ఒక్కొక్కరూ 
నిన్ను చెరిపేస్తామని
చెప్పే వాళ్ళే

కానీ ప్రతి సారీ
నువ్వో కొత్త చరిత్రగా
నెత్తుటి సంతకంగా
వేలాది పుటలుగా
వెలుగొందుతున్నావు

కోట్లాది ప్రజల
ఆకాంక్ష కలలు
నీలో దాగున్నవి

వాటిని ఛిద్రం చేసేందుకు
వాడెప్పుడూ ఆయుధాలనే
నమ్ముకున్నాడు

కానీ నువ్వెప్పుడూ
నిరాయుధ ప్రజల చేతులలో
సుత్తి కొడవలి నాగలి
పనిముట్లతోనే ఇన్నేళ్ల
యుద్ధాన్ని పోరాడుతూ
సేద్యం చేస్తున్నావు

పుడమీ ఆకాశమూ
సూర్యుడూ చంద్రుడూ
తోడుగా సాగే బాట నీది

వాడెప్పుడు ఏవేవో
కుట్రలు కుతంత్రాలతో
నిన్ను ఓడిద్దామని
విరుచుకు పడుతుంటాడు

కానీ గడ్డి పరకలతో
ఏనుగును బంధించిన
చేతుల చేవ నీదని
చరిత్ర చెబుతోంది

మనుషులను చంపితే
నిన్ను మట్టుబెట్టవచ్చని
యుగాలుగా వాడు
వస్తూనే వున్నాడు

కానీ నీవు
కోట్లాది ప్రజల గుండె
చప్పుడివి కదా

ఓటమిగా కనిపించేది
నీ మరో విజయానికి
దారులు వేస్తూనే వుంది

అమరత్వం ముందు
ఏదీ నిలవదు కదా
మరోసారి పిడికిలెత్తి
నీవు ఆకాశమంతా
నినాదమై వినపడుతూనే వుంటావు!!

(2026 నాటికి విప్లవాన్ని అంతం చేస్తామన్న వారికి)

2 thoughts on “సత్యమెప్పుడూ ఓడిపోదు

Leave a Reply