మీరీ పుస్తకం చదివారా ?

మన కాలానికి లెనిన్

దు:ఖం అమితవేగంతో వీస్తుంది సూర్యుడు ప్రకాశించడు గాలి ప్రపంచమంతా నిద్రలేని బాధాగీతం పాడింది తిరగబడడం తెలిసిన ఆగాలికి కూడా నమ్మసాధ్యం కాలేదు మాస్కోలో ఒక గదిలో విప్లవానికి పుత్రుడూ జనకుడూ ఆయన ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడని.. సమాప్తి..సమాప్తి..సమాప్తి..అంటూ కవిత్వం రాసిన ప్రసిద్ద రష్యన్‌ కవి వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ. ఇది లెనిన్‌ అస్తమించినపుడు తన్నుకొచ్చిన దు:ఖాన్ని కవిత్వంగా రాశాడు, దు:ఖమొక్కటే కాదు..లెనిన్‌ జీవితాన్ని, నాయకత్వాన్ని, ఆచరణాత్మక సామ్యవాదపాలనను, తన కలలరష్యాను కార్మిక కర్షక కాంతుల్ని ఈ కావ్యం నిండా పరిచారు. ఈ వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ రాసిన వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ కావ్యం మహాకవి శ్రీశ్రీ అనువదించారు. మయకోవ్‌స్కీ గూర్చి
కవిత్వం

వంగల సంతోష్ కవితలు ఐదు

1.పిల్లలుపసిపిల్లలఊయ్యాలలోపాలస్తీనానీవొకప్రతిఘటనలరంగుల రాట్నవిని..!2. ఉదయాలు..!ప్రపంచమంతాఉదయించినసూర్యుడుఎందుకోపాలస్తీనాలోకనబడలేదు..?3.నెలవంకనెలవంకనుచూసిఒక్కపొద్దులు ఉండేరంజాన్ మాసం ఇలానెత్తుటితో తడవడం ఏలా..?4.గర్భం..ఏ శిశువుకైనారక్షణ స్థలంఅమ్మ గర్భంకానీఇప్పుడుపాలస్తీనలోఅమ్మ గర్భాన్నిచీల్చిననరమేధపు ఇజ్రాయిల్..!5.ప్రేమ…!సుర్మా పెట్టే నీ కండ్లల్లోఈ నల్లటి ధూళి ఏలానిన్ను ముద్దాడేఆ పెదాల మీదఈ వెచ్చటి నెత్తురు ఎలాఓ ప్రియా..!!(పాలస్తీనాకు బాసటగా…)
పత్రికా ప్రకటనలు

హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తల ఇండ్లపై ఎన్ ఐ ఏ  దాడులు

భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు భీమా కోరెగాన్ కేసులో వ్యవహరించినట్టుగానే ఈ శాన్య రాష్ట్రాల్లో కూడా  అసమ్మతిని అణచివేయడానికి దారులు వెతుకుతున్నాయి. విద్యార్థి నాయకులను, మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరెగాన్ కేసులో లాగానే కుట్రకేసుల్లో ఇరికిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా  సీపీఐ(మావోయిస్టు)ల కోసం పనిచేస్తున్నారని, ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ని ’ (నార్తన్ రీజినల్ బ్యూరో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఎన్ ఐ ఏ ఆరోపిస్తోంది. రైతుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, విస్థాపన సమస్యకు గురైన  వారి కోసం పనిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. సీపిఐ (మావోయిస్టు) తరపున
ఎరుకల కథలు

వెదుర్లు

అక్కడ యుద్ధం జరిగినట్లు వుంది. మృత కళేబరాల్లా ఉన్నాయి టమోటా మొక్కలు. సైనికుల దండయాత్రేదో జరిగినట్లుంది. పొలమంతా నానా భీభత్సంగా వుంది.  టమోటాలు చితికిపోయి నలిగిపోయి వున్నాయి. ఎకరా  పొలంలో ఎక్కడా ఒక మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఎరుకల దొరస్వామి గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పక్కనే అతడి భార్య ఏడో నెల గర్భిణి నీలమ్మ కండ్లల్లో  నీళ్ళు పొంగుతున్నాయి. ఆమె పక్కనే ఆరేళ్ళ కుర్రాడు. రాజు దిక్కుతోచకుండా అమ్మానాన్నల వైపు బిత్తరపోయి చూస్తూ వున్నాడు. ఏం జరిగిందో, టమోటా పంట మొత్తం ఎందుకిట్లా నాశనం అయ్యిందో, అమ్మానాన్న ఎందుకట్లా ఏడుస్తున్నారో వాడికి అస్సలు అర్థం కాలేదు.
సంభాషణ

బస్తర్‍లో నిర్బంధ రూపాలు

(ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10తేదీల్లో హైదరాబాదులో జరిగిన ఆలిండియా సదస్సు ప్రసంగం) అందరికీ లాల్ జోహార్. ఈరోజు ఇంత మందిని చూసి నాలో కాస్త ఆశ కలిగింది. మనం ఎప్పుడూ బస్తర్ గురించే మాట్లాడుతుంటాం, అందరూ దాని గురించే చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు పరిష్కారం లేదు. ఇదే అతి పెద్ద సమస్య. ఎంతకాలమని చనిపోతూ వుంటాం? ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, దేశానికి వివరించాలి. పోరాటం ఎందుకోసం జరుగుతోంది? నక్సలిజం అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల
నివేదిక

మావోయిస్టు నిర్మూనలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకం 

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో వున్నారు. ఈ సంవత్సరం, ఛత్తీస్‌గఢ్‌  ఈ ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు.  ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ. ఈ సీరీస్‌లో ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను స్క్రోల్‌ వెబ్‌ సైట్‌ అందిస్తోంది. ఆ ఫోటోలో మహిళ
కవిత్వం

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు !శాంతికోసం యుద్ధమై వర్ధిల్లుఐ. రా. స. శాంతిచిహ్నం ఒకచేత“ఇంతిఫదా " సంకేతంతుపాకీని మరొక చేత పట్టిగాజాలో స్వేచ్ఛగా ఉండటానికినీ పసిమొగ్గల భవిష్యత్ కోసంరక్తసిక్త అన్వేషణల మధ్యసహచరుల త్యాగాల మధ్యఅగ్రరాజ్యాల కుట్రల మధ్యదురాక్రమణదారుల మధ్యపశ్చిమాసియా చిచ్చర పిడుగైనీ జాతి కోసంనీ నేల కోసంసాగించు యుద్ధాన్ని తుదివిముక్తి దాక వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!నీ నెత్తుటినేలలోశాంతిని పండించుపాలస్తీనా!నువ్విప్పుడు ఒంటరికాదునీపక్కన ఒమర్ ముక్తార్ స్ఫూర్తి ఉందిఅరాఫత్ త్యాగం నీతోడుందినువ్విప్పుడు పీడితదేశాల వేగుచుక్కవువర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!
దండకారణ్య సమయం

మావోయిస్టు నిర్మూలనకు మరో వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ప్రధాన లక్ష్యం మావోయిజాన్ని అంతం చేయడం గురించి గురించి మాట్లాడటం. ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేవలం దండకారణ్య,  బస్తర్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు ఒక తేదీని, 2026 మార్చి కూడా ఇచ్చారు. వ్యూహాలు రచిస్తున్న తీరు, ప్రభుత్వం
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
సంభాషణ

కగార్ అమరుల స్థూపాల కూల్చివేత సందర్భంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్

చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్‌.టి.ఆర్‌. 1985 సెప్టెంబర్‌ 3న డాక్టర్‌ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్‌ కేసులను (కొడవటి సుదర్శన్‌ ఆర్‌.వై.ఎల్‌. కార్యకర్త) కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను