వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!
వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు !శాంతికోసం యుద్ధమై వర్ధిల్లుఐ. రా. స. శాంతిచిహ్నం ఒకచేత“ఇంతిఫదా " సంకేతంతుపాకీని మరొక చేత పట్టిగాజాలో స్వేచ్ఛగా ఉండటానికినీ పసిమొగ్గల భవిష్యత్ కోసంరక్తసిక్త అన్వేషణల మధ్యసహచరుల త్యాగాల మధ్యఅగ్రరాజ్యాల కుట్రల మధ్యదురాక్రమణదారుల మధ్యపశ్చిమాసియా చిచ్చర పిడుగైనీ జాతి కోసంనీ నేల కోసంసాగించు యుద్ధాన్ని తుదివిముక్తి దాక వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!నీ నెత్తుటినేలలోశాంతిని పండించుపాలస్తీనా!నువ్విప్పుడు ఒంటరికాదునీపక్కన ఒమర్ ముక్తార్ స్ఫూర్తి ఉందిఅరాఫత్ త్యాగం నీతోడుందినువ్విప్పుడు పీడితదేశాల వేగుచుక్కవువర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!