“న్యాయమూ, ప్రేమ లేకుండా శాంతి ఎల్లప్పుడూ గొప్ప భ్రాంతి మాత్రమే”

– బెల్జియన్ ఆర్చి బిషప్ హేల్దేర్ కెమరా

•             (Without justice and love, peace will always be a great illusion)

 హింస- అహింస- ప్రతి హింస లపై చర్చ ఈ నాటిది కాదు. అసలు హింస లేనిదేనాడు? దానికి ప్రతిగా హింసా భాధితుల ప్రతిహింస లేనిదేనాడు? రూపంలో చాలా మార్పులు జరిగివుండవచ్చు. పీడకుల హింస, పీడితుల ప్రతిఘటన- శ్రీ శ్రీ అన్నట్టు “ ఏదేశ చరిత్ర జూచినా ఏమున్నది గర్వకారణం ”.  మనదేశ చరిత్రలో ఇతిహాసాలు,పురాణాలన్నింటా హింసాత్మక సంఘటనలే? ఆయుధం లేని దేముడున్నాడా? అయితే,మనం ఇష్టపడే వారి చేసే ఏ పనినైనా సమర్తిoచుకుంటాం.రామాయణం,   భారతం లోని హింసలు దుష్ట శిక్షణ-శిష్టరక్షణ కోసమని. ఆ హింసను పొగుడుతుంటాం..ఆనాటి నిబంధనలు   ఉల్లంఘించి తపస్సు చేస్తున్నందుకు  శూద్రుడు శంభూకుని  తల  నరకడమూ హింస కాదు,అది ఆనాటి పాలకుల కర్తవ్యం. దుష్ట శిక్షణ కూడా. పాలక వర్గాలు తమస్వార్తప్రయోజనాలకోసం ఎలాంటి దుష్కృత్యాల కొడగొట్టినా, దానికి శాస్త్రసమ్మతముంటుంది. సమర్తించే వందిమాగాధులుంటారు. అమాయక జనమూ వుంది.కనుక పురాణకాలాల్లో హింస-ప్రతిహింస చర్చనే లేదు.ఇక గౌతమ బుద్ధుడు ఆవిర్భావించేంతవరకు అహింస కు ప్రాధాన్యతే లేదు. ఇప్పుడు భౌద్ధులూ హింసకు వెనుకాడడం లేదని శ్రీలంక, మయన్మార్ సoఘటనలు వెల్లడిజేస్తూనే వున్నాయి. నాడు అజీర్తితో భాధపడుతున్న అగ్నిదేమును కోసం శ్రీకృష్ణుని సలాహాపై ఖాండవదహనం చేశాడు అర్జునడు. దానికి బాలయ్యింది అందులో జీవిస్తున్న పశుపక్ష్యాదులు, వృక్ష సంపద. దానితో ఆగలేదు కదా,హింసా,ప్రతీహిమస్యలు జనమేజేయుని సర్పయాగం దాకా పోయింది. నాడు శ్రీకృష్ణుని స్థానంలో నేడు కార్పొరేట్లు వున్నారు,ఆధునిక సవ్యసాచి ఇంకెవ్వరు? మన మోదీ. కార్పొరేట్ల,పెట్టుబడి లాభాపేక్షకు  బలవుతున్నది తమ జల,జంగిల్,జమీన్ ల కై,తమకు రాజ్యాంగమిచ్చిన హక్కులకై పోరాడుతున్న ఆదివాసీలవో,వారికి అండగా నిలుస్తున్న మావోయిస్టులు. అయితే,గతం లో తమ హింసను సమర్తిమ్చుకోనేందుకు నాటి పాలకులకు “ధర్మ సంస్తాపనాయ యుగే,యుగే” లాంటి సామాన్యప్రజలకు అర్థం గాని సంస్కృత వాఖ్యాలున్నాయి.ఇక నేటి పాలకులకు, దేశాభివృద్ధి, కర్మాగారాలు నెలకొల్పడం, లక్షలాదిమందికి ఉపాధి, ఉద్యోగ కల్పనలాంటి మరీచికలూ వున్నాయి. నాటిలాగా సమర్థించే మేధావులు,ప్రచారం జేసే మీడియా వుంది. ఇంకే కావాలి కేంద్రానికి ఆదివాసీ హననానికి అడవుల స్వాధీనానికి.

అయితే, పాలకవర్గాల అణచివేతకు ప్రతిఘటన అదే రూపంలో మొదలయ్యేసరికి, విప్లవోద్యమం దేశంలో కొంత బలపడిన నాటి నుండి, ఈ దోపిడీ వ్యవస్థను కాపాడే శక్తులకు, దాన్ని సమూలంగా కూకటివేళ్లతో పెకలించాలని విప్లవిస్తున్న శక్తులకు మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక చర్చ మరింత విస్తృతం, తీవ్రతరమైంది. అదీ విప్లవోద్యమాన్ని, విప్లవకారులను హిoసావాదులుగా ప్రజలలో అభాసుపాలు చేసేoదుకేనని చెప్పక తప్పదు. మొన్నటికి మొన్న. నక్సలైట్ రాధక్క, ఇప్పుడు కా.మిడ్కో హత్యల అనంతరం  ఆ చర్చ, తెలుగు రాష్ట్రాలలో, మీడియాపరంగా మరింత ముందుకు వచ్చింది.

 “కన్పించేదంతా వాస్తవమైతే సైన్స్ తో పని లేదంటాడు”

మార్క్స్. 

 ‘తెరిచే కిటికీని బట్టి పరితెంచే పుష్పక రాగం ఉంటుంది/ గదికి,  మదికి గవాక్షాలుంటాయి’** అంటారు కవి    బాల గంగాధర తిలక్.

  పై అభిప్రాయాల వెలుగులో   మనం హింస,  , ప్రతి హింసలను విశ్లేషిస్తే, వాటి నిర్ధారణలో మన ప్రాపంచిక దృక్పథం ప్రధాన పాత్ర వహిస్తుందని స్పష్టమవుతుంది. హిందూ బ్రాహ్మణీయ సమాజంలో,  అగ్రవర్ణాల వారికి, పురుషులవిషయంలో  తొలి కాలాల్లో హింస అనే ప్రశక్తే లేదు. దానికి కారణం, వారు హింసకు పీడితులు కారుగా. ఇంకో విధంగా నిమ్న కులాలను, మహిళలను, హింసించే హక్కు, వారికి మనుధర్మం కల్పించింది. మహిళలను రెండవ శ్రేణి పౌరులుగా, కేవలం భర్తకు దాస్యం జేసే జీవిగా అన్ని మతాలూ పరిగణిస్తాయి. 

హింస ,  ముఖ్యంగా ,దళితులకు,  ఆదివాసీలకు, స్త్రీలకు,  మైనారిటీలకు, బహుళార్థం కలిగి ఉంది. కేవలం పైకి కనిపించే శారీరక హింసలు, గాయాలు మాత్రమే వారి పట్ల హింసకు సూచికలు  కావు..  అంతకుమించి, వారిని బాధపెట్టిదే మానసిక హింస-అంటరాని వాళ్ళంటూ చిన్న చూపు,సమాజ బహిష్క్రుతులుగా చూడటం, వారి వేష భాషల,  ఆహారపు అలవాట్లను చులకన చేసి, హేళనగా మాట్లాడడం- ఇవన్నీ హింసలే. స్వీయానుభవం ఉన్న వాళ్లకు మాత్రమే బాగా అర్థమయ్యే అనుభవాలు.

  ‘ ఏమన్నాను వాణ్ణి,  కొట్టానా? తిట్టానా’ అనే మాటలు గతంలో అగ్రవర్ణాల నోటి నుండి తరచుగా వినేవాళ్ళం.  నిజమే. కొట్టలేదు. తిట్టలేదు, . పదిమందిలో చాలా చులకన చేస్తూ,హీనంగా మాట్లాడాడు.వెకిలి చూపు చూశాడు. ఇవి వ్యక్తులను కించపరచి, ఎంత మానసిక వేదనకు గురిజేస్తాయో అనుభవించిన వారికి మాత్రమె  తెలుస్తుంది.

ఇక మహిళల విషయంకొస్తే భర్త  భార్యకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. . అతని దృష్టిలో ఆమె  ఆజ్ఞాని.  చేతకానిది అంటూ ఎప్పుడూ చులకనగా మాట్లాడుతాడు. అత్తమామలు చీటికిమాటికి ఆగ్రహంతో ప్రవర్తిస్తారు. ఇలా ఆమె వ్యక్తిత్వహననం నిత్యము జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఆమెపై శారీరక హింస ఉండకపోవచ్చు.  ఆమె నిత్యం మానసిక హింసకు గురవుతూనేవుంటుంది. ఆ విధంగా,  మానసిక హింసకు గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతులు ఎందరో మనకు కనిపిస్తూనే ఉన్నారు.  ఇందులో ఎక్కువగా కాలేజీ విద్యార్థినిలు ఉండడం గమనార్హం..

గాంధీయవాదులు, తమ అవసరాల కోసం అహింసను -సత్యాగ్రహం,నిరాహార దీక్షలు లాంటి  అహింస కార్యక్రమాలను వల్లించే   పాలకవర్గాలు  ప్రతిఘటనా హింసకు మాత్రమె వ్యతిరేకం. అహింస –అంటే  హింస కానిది అని అర్థం జేసుకోకూడదు.  అది మనకు మనం చేసుకునే స్వీయ హింస. అరాచకాలను,  దుర్మార్గాలను ధైర్యంగా ఎదిరించ శక్తి లేక, బలమైన శత్రువు  సానుభూతిని పొందేందుకు, మనపై మనం హింసను ప్రయోగించుకోవడమే గాంధి గారి అహింస. చరిత్రలో ఇది ఎక్కడ పాలకవర్గాల స్వభావాన్ని గాని, వ్యవస్థను గాని మార్చలేదు పోతే, బాధితులకు కొంత తాత్కాలిక  ఉపశమనం, అదీ పాలకవర్గపు దయాదాక్షిన్యాల పై. లభించవచ్చు.

ఇక విప్లవోద్యమం హింసావయుతమైనదని ఉదారవాద మేధావులు, తాము అహింసావాదులమని చెప్పుకునేవారు విప్లవోద్యమంపై తరచూ దాడి చేస్తుoటారు.- అసలు హింస ఎక్కడ మొదలవుతుందనే విషయం వీరు విస్మరిస్తారు. తామూ వ్యవస్థీకృత హిoసను అనుభవిస్తున్నారనే విషయాన్ని ఒప్పుకోరు. కారణం, అది, వారికి భరించదగ్గ స్తాయిలోనే వుంటుంది. వీరిలో సర్దుబాటు మనస్తత్వం ఎక్కువ. రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడరు. తమ బావప్రకటనా స్వేచ్చకు ఆటంకం కలిగినపుడు మాత్రం స్వేచ్చ , ఉద్యమాల గురించి మాట్లాడుతారు. వారిప్రతిఘటన ప్రకటనలతో,లేక నిరసన కార్యక్రమాలతో ఆగిపోతుంది.ఇక న్యాయస్థానాలు ఉండనే వున్నాయి. అయితే, తమ ప్రకటనలు, నిరసనలు, చివరికి న్యాయవ్యవస్థ తమను ఆదుకోవని గ్రహించి,  వారిలో  చాలా మంది మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఈ వ్యవస్థలోనే కాసింత వెసులుబాటు చూసుకొని జీవిస్తారు.రాజ్యమూ వారికీ ఆ వెసులుబాటు కలిగిస్తుంది కూడా.

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో వ్యవస్థీకృత హింసకు బలవుతున్నవారు, అత్యంత పీడితుల్లొ పీడితులు,  ఆ హిoషను ప్రతిఘటించేందుకు, తుదముట్టించడానికి చేసే ప్రయత్నంలో, తప్పనిసరి, చివరి ప్రయత్నమే ప్రతి హింసకు దారితీస్తుంది.  అయితే, ప్రతి హింస కేవలం సాయుధ రూపంలోనే ఉంటుందనుకోవాల్సినా అవసరం లేదు. వ్యవస్థీకృత హింసను ప్రతిఘటించే  ప్రయత్నంలో తోలి రూపాలు-  పాలకులను మానసికంగా,ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే నిరసన – అవి సమ్మెలో లేక రాస్తారోకోలు కావచ్చు.  ఇవన్నీ ప్రతి హింసకు రూపాలె.  ముందుగా చెప్పినట్టు, హింస అంటే శారీరక హింస మాత్రమే కావలసిన అవసరంలేదు.  పై నిరసన ఉద్యమాల ద్వారా పాలకవర్గాన్ని మానసికంగా కొంతకాలమైనా,కొంతమేరకైనా ఇబ్బంది పెట్టొచ్చు, అయితే,  ఈ నిరసన కార్యక్రమాలు బాధితులకు కొన్ని ఉపశమనం చర్యలు పొందేందుకు అవకాశం కల్పిస్తాయి తప్ప, వారి సమస్యల శాశ్వతపరిష్కారానికి   అంటే వాటికి మూలమైన వ్యవస్థ మార్పుకు దారి తీయవు.వ్యవస్థ చాలా శక్తివంతమైంది. దాని చేతిలో మీడియా, పోలీసు, సైన్యం ఉన్నాయి తనకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిపై పాలకవర్గo సామ దాన భేద దండోపాయాలను వినియోగిస్తుంది. ఈ మధ్యనే రెండేళ్ల క్రితం జరిగిన రైతాంగ ఉద్యమం,  పాలకవర్గాల కుట్రల, కుహకాలను, దానిఎత్తుగడలను బహిర్గతం చేసింది. మీడియా ద్వారా  రైతాంగ ఉద్యమంపై బురద జల్లుతూ, ప్రజల దృష్టిని ఆ ఉద్యమ లక్ష్యాల నుండి పక్కదోవ పట్టిస్తూ, మరొకవైపు పోలీసుల లాటీల, తూటాలను వినియోగిస్తూ ఉద్యమ అణచివేతకు  పాల్పడింది.  కేవలం, వ్యవస్థలో కొంత వెసులుబాటుకై చేస్తున్న ఉద్యమాలనే పాలకులు , అంత తీవ్రంగా అణచివేస్తుంటే, మరి మొత్తం వ్యవస్థ మార్పు కై పోరాటం చేస్తున్న ఉద్యమాల పట్ల పాలకుల దండనీతి ఎలా ఉంటుందో చెప్పాలా?

ఆ ఉద్యమాల పట్ల పాలకుల అనుసరించిన అతిక్రూర, అప్రజాస్వామిక ఫాశిస్టు  విధానాలు మనకు, గత దశాబ్ద కాలంలో,  పాలకులు, చత్తీస్ ఘర్ ఆదివాసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు చెబుతుంది. చట్టబద్హంగ,రాజ్యాంగ బద్దంగా తమకు సంక్రమించిన హక్కుల అమలు జేయాలని కోరుతేనే,  రాజ్యం వారిపై హింసాత్మక దాడులకు దిగినపుడు,న్యాయస్తానాలూ వారికి న్యాయం చేకూర్చవని తెలిసినపుడు వారి ముందున్న దారి ఏమిటీ? తమ సర్వహక్కుల కోల్పోయి బానిసలుగా బతకాలా లేక,తమ హక్కులకై రాజ్యంతో  పోరాడాలా? వారు రెండో మార్గం ఎంపిక చేసుకొనడంలో ఆశ్చర్యమేముంది!

మన ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ పై వాస్తవాలను పట్టించుకోరు. హింసకు,  ప్రతి హింసకు మధ్య గల తేడాను చూడరు.  చూసినా,  అంగీకరించరు.  వ్యవస్థీకృత హింసకు, పాలకుల హింసకు వ్యతిరేకంగా తప్పనిసరిగా జరుగుతున్న ప్రతి హింసను ఎలా చూడాలో, దాని పట్ల ఎలా వ్యవహరించాలో ఈ మేధావులకు తెలియదని చెప్పలేము. పోతే, వారి భయాలు వారికుంటాయి. వారికి తెలియనిది ఏమంటే ఒకటి సాధించాలంటే మరొకటిని పోగొట్టు కొనడానికి సిద్ధపడాలి. శాంతియుతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థను మార్చిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేవు. వ్యవస్థ మార్పునకు హింస ఏకైక  మార్గమా! 

ఇక్కడ హింస అంటే, ప్రతి హింస అని అర్థం చేసుకోవాలి. దాన్నే విప్లవ హింసగా పిలువా వచ్చు. అహింసయుతంగా వ్యవస్థను మార్చగలమని,  సామాజిక, ఆర్థిక,  మతపరమైన, లైంగిక అణితివేతలను,  దోపిడీని శాంతియుతంగా  నిరోధించగలమని వీరు అనుకుంటున్నారా? వ్యవస్థ మార్పు,  నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం, ఓట్ల ద్వారా సాధించగలమని ఈ మేధావులు నమ్ముతారా?  ఇది వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. వీరందరికీ ఎన్నికలపై నమ్మకం లేదు. ఈ ఎన్నికలు ఎంత బూటకమో ప్రతిసారి పాలకవర్గాల కుమ్ములాటల ద్వారా బహిర్గత మవుతూనే ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో,ఏ పార్టీ ఎప్పుడు ఏ పార్టీతో జతగడుతుందో తెలియని రాజకీయాల్లో,  ఎన్నికల బాండ్ల పేరట, కులం,  మతం,  ప్రాంతీయతత్వం- ఇవన్నీ  చాలవన్నట్టు,  ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగంతో పీటమెక్కిన వారు  వ్యవస్థలో సమూలమార్పునటుంచి, కొంత మార్పునైనా తెస్తారని ఎవరికైనా నమ్మకం ఉందా? గత దశాబ్దాల ఎన్నిక పండుగలు అలా జరగదని స్పష్టం జేస్తూనే వున్నాయి.

రాజ్యాంగం, చట్టబద్ధప్రజాస్వామ్యం-వీటిని రక్షించుకోవాలని తపనపడుతున్న చాలామంది ఉధారవాద ప్రజాస్వామ్యవాదులు , మధ్యతరగతి బుద్ధిజీవులకు ఆ రాజ్యాంగాన్ని, చట్టాలను  ఎవరు రూపకల్పన చేశారు? వారి వర్గ స్వభావం ఏమిటి? అనేది  తెలియదని కాదు. రాజ్యాంగ పరిషత్తులో  కనీసం ఎన్నికలనబడే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించేవారు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా,  చట్టాలు ఎవరు చేస్తున్నారు? వాటిని అమలు చేసేవారి వర్గ  స్వభావమే గాక, కుల దృక్పథం ఏమిటి? తమ వర్గప్రయోజనాల కతీతంగా,వాటిని నష్టపరిచేలా ఆ రాజ్యాంగ రూపకర్తలు రాజ్యాంగాన్ని రాసివుంటారని అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది.ఒకవేళ,ప్రజావుద్యమాల ఒత్తిడివల్ల పాలక వర్గం ప్రగతిశీల,ప్రజాస్వామ్య ముసుగుధరించి కొన్ని విధానాలను,చట్టాలను,  వారి వర్గప్రయోజనాలకు ప్రతికూలంగా వున్న  వాటిని రాజ్యాంగంలో  చేర్చినా,  చిత్తశుద్ధితో అమలు జేస్తారని మనం అనుకోగలమా? ఇంతవరకు అమలుజేసిన దాఖలాలు లేవు కదా!

వారి చిత్తశుద్ధిని మనకు ఇప్పటికే అటవీ చట్టాలు, పెస, సమాచార హక్కు చట్టం అమలు లోని బూటకం స్పష్టం చేయడం లేదా? ఇక రాజ్యాంగపరంగా కాశ్మీర్ పొందిన ఆర్టికల్ 370 మాటేమిటి? కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనప్పుడు చట్టబద్ధంగా కాశ్మీరీయులకు కల్పించిన హక్కులను,  నాటి సోషలిస్టు నెహ్రూ కాలం నుండి నేటి కరుడుగట్టిన హిందుత్వవాది మోడీ వరకు ఎవరైనా అమలు చేశారా? అంతెందుకు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పార్టీలు  ఏమైనా  ఉన్నాయా? రాజ్యాంగం ఎస్సీలకు ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్ల నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్న పాలకవర్గం మాటేమిటి?

ఇవన్నీ పరిగణలోకి తీసుకోవలసిన అంశాలే కదా! విప్లవ కవి శివ సాగర్ అన్నట్టు “చట్టాలు సంపన్నులకు చుట్టాలై న్యాయస్థానాలు బ్రాహ్మణ అగ్రహారాలు” అయినప్పుడు ఈ వ్యవస్థలో పీడితులకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చునా?

ఉత్పత్తి ప్రాంతాలలో జరిగే శ్రమ దోపిడీ హింసగానే పరిగణించాలి. తమ శ్రమకు తగినంత ప్రతిఫలం కోరుతూ శ్రామికులు చేసే ఆందోలనలపై,  యాజమాన్యం చేసే హింసను పరిగణలోనికి తీసుకోవాలి. అయినా అసమా సమాజంలో హింస లేనిదెక్కడ.?

అంతే కాదు ఈ వ్యవస్థలో ఏ సమూహాలకైనా కొన్ని రాయితీలు ఉంటే,  అవి ఇచ్చిన వారెవరు? ఇచ్చిన వారికి ఉపసంహరించుకునే హక్కు ఉంటుందని వేరే చెప్పాలా! అదేవిధంగా, వాటిని ఎప్పుడు, ఎంత కాలం, ఎంత మేరకు అమలు చేయాలనే నిర్ణయాధికారం కూడా ఆ రాయితీలు కల్పించిన పాలకవర్గానికి ఉంటుందని మనం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థలోనే సమన్యాయం, సమధర్మం ఉంటుందని అనుకునేవారు అమాయకులు మాత్రం కాదు. వారి ప్రయోజనాలు వారికుంటాయి. అలాగాక, వ్యవస్థ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంతరాలను పెంచుతుందని, కనీసం నిరసన తెలిపే హక్కును అణిచివేస్తుందని భావిస్తున్న ఉదార ప్రజాస్వామ్య వాదులు దానికి పరిష్కారం ఏం చూపుతారు?  ఎన్నికల ద్వారా పైన చెప్పినట్టు పాలకవర్గ ముఠాలలో ఒకరిని మార్చి మరొకరిని పీఠం ఎక్కించడం తప్ప మరి ఏమి సాధ్యం కాదని గత 75 సంవత్సరాల అనుభవాలు చెబుతాయి. మనకు ఇప్పుడు కావలసింది రాజకీయ ప్రత్యామ్నాయం కాదు, ప్రత్యామ్నాయ రాజకీయాలు అనే విషయం అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకొని మార్పుకై ఉద్యమించకపోతే, ప్రజలు మనల్ని క్షమించరు. కామ్రేడ్ వివి చెప్పినట్టు, నేరమే అధికారమై ప్రజలను నేరస్తుల జేసి శిక్షిoస్తుంటే, ఊరకె ఉన్న ప్రతివాడు నేరస్తుడే! మనం ఇప్పుడు నేరస్తులుగా మిగులుదామా?

ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయిందని, ఇంతవరకు అంతో ఇంతో పొందుతున్న ప్రజాస్వామిక హక్కులను ఇప్పుడు పొందే పరిస్థితి లేదని దీని మార్పు అవసరమని మెజారిటీ మేధావులకు తెలుసు. పోతే, ఈ పరిస్థితుల్లో ఎలా మార్పు రావాలి అనే విషయం కూడా వారికి అవగతమైనా, అంగీకరించడానికి ధైర్యం ఉండదు. పైన చెప్పినట్టు ఎన్నికల ద్వారా రాజకీయ పార్టీలను మార్చగలమే గాని,  పాలకవర్గ స్వభావాన్ని మార్చలేమని ఈ ఉదార  స్వభావ మేధావులకు అర్ధమైన అంగీకరించడానికి నిరాకరిస్తారు. కారణం వారు హింస-ఆహిoసల  జంజాటంలో కొట్టుమిట్టాకారణం వారు హింస-ఆహిoసల  జంజాటంలో that’s in some blood కొట్టుమిట్టా uti Last word is he speaks last  You are for Apple’s hardware happy birthday and we are looking forward to it sooner thడుతుంటారు.హిoసవున్న చోటా ప్రతి హిoస తప్పదని,లేకపోతె తమ ఉనికినే కోల్పోయే ప్రమాదముందని  గ్రహించిన పీడిత వర్గాలు, తమ విముక్తికై తామూ  ప్రతిహిoసకు దిగక తప్పదని గ్రహించారు.

•             బెల్జియన్ ఆర్చ్ బిషప్ హేల్దేర్ కెమరా  చెప్పినట్టు-

•             “హింస మూడు రకాలుగా వుంటుంది.

•             మొదటిరకం అన్ని రకాల హింసలకు మూలం.అది ఆధిపత్యానికి,పీడనకు,దోపిడీకి  చట్టబద్ధత నిస్తుంది. అవి నిత్యం కొనసాగేలా చూస్తుంది.,తన సమర్థవంతమైన యంత్రాంగంతో లక్షలాదిమంది ప్రజలను అణచివేస్తుంది,అంతం జేస్తుంది.

రెండవది విప్లవ హింస.అది మొదటి హింసను అంతం జేసేందుకు ఉద్భవిస్తుంది.

•             మూడవది-అణచివేసే హింస-  అన్ని హింసలకు మూలమైన మొదటిరకపు హింసకు సహాయకారిగా, రెండవ రకపు(విప్లవ) హింసను అణచివేస్తుంది.

రెండవ రకపు విప్లవ హింసకు కారణమైన  మొదటిరకపు  హింసను, విప్లవ హింసను అణచివేసే మూడవ రకాన్నీ  మరచినట్టు నటిస్తూ, రెండవ రకాన్నే “విప్లవ హింసను ” మాత్రమె  “హింస” అనడం కన్నా దుర్మార్గమైన కపటత్వం లేదు.”

ప్రపంచ చరిత్రలో, వ్యవస్థ  సమూలమైన మార్పు, తీవ్రమైన వ్యవస్థీకృత హింసకు  వ్యతిరేకంగా ప్రజల ప్రతి హింస లేకుండా జరగలేదని మనకు చరిత్ర చెబుతుంది.  చాలా అహింసాయుతంగా సాధించామనుకుంటున్న మన స్వాతంత్ర? పోరాటాన్ని పరిశీలిస్తే, నిజమైన స్వాతంత్రం కోసం భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆయుధ అవసరం గుర్తించారని చరిత్ర చెబుతూనే వుంది. పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు తమ కాలాలనాటి వ్యవస్థను కాపాడేందుకు ఆయుధాల పట్టారు. నేటి పాలకులు అదేమార్గం అవలంభిస్తున్నారు. ఇక, పీడిత ప్రజలు అదేమార్గాన్నే అవలంభివచక తప్పడం లేదు. –కాకపొతే, లక్ష్యం వేరే –దోపిడీ వ్యవస్థను సమూలంగా కూల్చివేయడం.

“  రెండు రెళ్ళు నాలుగన్నందుకు

  గూండాలు గండ్రాల్లు విసిరే సీమలో

  అహింస ఒక ఆశయమే కానీ/ఆయుధం ఎప్పుడూ కాదు,

  “ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమేమరి”

విప్లవ కవి శ్రీ శ్రీ

 అన్ని యుద్ధాలను అంతం జేసే యుద్ధమే, సామ్యవాద సమాజం కోసం చేసే యుద్ధం. ఇందులో రాత్రి, పగలు లాగా,అమవాస్య, పున్నమి లాగా ఓటమి గెలుపులుంటాయి. తప్పదు మరి.

Leave a Reply