక్క సత్యాన్ని దాచిపెట్టి, తమకు అనుకూలమైన ఈ పురుష పదానికి భిన్నమైన అర్థాన్ని సృష్టిస్తాయి. మనిషి తల, భుజాలు, చేతులు మరియు పాదాలు వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులను సూచిస్తాయంటారు.

ఈపుస్తకం చదివినప్పుడు బసవన్న – అంబేడ్కర్ ల కృషి సామాన్యమైనది కాదు. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం బసవన్న తన ప్రవచనాలతో ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఈనాటి ఆధునిక తరంలో అంబేద్కర్ నిరంతరం ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఈ పుస్తకం ద్వారా అర్థమవుతుంది. పుస్తకం తెలుగు అనువాదం అవ్వాలి. ఈ పుస్తకం తెలుగు పాఠకులకు చేరువ కావాలని ఆశిస్తున్నాను.

Leave a Reply