ప్రతి అడుగులో మట్టిని ముద్దాడిన
ఆమె పాదాలను
నీ ఇనుప గొలుసులేం చేస్తాయ్

ప్రతి అక్షరానికి కశ్మీర్ గాయాన్ని పూసిన
ఆమె సత్తువను
నీ సంకెల్లేం చేస్తాయ్

ప్రతి పదంలో ఆకుపచ్చరంగు పోసి
అడవిని కట్టిన ఆమె హృదయాన్ని
నీ ఖాకీ కుక్కలేం చేస్తాయ్

ప్రతి వాక్యంలో ఎరుపురంగును వొంపి
అమరులకు స్థూపాన్ని కట్టిన కలం మేస్త్రీలను
నీ పోలీసు గూండాలేం చేస్తారు

ఆమె గొంతులోంచి ఆజాదీ శబ్దం పురివిప్పితే
నియంతలు నెత్తురు కక్కి చస్తారు

ఇప్పుడు దేశమంతా ఆజాదీనే
కశ్మీర్ టు కన్యాకుమారి
వయా అరుంధతీ రాయ్.

Leave a Reply