త్యాగాల తల్లుల పేగుబంధాలు.. వియ్యుక్క కథలు
వియ్యుక్క కథలు 6 సంపుటాలు నా చేతికందినప్పటి నుంచీ 6 పుస్తకాలు చదివి వివరంగా సమీక్ష గానీ, వ్యాసం గానీ రాయాలనుకుంటూనే ఉన్నాను. పుస్తకం వచ్చిన వెంటనే వస్తే ఉన్నంత తాజాదనం ఉండదేమో అనే ఆలోచన వల్ల ఇప్పటికి ‘‘అమ్మతనం’’ కి సంబంధించిన 8 కథలను ప్రత్యేకంగా పరిశీలించే పనికి పూనుకున్నాను. ఇక విషయంలోకి వస్తే ‘‘అమ్మతనం’’ పూర్వకాలంలో లేదా సాంప్రదాయంలో మాతృత్వం అనే మాటకు సరిపోల్చదగిన మాట. కానీ మనం అమ్మతనం అని అనుకోవడంలోనే సహజత్వం వ్యావహారికం ఉన్నాయని నా భావన. ఇప్పుడు కథల గురించి తెలుసుకుందాం. ‘‘పిల్లలు’’ అనే కథ తాయమ్మ కరుణ రాసింది. సుమ,