కవిత్వం

మొక్కలను నాటుదాం

నీళ్లతో కాదు ఇప్పుడు ఆ నేలంతా నెత్తురుతో సాగు చేయబడుతుంది రండి మనమంతా కలిసి మొక్కలు నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాంఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కలను చూడడానికి ఒక ఉదయాన తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను
ఆర్ధికం

 అస్తవ్యస్త ఆర్థికం – మానవాభివృద్ధి  డొల్ల

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్‌... దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా   తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల
దండకారణ్య సమయం

ఆరు రోజుల్లో తొమ్మిది మంది మహిళలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వరదలు ముంచెత్తుతున్న ఈ వారంలో పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌లో పాలకులు పధ్నాలుగు మందిని చంపి నెత్తుటి వరదలు పారించారు. వీళ్లలో ఆదివాసులు ఎందరు? అచ్చమైన మావోయిస్టులు ఎందరు? అనే చర్చ ఆసక్తి ఉన్న వాళ్లు తేల్చుకోవచ్చు. ఈ హింసను ఖండిరచడానికి, లేదా మన రాజకీయ వ్యతిరేకతల వల్ల ఉదాసీనంగా ఉండటానికి మృతులను ఎలాగైనా గుర్తించవచ్చు. కానీ వాళ్లు మనుషులు. స్త్రీలూ పురుషులుగా చూడదల్చుకుంటే ఇప్పటికి తెలుస్తున్న వివరాల ప్రకారం తొమ్మిది మంది మహిళలు. మొదట ఘటనా వివరాలు చూద్దాం. ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో
వ్యాసాలు

భారతదేశంలో రాజకీయ ఖైదీలు: రాజ్య కుట్రపూరిత వ్యాజ్యాలు, ఏజెన్సీలు

5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది. మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు
సమీక్షలు

అనంత జీవనకథా ముకురం

ఒక రచనను దేశకాల నేపథ్యంలో వివేచించడం ఒక పద్ధతి. అలా వివేచించడం వల్ల ఆ రచన ఆదేశ స్థితిగతులను వివరించడంతో పాటు ఆ రచన ఆకాలాన్ని విశ్లేషిస్తున్న తీరులో వైరుధ్యాల్ని గమనించి ఆ వైరుధ్యాల స్వభావాన్ని విశ్లేషించిన తీరునూ గమనించవచ్చు. ఆ వైరుధ్యాలలో ఆ రచన ఎటువైపు నిలబడిందో రచయిత అవగాహనకుండిన శాస్త్రీయత ఏ పాటిదో అంచనా వేయవచ్చు. ఇటీవల మల్లెల నరసింహమూర్తి 'మాకూ ఒక నది కావాలి” కవిత్వాన్ని పై వివరించిన నేపథ్యంలో వివేచించడం ఈ వ్యాస పరిమితి. ఈ కవితలు రాసిన తేదీలను రచయిత ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ౨౦౦౪ లో ఈ కవి రాసిన
ఓపన్ పేజ్

ఈ  ‘తెలుగుదనం’  దేనికి?

కొన్ని ‘ఆలోచనలు’ భలే ఉంటాయి. దేనికి ముందుకు వస్తాయోగాని, అసలు విషయాలను బైటపెడతాయి. కె. శ్రీనివాస్‌ ఆగస్టు 15 ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘మరీ ఇంత ‘కళ’ తప్పిందేమిటి తెలుగుదనం?’’ అనే వ్యాసం అట్లాంటిది. కాకపోతే  తెలుగు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల గురించి వీలైనంత వెనక్కి వెళ్లి   పాత విషయాలే మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రగతిశీల సాహిత్య మేధో రంగాల మీద విమర్శనాత్మక పున:పరిశీలన పెరుగుతున్నది. ఇది చాలా అవసరం. ఎక్కడ బయల్దేరాం? ఎట్లా ప్రయాణిస్తున్నాం? దీని గురించి మన అంచనాలేమిటి? అని తరచి చూసుకోవడం మంచిది. ఒకప్పటి కంటే కాస్త ఎక్కువగా చుట్టుపక్కల
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు
నివేదిక

 A Report of the Seminar organised by Solidarity Forum for Adivasi Rights Struggles (SFARS) on9th and 10th of August, 2024 in Hyderabad

Indian government declared war on the Adivasi (Indigenous) people of Central and East India in the states of Chhattisgarh, Jharkhand, Maharashtra, Odisha and the bordering regions for the past two decades first with the launching of Salwa Judum in 2005 followed by Operation Green Hunt (the most comprehensive offensive yet) in 2009 and its subsequent intensification with the operations Prahar and Samadhan and then Operation Kagar (‘Last War’) launched in
stories

Diku

The dawn broke. The fragrance of Mahua flowers wafted intoxicatingly from the forest adjoining the village. Reelamala, Maini, and Budhini, activists of the women's organisation, finished their meeting and had to go to another village for the next task in their planned program. They quickly completed their morning routines, packed their bags, and set off. These were villages mostly inhabited by Adivasi people in Jharkhand, located either within or adjacent